World Cup Final: ఫైనల్ మ్యాచ్ రోజు పెళ్లి.. అతిథుల కోసం పెళ్లి వారు ఎలాంటి ఏర్పాట్లు చేశారంటే.. వీడియో వైరల్!
ABN, First Publish Date - 2023-11-19T20:15:44+05:30
గత నెలన్నరగా ప్రపంచకప్ ఫీవర్ అందరినీ ఆవహించేసింది. టీమిండియా వరుస విజయాలతో ఫైనల్ చేరడంతో ఆ జోష్ మరింత పెరిగింది. ఈ రోజు ఆస్ట్రేలియాతో ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా తలపడుతోంది. ఫైనల్ మ్యాచ్ కావడం, అందులోనూ ఆదివారం కావడంతో అందరూ టీవీలకు అతుక్కుపోయారు.
గత నెలన్నరగా ప్రపంచకప్ (World Cup2023) ఫీవర్ అందరినీ ఆవహించేసింది. టీమిండియా (Team India) వరుస విజయాలతో ఫైనల్ (World Cup Final) చేరడంతో ఆ జోష్ మరింత పెరిగింది. ఈ రోజు ఆస్ట్రేలియాతో ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా తలపడుతోంది (India Vs Australia). ఫైనల్ మ్యాచ్ కావడం, అందులోనూ ఆదివారం కావడంతో అందరూ టీవీలకు అతుక్కుపోయారు. ఎంతో అవసరం ఉంటే తప్ప టీవీల నుంచి కళ్లు పక్కకు తిప్పడం లేదు. అయితే ఈ రోజు దేశవ్యాప్తంగా చాలా చోట్లు పెళ్లిళ్లు (Wedding) జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో అతిథుల కోసం పెళ్లి వారు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పంజాబ్ (Punjab)లోని ఓ పెళ్లిలో ఇలాంటి ఘటనే కనబడింది. పంజాబ్‌లోని ఓ పెళ్లి వేడుక వద్ద ఓ భారీ స్క్రీన్‌ను ఏర్పాటు చేసి ఫైనల్ మ్యాచ్‌ను ప్రదర్శిస్తున్నారు. చాలా మంది అతిథులు ఆ భారీ స్క్రీన్ మీదే తమ చూపులను నిలిపారు.ర పంజాబ్ జర్నలిస్ట్ గగన్ దీప్ సింగ్ ఆ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు (Viral Video).
World Cup Final: కీలక మ్యాచ్‌లో ఫెయిల్ అయిన గిల్, అయ్యర్.. నెటిజన్లు ఏమంటున్నారంటే..
ఆహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ చాలా ఉత్కంఠగా సాగుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఛేజింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ఆరంభంలోనే 3 కీలక వికెట్లను కోల్పోయింది.
Updated Date - 2023-11-19T20:15:46+05:30 IST