ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Elon Musk: ఇచ్చినమాట తప్పిన మస్క్..? ట్విటర్‌లో పరిస్థితులు కుదుటపడ్డాయని అనుకుంటుండగా...

ABN, First Publish Date - 2023-02-23T21:45:44+05:30

మస్క్ ఇచ్చిన మాట తప్పారా.. ట్విటర్ ఉద్యోగులకు మరో ఝలక్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ట్విటర్‌ను చేజిక్కించుకున్నాక టెస్లా అధినేత ఎలాన్ మస్క్(Elon Musk) చేపట్టిన తొలగింపుల పర్వం(Layoffs) కార్పొరేట్ ప్రపంచంలో కలకలం రేపింది. సంస్థ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపింది. మస్క్ తొలిసారి చేపట్టిన తొలగింపుల్లో ఏకంగా సంస్థలో 50 శాతం సిబ్బంది ఉద్యోగం కోల్పోయారని ఓ అంచనా. ఆ తరువాత..ఇక తొలగింపులు ఉండవంటూ మస్క్ ఉద్యోగులకు హామీ ఇచ్చారట. దీంతో..పరిస్థితులు కుదుటపడ్డాయని ఉద్యోగులు భావిస్తున్న తరుణంలో మస్క్ మరో రెండు పర్యాయాలు ఉద్యోగులను తొలగించారని సమాచారం.

తాజాగా మస్క్ మరికొందరిని ట్విటర్‌ నుంచి తొలగించారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. సేల్స్, ఇంజినీరింగ్ శాఖల్లో ఈ తొలగింపులు(Layoffs) చోటుచేసుకున్నాయట. ఉద్యోగం కోల్పోయిన వారిలో ఒకరు నేరుగా మస్క్‌ కింద పనిచేసేవారని సమాచారం. ట్విటర్‌‌లో ప్రకటనల వ్యాపారానికి(Twitters Advt Business) సంబంధించి ఇంజినీరింగ్ వ్యవహారాలను పర్యవేక్షించేవారట. కాగా.. తొలగింపులు ఉండవని మస్క్ ప్రకటించాక సంస్థ ఉద్యోగులపై వేటు వేయడం ఇది మూడోసారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది.

మీడియా కథనాల ప్రకారం.. మస్క్ అంతకుమునుపు ఉద్యోగులకు డెడ్‌లైన్ విధించారట. ట్విటర్ యాడ్‌ల విధానాన్ని మెరుగుపరిచేందుకు వారికి వారం రోజుల సమయం ఇచ్చారట. అయితే..ఈ డెడ్‌లైన్ అందుకోలేకపోయిన వారే జాబ్ పోగొట్టుకున్నారా అన్న అంశంపై మాత్రం స్పష్టలేదు. ఈ అంశాలపై ట్విటర్ మాజీ ఉద్యోగి మార్సిన్ కడ్లుక్స్జా ట్విటర్ వేదికగా స్పందించారు. ట్విటర్ అడ్వర్‌టైజ్‌మెంట్ వ్యవస్థను రెండు మూడు నెలల్లో మెరుగుపరచవచ్చని పేర్కొన్నారు. మస్క్ కోరినట్టు వారం రోజుల వ్యవధిలో మార్పులు సాధ్యం కాకపోవచ్చని చెప్పారు.

Updated Date - 2023-02-23T21:45:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising