ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: అదృష్టం బాగుంది.. లేకపోతే.. మద్యం మత్తులో అడవి ఏనుగుతో ఎలా ప్రవర్తించాడో చూడండి..

ABN, First Publish Date - 2023-05-12T16:03:05+05:30

సాధారణంగా ఏనుగులు సాధు జంతువులు. మనుషుల మధ్యలో ఉండడం అలవాటైన ఏనుగులు మనం ఎలా ప్రవర్తించినా సహిస్తాయి. అదే అడవి ఏనుగుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటికి చిరాకు కలిగిస్తే మన ప్రాణాలకే ప్రమాదం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాధారణంగా ఏనుగులు (Elephants) సాధు జంతువులు. మనుషుల మధ్యలో ఉండడం అలవాటైన ఏనుగులు మనం ఎలా ప్రవర్తించినా సహిస్తాయి. అదే అడవి ఏనుగుల (Wild Elephants) దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటికి చిరాకు కలిగిస్తే మన ప్రాణాలకే ప్రమాదం. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో (Viral Video) ఓ వ్యక్తి అడవి ఏనుగుతో నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. అయితే అతడి అదృష్టం బాగుండి ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తమిళనాడులోని (Tamilnadu) ధర్మపురిలో ఉన్న హోగెనక్కల్ అటవీ ప్రాంతంలో ఓ అడవి ఏనుగు రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తోంది. ఆ ఏనుగును చూసి కొంత మంది రోడ్డుపై ఆగారు. ఆ సమయంలో ఒక వ్యక్తి నడుచుకుంటూ ఆ ఏనుగు ముందుకు వెళ్లి నిలబడ్డాడు. దానికి దండం పెట్టాడు. ఆ ఏనుగు కాస్త భయపడి వెనకడుగు వేసింది. అయినా మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి వెనక్కి రాలేదు. ఏమాత్రం భయం లేకుండా ఆ ఏనుగుకు ఎదురుగా నిలబడ్డాడు. వెనుక ఉన్న ఆ ఏనుగు ఘీంకారం చేసింది.

Viral Video: ఆ అమ్మాయికి భవిష్యత్తు కనబడింది.. పెళ్లి వేడుకలో వధువును ఎలా రక్షించాడో చూడండి..

ఈ వీడియోను IFS అధికారి సాకేత్ బదోలా ట్విటర్‌లో షేర్ చేశారు. ``అలా చేయడం చాలా ప్రమాదకరం. ఆ ఏనుగు చాలా మర్యాదగా ప్రవర్తించి ఆ వ్యక్తిని వదిలేసింద``ని పేర్కొన్నారు. ఆ వ్యక్తిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ``జంతువుల జోలికి వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోకూడదు``, ``జంతువుల స్వేచ్ఛను గౌరవించాలి``, ``ఆ వ్యక్తి అదృష్టం బాగుంది`` అని కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-05-12T16:03:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising