ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Female breaks down: కారులో వ్యక్తి చేసిన పనికి కన్నీళ్లు పెట్టిన మహిళా వర్కర్..

ABN, First Publish Date - 2023-02-05T19:57:52+05:30

సమాజంలో అందరూ ఒకే మాదిరిగా ఉండరు. పరిస్థితుల ఆధారంగా ఎవరి జీవన స్థితిగతులు వారికి ఉంటాయి. ఎవరు ఏ స్థాయిలో ఉన్నా.. తమకన్నా తక్కువ స్థాయిలో ఉన్నవారిని చిన్నచూపు చూడకూడదు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్: సమాజంలో అందరూ ఒకే మాదిరిగా ఉండరు. పరిస్థితుల ఆధారంగా ఎవరి జీవన స్థితిగతులు వారికి ఉంటాయి. ఎవరు ఏ స్థాయి, స్థానంలో ఉన్నా.. తమకన్నా తక్కువ స్థాయిలో ఉన్నవారిని చిన్నచూపు చూడకూడదు. జీవనాధారం కోసం పనిని బట్టి వ్యక్తులను చులకనగా చూడడం అత్యంత అమానుషం. ఈ తరహా ప్రవర్తన బాధితుల హృదయాలను ఎంతగా నొప్పిస్తుందో తెలియజేసే ఓ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

ఓ వ్యక్తి తన లగ్జరీ కారు వేసుకుని గ్యాస్‌స్టేషన్‌కు వచ్చాడు. గ్యాస్ ఫిల్ చేయాలని సిబ్బందిని కోరాడు. విధుల్లో ఉన్న మహిళా వర్కర్ కారులో గ్యాస్ నింపింది. అనంతరం పేమెంట్ ఇవ్వాలని చాలా వినయంగా కోరింది. కానీ కారు యజమాని తల పొగరెక్కినట్టు ప్రవర్తించాడు. డబ్బులు గౌరవంగా మహిళా చేతికి ఇవ్వకుండా దురుసుగా కిందపడేశాడు. ఊహించని ఈ పరిణామంతో సదరు మహిళా వర్కర్ ఒక్కక్షణంపాటు నివ్వెరపోయింది. అంతలోనే తేరుకుని కిందపడ్డ నోట్లను ఒక్కొక్కటిగా ఎరుకుని క్యాష్ బ్యాగులో పెట్టింది. కానీ ప్రాణం చిన్నబోయినట్టు అనిపించి ఉద్వేగానికి గురైంది. కన్నీళ్లు పెట్టుకుంది. ఉబ్బికి వచ్చిన నీటిని ఒక చేత్తో తుడుచుకుంటూనే మళ్లీ పంప్ తీసుకొని మరో కారుకు గ్యాస్ నింపించేందుకు సిద్ధమైంది. చైనాలో వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రెడిట్ (Reddit) పోస్ట్ ఆన్‌లైన్‌లో చక్కర్లు కొట్టింది.

మహిళ ఉద్యోగికి ఎదురైన ఈ పరిస్థితిపై అందరూ విచారం వ్యక్తం చేస్తున్నారు. అత్యంత దరుసుగా ప్రవర్తించిన వ్యక్తిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘ ఇది చాలా బాధాకరం. కన్నీళ్లు తడుచుకుంటున్న ఆమె చూస్తే.. ఒక వ్యక్తి పట్ల ఇలా వ్యవహరించే వ్యక్తులు ఎలా ఉండగలుగుతారు?’’ అని ఓ యూజర్ రాసుకొచ్చాడు. ‘‘ ఇలాంటి వ్యక్తులకు జాలి, దయ వంటివి అస్సలు ఉండవు’’ అని మరో వ్యక్తి విమర్శించాడు. తమకంటే తక్కువ డబ్బున్న వ్యక్తులను చూసే సమయంలో అసలు క్యారక్టర్ బయటపడుతుందని మరో వ్యక్తి పేర్కొన్నాడు. ఆ వ్యక్తి కర్మ అనుభవిస్తాడని, ఏదో ఒక రోజు ఇలాంటి పరిస్థితే ఎదురవుతుందని మరో యూజర్ మండిపడ్డాడు.

Updated Date - 2023-02-05T20:01:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising