ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral News: లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన ఉద్యోగి.. 3 గంటల తర్వాత బయటపడి ఆఫీసుకెళ్తే.. హెచ్ఆర్ మాటలు విని అతడికి షాక్..!

ABN, First Publish Date - 2023-09-26T15:48:08+05:30

సాధారణంగా ఎవరైనా ఉద్యోగి ఆఫీస్‌కు తరచుగా ఆలస్యంగా వెళితే అతడి జీతంలో కోత పడుతుంది. బయోమెట్రిక్ విధానం వచ్చిన తర్వాత సరైన టైమ్‌కు పంచ్ చేయకపోతే ఆ రోజు గైర్హాజరుగానే నమోదవుతుంది. ఫలితంగా ఉద్యోగి జీతంలో కోత పడుతుంది.

సాధారణంగా ఎవరైనా ఉద్యోగి (Employee) ఆఫీస్‌ (Office)కు తరచుగా ఆలస్యంగా వెళితే అతడి జీతంలో కోత పడుతుంది. బయోమెట్రిక్ (Biometric) విధానం వచ్చిన తర్వాత సరైన టైమ్‌కు పంచ్ చేయకపోతే ఆ రోజు గైర్హాజరుగానే నమోదవుతుంది. ఫలితంగా ఉద్యోగి జీతం (Salary)లో కోత పడుతుంది. తాజాగా ఓ ఉద్యోగి ఆఫీస్ మెయింటనెన్స్ కారణంగా సరైన టైమ్‌కు పంచ్ చేయలేకపోయాడు. అయినా మేనేజ్‌మెంట్ అతడి జీతాన్ని కట్ చేసింది. ఆ ఉద్యోగి తన బాధను రెడ్డిట్ ద్వారా పంచుకున్నాడు.

``నేను నిన్న ఆఫీస్ ఎలివేటర్‌ (Lift)లో ఉండగా అది హఠాత్తుగా ఆగిపోయింది. మూడు గంటల పాటు అందులో ఒంటరిగా ఉండిపోయాను. ఎన్నో ప్రయత్నాల తర్వాత హెచ్‌ఆర్‌కు కాల్ చేయగలిగాను. అప్పుడు వారు వచ్చి నన్ను బయటకు తీశారు. అయితే ఆలస్యంగా పంచ్ వేస్తున్న కారణంగా ఆబ్సెంట్‌ పడుతుందని హెచ్‌ఆర్ (HR Manager)నాకు చెప్పారు. ఒకవేళ నాకు అబ్సెంట్ వేస్తే నేను సెలవు (Leave) తీసుకుని ఇంటికి వెళ్లిపోతానని చెప్పాను. అయితే సిబ్బంది కొరత కారణంగా పని చేయాలని వారు చెప్పారు. అయితే అటెండెన్స్ మాత్రం వేయలేమని చెప్పారు. నేను అలా పని చేయనని చెబితే వారు నన్ను బెదిరించడం ప్రారంభించార``ని ఆ ఉద్యోగి తన గోడు వెళ్లబోసుకున్నాడు.

iPhone 15: ఐఫోన్ 15‌ కింద పడితే పగిలిపోతుందా..? స్క్రీన్ డ్యామేజ్ అయిపోతోందా..? ఈ వ్యక్తి ఎలా టెస్ట్ చేశాడో చూస్తే..!

ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆఫీస్ మెయింటనెన్స్ విభాగానిది తప్పైనా తనను బాధ్యుడిని చేశారని, అటెండెన్స్ లేకుండా పని చేయమంటున్నారని అతడు యాజమన్యానికి ఫిర్యాదు చేస్తున్నట్టు తెలిపాడు. కాగా, ఆ ఉద్యోగి పోస్ట్‌పై నెటిజన్లు స్పందించారు. ``అలాంటి విషపూరిత వాతావరణంలో పని చేయలేం``, ``వీలైనంత త్వరగా మీరు వేరే సంస్థలో చేరండి``, ``ఎంత దౌర్జన్యం. ఉద్యోగులంటే కనీస గౌరవం లేదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-09-26T15:48:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising