ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

longest bridges: మన దేశంలోని పొడవైన ఐదు వంతెనలివే... వీటి ప్రత్యేకతలేమిటో తెలిస్తే...

ABN, First Publish Date - 2023-03-12T11:07:47+05:30

five longest bridges in india: ఈ రోజు మనం దేశంలోని అతిపెద్ద, అందమైన వంతెనల గురించి తెలుసుకుందాం. వీటి గురించి తెలిస్తే ఎవరైనా ఎంతో ఆశ్చర్యపోతారు,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

five longest bridges in india: ఈ రోజు మనం దేశంలోని అతిపెద్ద, అందమైన వంతెనల గురించి తెలుసుకుందాం. వీటి గురించి తెలిస్తే ఎవరైనా ఎంతో ఆశ్చర్యపోతారు, ఎందుకంటే వీటిలో కొన్ని చాలా పొడవు(length)గా ఉంటాయి. మరి కొన్ని చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

భూపేన్ హజారికా సేతు భారతదేశం(India)లోనే అతి పొడవైన వంతెన. ఈ వంతెన పొడవు 9.15 కిలోమీటర్లు. వెడల్పు 12.9 మీటర్లు. ఈ రోడ్డు వంతెనను ధోలా-సాదియా(Dhola-Sadia) వంతెన అని కూడా పిలుస్తారు. అస్సాం(Assam) రాష్ట్రంలోని తిన్సుకియా జిల్లాలో లోహిత్ నది(Lohit River)పై ఈ వంతెన నిర్మితమయ్యింది, ఇది అస్సాం- అరుణాచల్ ప్రదేశ్‌లను కలుపుతుంది. ఈ వంతెనకు 2003లో అప్పటి అరుణాచల్ ప్రదేశ్(Arunachal Pradesh) ముఖ్యమంత్రి ముకుత్ మిథి శంకుస్థాపన చేశారు. 14 ఏళ్లలో నిర్మాణం పూర్తిచేసుకున్న ఈ వంతెనను 2017 మే 26న ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) ప్రారంభించారు.

బీహార్‌(Bihar)లోని పాట్నా జిల్లాలో గంగా నదిపై నిర్మించిన మహాత్మా గాంధీ సేతు పాట్నాను హాజీపూర్‌తో కలుపుతుంది. ఈ వంతెనను గంగా సేతు(Ganga Setu) అని కూడా అంటారు. 18,860 అడుగుల ఎత్తు, 5,750 మీటర్ల పొడవు ఉన్న ఈ వంతెన భారతదేశంలో రెండవ పొడవైన వంతెన. 2017 సంవత్సరంలో ధోలా-సాదియా(Dhola Sadia) వంతెన నిర్మాణానికి ముందు, ఇది భారతదేశంలో అతిపెద్ద వంతెన. బాంద్రా సీ లింక్ బ్రిడ్జ్ బాంద్రాను ముంబైలోని పశ్చిమ శివారు ప్రాంతాలకు కలుపుతుంది. ఈ వంతెనను రాజీవ్ గాంధీ(Rajiv Gandhi) సీ లింక్ అని కూడా పిలుస్తారు.

వర్లీ సీ లింక్ బ్రిడ్జ్ 8 ట్రాఫిక్ లేన్‌లతో 5.6 కిలోమీటర్ల పొడవైన వంతెన. దీనిమీదుగా ప్రతిరోజూ దాదాపు 37,500 కార్లు వచ్చి వెళ్తుంటాయి. బాంద్రా సీ లింక్ వంతెన నిర్మాణం 2000 సంవత్సరంలో ప్రారంభమైంది. 10 సంవత్సరాల తర్వాత2010 మార్చి 24న పూర్తయింది. దిబ్రూఘర్- ధేమాజీ(Dibrugarh- Dhemaji) జిల్లాలను కలిపే బోగీబీల్ వంతెన భారతదేశంలోనే అతి పొడవైన రైలు-రోడ్డు వంతెన.

బ్రహ్మపుత్ర నది(Brahmaputra river)పై నిర్మించిన ఈ వంతెన పొడవు 4.94 కిలోమీటర్లు. ఇది ఎగువ అస్సాం-అరుణాచల్ ప్రదేశ్‌లను కలుపుతుంది. వంతెన ఎగువ డెక్‌లో 3-లేన్ రహదారి, దిగువ డెక్‌లో 2-లైన్ బ్రాడ్ గేజ్ రైల్వే ట్రాక్‌ ఉన్నాయి. దీని నిర్మాణం 2000 సంవత్సరంలో ప్రారంభమైంది. ఇది 18 సంవత్సరాల సుదీర్ఘ కాలం(long time) తర్వాత 2018, డిసెంబర్ 25న ప్రారంభమయ్యింది. విక్రమశిల సేతు భారతదేశంలో ఐదవ పొడవైన వంతెన. బీహార్‌(Bihar)లోని భాగల్‌పూర్(Bhagalpur) జిల్లాలో గంగా నదిపై ఈ వంతెన నిర్మితమయ్యింది. దీని పొడవు 4700 మీటర్లు. ఇది NH 80- NH 31లను కలుపుతుంది.

Updated Date - 2023-03-12T11:19:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising