flies are turning gay: మానవ తప్పిదంతో స్వలింగ సంపర్కం బాటలో ఈగలు... ఇదంతా ఎలా జరుగుతున్నదంటే..
ABN, First Publish Date - 2023-03-20T07:55:42+05:30
flies are turning gay: జర్మనీకి చెందిన మ్యాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ కెమికల్ ఎకాలజీ(Max Planck Institute for Chemical Ecology) పరిశోధకులు ఇటీవల తమ పరిశోధనలో ఈగలకు సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలు కనుగొన్నారు.
flies are turning gay: జర్మనీకి చెందిన మ్యాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ కెమికల్ ఎకాలజీ(Max Planck Institute for Chemical Ecology) పరిశోధకులు ఇటీవల తమ పరిశోధనలో ఈగలకు సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలు కనుగొన్నారు. మగ-ఆడ ఈగలు సంభోగం కోసం దారితప్పుతున్నాయని కనుగొన్నారు. ఈ పరిశోధన(Research)లో ఈగలు స్వలింగ సంపర్కానికి అలవాటుపడుతున్నాయని శాస్త్రవేత్తలు ధృవీకరించారు. అయితే దీనికి పూర్తిగా మానవ తప్పిదాలే కారణమని శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో గుర్తించారు.
మానవుల కారణంగా వ్యాపిస్తున్న కాలుష్యం(Pollution) వల్ల ఈగలలో ఇటువంటి మార్పు వస్తోంది. స్పష్టంగా చెప్పాలంటే పెరుగుతున్న ఓజోన్ కాలుష్యం(Ozone pollution) కారణంగా ఈగల ప్రవర్తన మారుతోంది. ఈ కాలుష్యం కారణంగా ఈగల్లో ఫెరోమోన్స్(Pheromones) అనే హార్మోన్లు విడుదల కావడం లేదు. దీంతో ఈగలు ఆడ, మగ తేడాలను గుర్తించడంలో తీవ్ర ఇబ్బంది పడుతున్నాయి. ఓజోన్ స్థాయి 100 పీపీబీగా ఉండటంతో ఈగల్లో ఉండే ఫెరోమోన్స్ హార్మోన్(hormone) ప్రభావం వేగంగా తగ్గిపోతున్నదని గుర్తించారు.
దీని వల్ల ఈగలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని శాస్త్రవేత్తలు(Scientists) చెబుతున్నారు. ఈ హార్మోన్ లేకపోవడం వల్ల వాటి శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. శాస్త్రవేత్తలు చేపట్టిన ఈ పరిశోధన ప్రకారం 10 మగ ఈగల్లో కేవలం 7 ఈగలు(flies) మాత్రమే ఆడ ఈగలతో జతకడుతున్నాయని, మిగిలిన మూడు మగ ఈగలు మరో మగ ఈగలతో స్వలింగ సంపర్కానికి(homosexuality) అలవాటు పడుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Updated Date - 2023-03-20T08:29:20+05:30 IST