Viral: వామ్మో.. గాడిద కోపం ఇంత భయంకరమా? ఇలాంటి సీన్ ఎప్పుడైనా చూశారా?
ABN, Publish Date - Dec 29 , 2023 | 09:07 PM
హైనాపై గాడిద దాడికి చెందిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: కొన్ని జంతువులు సహజంగానే క్రూర స్వభావంతో ఉంటాయి. సింహం, పులి, హైనా.. వంటి మంసాహార జంతువుల దాడి చేసేందుకు అవకాశం వస్తే వదులుకోవు. సాధు జంతువులు మాత్రం ఇందుకు భిన్నం. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఇవి తమపై దాడి జరిగితే ఆక్రందనలు చేయడం మినహా భీకరమైన ప్రతి దాడులు చేయలేవు. అయితే, ఇలా ప్రశాంతంగా ఉండే కొన్ని సాధు జంతువులు కూడా తిక్కరేగిన సమయాల్లో బీభత్సం సృష్టిస్తాయి. ఇందుకు తాజాగా ఉదాహరణగా ఓ వీడియో నెట్టింట వైరల్‌గా (Viral Video) మారింది.
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ హైనా గాడిదపై ఎటాక్ చేసేందుకు ప్రయత్నించి. ఈ క్రమంలో, ఎదురు తిరిగి గాడిద హైనాకు పట్టపగలే చుక్కలు చూపించింది. అకస్మాత్తుగా ఆ గాడిద హైనా చెవి పెట్టుకుని గట్టిగా కొరికేసింది (Donkey attacks Hyena). దాన్ని నుంచి విడిపించుకునేందుకు హైనా తొలుత ప్రయత్నించినా సాధ్యపడలేదు. హైనా చెవి పట్టుకుని కొరుకుతూ గాడిద దాని వెంటే పరిగెత్తించింది. చివరకు హైనా ఎలాగొలా గాడిద నుంచి విడిపించుకుని ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని పారిపోయింది. అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఇదంతా వీడియో తీసి నెట్టింట పెట్టడంతో ఈ ఉదంతం నెట్టింట వైరల్‌గా మారింది.
జనాలకు ఈ వీడియో బాగా నచ్చడంతో పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. గాడిదకు కోపం వస్తే పరిస్థితి మరీ ఇంత భయంకరంగా ఉంటుందా అంటూ షాకైపోతున్నారు. గాడిదలకు ధైర్యం ఎక్కువని కొందరు చెప్పుకొచ్చారు. తిరగబడి పోరాడేందుకు అవేమాత్రం వెనకాడవని తేల్చి చెప్పారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో తెగ వైరల్ అవుతోంది.
Updated Date - Dec 29 , 2023 | 09:14 PM