Valentine's Week 2023: ఈ వారం అంతా ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో తెలుసా..!
ABN, First Publish Date - 2023-02-04T08:47:03+05:30
ఫిబ్రవరి ప్రేమను పెంచే నెల,.. ప్రేమికులను దగ్గర చేసే మాసం.
ఫిబ్రవరి నెల ప్రేమలో ఉన్నవారికి చాలా ప్రత్యేకమైంది ఎందుకంటే ఈ నెల ప్రేమకు ప్రసిద్ధి చెందింది. ఈ నెలలో జరుపుకునే, వాలెంటైన్స్ డే కి కాస్త ముందుగానే సంబరాలు మొదలవుతాయి. ఈ వేడుకులకు ఫిబ్రవరి 7నుంచి సంబరాలు ప్రారంభమవుతాయి. దీనిని వాలెంటైన్స్ వీక్ లేదా లవ్ వీక్ అని కూడా అంటారు. అంటే ఇష్టపడేవారు వారం మొత్తం జరుపుకుంటారు. ప్రేమికుల వారం రోజ్ డేతో ప్రారంభమవుతుంది. అయితే ఏ రోజు ఏం జరుపుకుంటారు అనే విషయంపై కాస్త అయోమయం ఉంటే ఇక్కడచూడండి. దీని ప్రకారం, ప్రణాళికను వేసుకోండి మరి.
1. రోజ్ డే: ఫిబ్రవరి 7
ప్రేమికుల వారం మొదటి రోజును రోజ్ డేగా జరుపుకుంటారు. ఈ రోజున మీ ప్రియమైన వారికి పువ్వులు ఇవ్వడం ద్వారా ప్రేమ వ్యక్తం చేస్తారు. వివిధ రంగుల గులాబీలు విభిన్న భావాలను సూచిస్తాయి. కాబట్టి గులాబీలను ఎంచుకునే ముందు వాటిని ఎవరికి ఏ భావాన్ని ప్రకటించడానికి ఇవ్వబోతున్నదీ తెలుసుకునే ఇవ్వండి. ప్రేమను మరింత పదిలం చేసుకోండి.
2. ప్రపోజ్ డే: ఫిబ్రవరి 8
రోజ్ డే తర్వాత మరుసటి రోజు ప్రపోజ్ డేగా జరుపుకుంటారు. ఈ రోజున, మీ ప్రత్యేక వ్యక్తికి ప్రేమను ధైర్యంగా వ్యక్తం చేయవచ్చు. తనకు నచ్చిన విధంగా రఢీ అయ్యి, వాళ్ళు మెచ్చే విధంగా మంచి గిఫ్ట్ తో వాలిపోండి. అంతమైన కబుర్లతో మొదలు పెట్టి ఆహ్లాద వాతావరణంలో మనసులోని మాటలను వారితో పంచుకోండి.
3. చాక్లెట్ డే: ఫిబ్రవరి 9
వాలెంటైన్స్ వీక్‌లో మూడవ రోజు చాక్లెట్ డే అవుతుంది. ఈ రోజున మీ భాగస్వామికి నచ్చిన చాక్లెట్లు ఇవ్వడం ఆనవాయితీ. ఈ రోజున, ప్రేమ జంటలు ఒకరికొకరు చాక్లెట్ బంచ్‌లు, చాక్లెట్ బుట్టలను ప్రత్యేక పద్ధతిలో బహుమతిగా ఇస్తారు. ఇవి ప్రేమను ఇద్దరి మధ్యనా చక్కని స్నేహాన్ని పెంచుతాయి.
4. టెడ్డీ డే: ఫిబ్రవరి 10
వాలెంటైన్స్ వీక్‌లో నాలుగో రోజు టెడ్డీ డే. ప్రేమికులు తమ భాగస్వామికి టెడ్డీ బేర్ ఇవ్వడం ద్వారా తమ ప్రేమను వ్యక్తం చేసినప్పుడు. ఆమె చిన్నపిల్లయిపోతుంది. తనకు నచ్చిన వాటికంటే దీనినే ప్రత్యేకంగా దాచుకుంటుంది. ప్రేమను పెంచే విధానాల్లో ఈరోజు ప్రేమికులకు మరింత ప్రత్యేకమైన రోజు.
5. ప్రామిస్ డే: ఫిబ్రవరి 11
ప్రేమ జంట ప్రేమికుల వారంలోని 5వ రోజును ప్రామిస్ డేగా జరుపుకుంటారు. మేము జీవితాంతం ప్రేమలోనే ఉంటామని, కలిసి ఉంటామని వాగ్దానం చేస్తారు. ఇది ఇద్దరు ప్రేమికులకు చాలా ముఖ్యమైన రోజు. ఇద్దరూ కలకాలం కలిసి సాగుతామని చేసే వాగ్దానంలో ప్రేమను పెంచే అవకాశం చాలా ఉంది.
6. హగ్ డే: ఫిబ్రవరి 12
ప్రేమికుల వారంలోని 6వ రోజున హగ్ డే జరుపుకుంటారు. ఒకరినొకరు కౌగిలించుకోవడంతో ప్రేమ, ఆప్యాయతను వ్యక్తం అవుతాయి. ఇద్దరినీ మరింత దగ్గరచేసే ఈరోజు ప్రేమికులకు ఉత్సాహాన్నిస్తుంది.
7. కిస్ డే: ఫిబ్రవరి 13
వాలెంటైన్స్ వీక్‌లోని 7వ రోజును కిస్ డేగా జరుపుకుంటారు, అంటే ఫిబ్రవరి 13న. ఈ రోజున తమ ప్రేమను అంతమైన కిస్ తో తెలుపుతారు.
8. వాలెంటైన్స్ డే: ఫిబ్రవరి 14
వాలెంటైన్స్ డే అనేది వాలెంటైన్స్ వీక్‌లో చివరి రోజు, అంటే ఫిబ్రవరి 14. ఈరోజును రకరకాలుగా ఫ్లాన్ చేస్తారు. ప్రేమికులకు ఉత్సాహాన్నిచ్చే దూరప్రయాణాలు, టూర్స్, ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటారు. డిన్నర్ డేట్, నచ్చిన షాపింగ్, నచ్చిన విధంగా ఈరోజును పార్టీలతో, సరదాగా గడుపుతారు. మొత్తానికి ఫిబ్రవరి ప్రేమను పెంచే నెల,.. ప్రేమికులను దగ్గర చేసే మాసం.
Updated Date - 2023-02-09T16:39:06+05:30 IST