ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: ఏనుగు వెనుక కాళ్లు ఎంత బలమైనవో చూడండి.. వైరల్ అవుతున్న వీడియో!

ABN, First Publish Date - 2023-05-14T15:53:32+05:30

అడవులను కొట్టేయడం, నీరు, ఆహార కొరత వంటి కారణాల వల్ల వన్యప్రాణులు మానవ నివాసాలలోకి ప్రవేశిస్తున్నాయి. ఆహారం కోసం అడవి జంతువులు సమీపంలోని గ్రామాలలోకి ప్రవేశిస్తాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అడవులను కొట్టేయడం (Deforestation), నీరు, ఆహార కొరత వంటి కారణాల వల్ల వన్యప్రాణులు (Wild Animals) మానవ నివాసాలలోకి ప్రవేశిస్తున్నాయి. ఆహారం కోసం అడవి జంతువులు సమీపంలోని గ్రామాలలోకి ప్రవేశిస్తాయి. ఇటీవలి కాలంలో పులులు, చిరుతపులులు మొదలైన క్రూర మృగాలు గ్రామాల్లోకి చొరబడుతూ ప్రజలను భయకంపితులను చేస్తున్నాయి. ఏనుగులు (Elephant) కూడా గుంపులు గుంపులుగా మానవ ఆవాసాల వైపు వస్తున్నాయి. వాటికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతున్నాయి.

వైరల్ వీడియోలో ఓ ఏనుగు పనస పండును (Jackfruit) తెంపేందుకు చెట్టు దగ్గర చాలా ప్రయత్నాలు చేసింది. తొండంతో పనస పండును అందుకునేందుకు ప్రయత్నించింది. అందకపోవడంతో ముందరి కాళ్లను పైకి లేపింది. వెనుక కాళ్లపైన (Elephant Hind Legs) నిల్చుని తొండంతో పనస కాయలను అందుకుంది. ఆ ఏనుగు పనస కాయలను తెంపుతున్నప్పుడు గ్రామస్థులు అక్కడకు చేరుకుని గొడవ చేశారు. ఆ వీడియోను IFS అధికారి సుశాంత నంద ట్విటర్‌లో షేర్ చేశారు.

Viral: పెళ్లి పీటల మీద నుంచి మధ్యలో వెళ్లిపోయిన వరుడు.. అతడి కోపానికి కారణమేంటో తెలిస్తే షాకవ్వాల్సిందే!

``పనస పళ్లను అందుకోవడానికి ఏనుగు తన వెనుక కాళ్లపై నిల్చుంది. ముందరి కాళ్ల కంటే ఏనుగు వెనుక కాళ్లు చాలా బలంగా ఉంటాయి. ఈ ఏనుగు దాదాపు 4 వేల కేజీలను వెనుక కాళ్లపై వేసి నిల్చుంద``ని సుశాంత నంద కామెంట్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు 43 వేల మంది వీక్షించారు. ఈ వీడియోపై తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-05-14T15:53:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising