ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Indian Railway: ఓ వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు రైల్వే అధికారుల షాకింగ్ సమాధానం.. అదేంటంటే

ABN, First Publish Date - 2023-05-08T18:32:43+05:30

సమాచార హక్కు చట్టం(RTI) కింద ఓ ఉద్యమకారుడు అడిగిన ప్రశ్నకు ఇండియన్ రైల్వే అధికారులు షాకింగ్ న్యూస్ వెల్లడించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సమాచార హక్కు చట్టం(RTI) కింద ఓ ఉద్యమకారుడు అడిగిన ప్రశ్నకు ఇండియన్ రైల్వే అధికారులు షాకింగ్ న్యూస్ వెల్లడించారు. భారతీయ రైల్వేలపై ప్రయాణికుల భారం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. దీంతో ప్రయాణికులు టిక్కెట్లు బుక్ చేసుకున్నప్పటికీ ప్రయాణించలేక పోతున్నారని తెలిపారు.

మధ్యప్రదేశ్‌కు చెందిన కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ దాఖలు చేసిన ఆర్‌టిఐ((RTI) పిటిషన్‌కు సమాధానం ప్రకారం 2022-2023లో రైల్వే బోర్డు (Railway Board) మొత్తం 1.76 కోట్ల ప్యాసింజర్ నేమ్ రికార్డ్ (PNR) నంబర్లను కలిగి ఉంది. దీని ప్రకారం 2.72 కోట్ల మంది ప్రయాణికులు వెళ్లాల్సి ఉందని చెప్పారు.అయితే వెయిట్‌లిస్ట్‌లో ఉన్నందున ప్రయాణం రద్దు చేసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. 2021-2022లో మొత్తం 1.06 కోట్ల PNR నంబర్లు, వీటి ప్రకారం 1.65 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణించాల్సి ఉండగా, ఆటోమేటిక్‌గా రద్దు చేయబడ్డాయి.

ఇండియన్ రైల్వేలో వాస్తవానికి రైళ్ల కొరత ఉంది. ప్రయాణికుల ప్రయాణానికి అనుగుణంగా రైళ్లు ఏర్పాటు లేకపోవడంతో కన్‌ఫర్మ్ టికెట్లను అందించలేకపోవడం, PNRలను రద్దు చేయడం వంటివి ఇండియన్ రైల్వేలో పునరావృతం అవుతున్నాయని తెలిపారు. 2014-15లో రద్దయిన PNRల సంఖ్య 1.13 కోట్లు కాగా, 2015-2016లో 81.05 లక్షలు. 2016-2017లో 72.13 లక్షలు, 2017-18లో 73 లక్షలు, 2018-2019లో 68.97 లక్షలకు చేరినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

2020-21లో వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నందున మొత్తం 38.89 లక్షల PNRలు రద్దు చేయబడ్డాయి. వీటిపై 61 లక్షల మంది ప్రయాణికులు తమ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు.

రైల్వేశాఖ ఏం చెబుతోంది

ప్రయాణికుల డిమాండ్‌కు తగ్గట్టుగా రైళ్ల ఏర్పాటుపై దృష్టి సారించాం.ఇది ప్యాసింజర్ల వెయిట్‌లిస్ట్ సంఖ్యను తగ్గిస్తామని రైల్వే శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. కోవిడ్ మహమ్మారి ముందు 10,186 రైళ్లను నడిపినట్లు తెలిపారు. ప్రస్తుతం 10, 678 రైళ్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థ, ట్రాక్ పనులు పునరుద్దరణ దశలో ఉన్నాయి. ఇవి పూర్తయితే ప్రయాణికులను అనుగుణంగా రైళ్లు అందుబాటులో ఉంటాయని రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు.

Updated Date - 2023-05-08T18:32:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising