భార్యకు తీవ్ర రక్తస్రావం.. ఆస్పత్రికి తీసుకొస్తే ఎక్స్‌రే తీస్తే ఏం కనిపించిందో చూసి అవాక్కైన డాక్టర్లు.. ఇదేంటని ఆ భర్తను నిలదీస్తే..
ABN, First Publish Date - 2023-02-20T18:26:56+05:30
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎంతో అన్యోన్యంగా జీవితం గడుపుతున్నారు. ఈ దశలో
వాళ్లిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎంతో అన్యోన్యంగా జీవితం గడుపుతున్నారు. ఈ దశలో అతను ఒకరోజు భార్యను ఇంటికి దగ్గర్లోని హాస్పిటల్ కి తీసుకెళ్లాడు. వారు పెద్దాసుపత్రికి తీసుకెళ్లమని చెప్పారు. పెద్దాసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ ఆమెకు ఎక్సరే తీసిన వైద్యులు అవాక్కయ్యారు. ఏమైందని అడిగారు. చివరకు నిజం తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఊహించని ఈ సంఘటన వెనకున్న కథ తెలుసుకుంటే..
రాజస్థాన్(Rajasthan) రాష్ట్రం బరాన్(Badan) జిల్లాకు చెందిన దీపక్ అనే వ్యక్తి మూడేళ్ళ క్రితం షీలాబాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయిని బాగా చూసుకునేవాడు. ప్రస్తుతం షీలా నెలన్నర గర్భవతి. దీపక్ రౌడీ షీటర్(Rowdy Sheeter) గా మారాడు. దొంగతనాలు, దోపిడీలు చెయ్యడం, అక్రమ ఆయుధాలు ఉపయోగించడం చేస్తాడు. ఈ క్రమంలో దీపక్ తన దగ్గరున్న నాటు తుపాకీ తీసుకుని ఉత్తర్ ప్రదేశ్(Uttara Pradesh) రాష్ట్రంలో ఎటావా(Etava) నగరానికి బయల్దేరాడు. అతడిని వెళ్లద్దని షీలా అడ్డుపడింది. అడ్డుతప్పుకోమని చెప్పడంతో దీపక్ చేతుల్లో నుండి తుపాకీ లాక్కోడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆవేశానికి లోనైన దీపక్ ఆమె చేతుల్లో నుండి తుపాకీ లాక్కుని ఆమెను కాల్చేశాడు. తీవ్ర రక్తస్రావం అవుతున్న ఆమెను వెంటనే స్థానిక హాస్పిటల్ కు తీసుకెళ్లాడు. అక్కడి వైద్యుడు ఏమైందని అడగ్గా గుడికి వెళ్ళినప్పుడు పడిపోయింది, అక్కడ పదునైన కర్ర ఉండటంతో గుచ్చుకుని గాయమైంది అని చెప్పాడు. రక్తస్రావం ఎక్కువగా ఉండటంతో పెద్దాసుపత్రికి తీసుకెళ్లమని ఆ వైద్యుడు చెప్పాడు.
దీపక్ తన భార్య షీలాను పెద్దాసుపత్రికి తీసుకెళ్లగా ఎక్సరే తీసిన వైద్యులు అవాక్కయ్యారు. ఏమైందని అడగ్గా పొలం పనులు చేస్తుంటే వేటగాళ్ళు కాల్చారని చెప్పాడు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి వైద్యులు ఆమెను మెడికల్ కాలేజ్ కి తరలించి శస్త్రచికిత్స చేశారు. ఆమె వెన్నుపాములో నుండి 315 బుల్లెట్ బయటకు తీశారు. వారు ముందే పోలీసులకు సమాచారం అందించడంతో శస్త్రచికిత్స అయిపోయేలోపు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులను దూరం నుండే చూసిన దీపక్ అక్కడి నుండి పారిపోయాడు. శస్త్రచికిత్స చేసిన తరువాత కొద్ధి నిమిషాలకే షీలా మరణించింది.
పారిపోయిన దీపక్ ను ఇన్ఫార్మర్ల సహాయంతో పోలీసులు పట్టుకున్నారు. దీపక్ మీద దాదాపు 5 కేసులు ఉన్నాయని చెప్పారు. అతను గతంలో జైలు శిక్ష కూడా అనుభవించాడట. బ్యాంకులో దొంగతనం, అక్రమ ఆయుధాల కలిగి ఉండటం కూడా అతనికింద నేరాలుగా నమోదయ్యాయి. ప్రస్తుతం కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2023-02-20T18:34:16+05:30 IST