ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Seema-Sachin: సీమా-సచిన్ ప్రేమ కథలో ఊహించని ట్విస్ట్.. ఇప్పుడు ఏమౌతుందో చూడాలి

ABN, First Publish Date - 2023-08-19T16:33:03+05:30

సీమా-సచిన్ ప్రేమకథ గురించి తెలియని భారతీయుడు ఉండడు. పాకిస్తాన్‌కు చెందిన సీమా హైదర్.. పబ్జీ గేమ్ ద్వారా పరిచయమైన సచిన్‌ని మనువాడేందుకు తన భర్తని వదిలేసి, పిల్లలతో సహా భారత్‌కు అక్రమంగా..

సీమా-సచిన్ ప్రేమకథ గురించి తెలియని భారతీయుడు ఉండడు. పాకిస్తాన్‌కు చెందిన సీమా హైదర్.. పబ్జీ గేమ్ ద్వారా పరిచయమైన సచిన్‌ని మనువాడేందుకు తన భర్తని వదిలేసి, పిల్లలతో సహా భారత్‌కు అక్రమంగా వచ్చింది. దీంతో ఆమె పేరు మార్మోగిపోయింది. ఓవర్‌నైట్ సెన్సేషన్ అయ్యింది. భారత్‌లోకి అక్రమంగా చొరబడటంతో.. ఆమెకు ఉగ్రవాద సంస్థలతో లింకులేమైనా ఉన్నాయా? అనే కోణంలోనూ విచారణ జరుగుతోంది. అంతేకాదండోయ్.. సినిమా ఆఫర్లనూ అందిపుచ్చుకుంటోంది. ఇలాంటి తరుణంలో.. ఒక ఊహించని ట్విస్ట్ వెలుగు చూసింది.


అదేమిటంటే.. సీమా హైదరాబాద్ మొదటి భర్త గులామ్ హైదర్ భారతదేశానికి వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే అతడు వీసా అప్లై చేసినట్టు సమాచారం. ఈ విషయం స్వయంగా అతడే వెల్లడించాడు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గులామ్ హైదర్ మాట్లాడుతూ.. తాను భారత్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నానని, కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యమవుతూ వస్తోందని పేర్కొన్నాడు. తాను పాకిస్తాన్‌కి కూడా వెళ్తానన్న గులామ్.. తన పిల్లల కోసం ఏ ప్లాట్‌ఫార్మ్‌కి అయినా వెళ్తానని, వారి కోసం గొంతెత్తుతానని తెలిపాడు. సీమా తన పిల్లల్ని తీసుకెళ్లినప్పటికీ.. తండ్రిగా వారికి ఎప్పుడూ అండగా ఉంటానని, ప్రేమను పంచుతానని పేర్కొన్నాడు.

ఇదే సమయంలో తెరమీదకొచ్చిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. సీమా, సచిన్‌ల ప్రేమకథపై సినిమా తీస్తున్న నిర్మాత్ అమిత్ జానీ.. గులామ్ హైదర్‌ను భారత్‌కు రావాల్సిందిగా ఆహ్వానం పంపాడట. ఈ సినిమాలో అతని పాత్ర కూడా ఉంటుంది కాబట్టి, సీమా భర్త గురించి మరింత సమాచారం తెలుసుకోవడం కోసమే అతడ్ని భారత్‌కి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. మరి, గులామ్ హైదర్ భారత్‌కి వచ్చాక ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. కాగా.. సీమా-సచిన్‌లపై రూపొందుతున్న సినిమాకి కరాచీ టు నోయిడా అనే టైటిల్ ఖరారు చేశారు.

Updated Date - 2023-08-19T16:33:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising