Viral: ప్రేమలో ఓటమితో డిప్రెషన్.. ఒంటరిగా ఉండలేక బొమ్మతో ప్రేమ పెళ్లి.. ముగ్గురు పిల్లలు కూడా..
ABN, First Publish Date - 2023-08-09T17:21:27+05:30
మనసు చాలా విచిత్రమైనది. దానికి ఎప్పుడు, ఎవరు నచ్చుతారో ఎవరూ చెప్పలేరు. ఎవరైనా ఏ వయసులోనైనా మరొకరితో ప్రేమలో పడొచ్చు. అయితే ఒక వ్యక్తి ఓ బొమ్మతో ప్రేమలో పడి పిల్లలను కూడా కనడం ఆశ్చర్యకరమైన విషయమే. అలాగని ఆ వ్యక్తి యువకుడు కాదు.. ప్రేమలో ఓడిపోయిన 40 ఏళ్ల వ్యక్తి.
మనసు చాలా విచిత్రమైనది. దానికి ఎప్పుడు, ఎవరు నచ్చుతారో ఎవరూ చెప్పలేరు. ఎవరైనా ఏ వయసులోనైనా మరొకరితో ప్రేమలో (Love) పడొచ్చు. అయితే ఒక వ్యక్తి ఓ బొమ్మతో ప్రేమలో పడి (Love with Doll) పిల్లలను కూడా కనడం ఆశ్చర్యకరమైన విషయమే. కొలంబియా (Colombia) రాజధాని బొగోటా (Bogota)లో నివసిస్తున్న క్రిస్టియన్ మాంటెనెగ్రో అనే వ్యక్తి గురించి తెలుసుకుంటే విస్మయం చెందడం మాత్రం ఖాయం.
క్రిస్టియన్ మాంటెనెగ్రో అనే వ్యక్తి కొద్ది రోజులుగా నటాలియా అనే బొమ్మతో ప్రేమలో ఉన్నాడు. నిజానికి క్రిస్టియన్ చాలా రోజుల క్రితం ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. కొద్ది రోజుల తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో ఆ యువతిని క్రిస్టియన్‌ను వదిలేసి వెళ్లిపోయింది. దీంతో క్రిస్టియన్ ఒంటరితనంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. ఒంటరితనాన్ని భరించలేకపోయాడు. అయితే మళ్లీ మరో అమ్మాయి జోలికి వెళ్లకూడదని ఓ బొమ్మను తయారు చేసి దానితో ప్రేమలో పడ్డాడు. ఆ బొమ్మకు నటాలియా అని పేరు పెట్టాడు.
Shocking: ఒకప్పుడు భారత్‌కు అవార్డులు తెచ్చిన ఈ వ్యక్తే.. ఇప్పుడు కోర్టు చుట్టూ చక్కర్లు.. ఇతడెవరో గుర్తు పట్టగలరా..?
నటాలియాను సాంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత నటాలియాతో కలిసి ముగ్గురు పిల్లలను కన్నాడు. పిల్లలను కనడం అంటే మరో మూడు చిన్న బొమ్మలను తయారు చేయడమన్నమాట. ``చూసేవాళ్లకు కాస్త విచిత్రంగా అనిపించవచ్చు. కానీ, జీవితాంతం నా నటాలియా నాతో ఉంటుంది. మేము కలిసి కూర్చుని ప్రతిదీ పంచుకుంటాము. నేను ఆమెను గాఢంగా ప్రేమిస్తున్నాను. ఆమె వచ్చాక నా రొటీన్ జీవింత సంతోషంగా మారింద``ని క్రిస్టియన్ చెబుతున్నాడు.
Updated Date - 2023-08-09T17:21:27+05:30 IST