ఆ మొక్క.. మరో మొక్కను మొలవనివ్వదు.. దాని పూల వాసన చూస్తే మరణమే.. పశువులను ఆకర్షించే ఆ మొక్క ఎక్కడుందంటే..
ABN, First Publish Date - 2023-04-04T12:33:51+05:30
హిమాలయ(Himalaya) పర్వత మైదాన ప్రాంతాల్లో దాదాపు 10,000 అడుగుల ఎత్తులో ఒక రకమైన పూలు(flowers) కనిపిస్తాయి. వీటిని స్వీట్ పాయిజన్(Sweet Poison), వత్సనాభ లేదా అకోనైట్ అని అంటారు.
హిమాలయ(Himalaya) పర్వత మైదాన ప్రాంతాల్లో దాదాపు 10,000 అడుగుల ఎత్తులో ఒక రకమైన పూలు(flowers) కనిపిస్తాయి. వీటిని స్వీట్ పాయిజన్(Sweet Poison), వత్సనాభ లేదా అకోనైట్ అని అంటారు. లాటిన్ భాషలో అకోనిటమ్ ఫెరాక్స్ అని పిలుస్తారు. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయం(Attractive)గా ఉంటుంది. అయితే ఇది విషపూరితమైనది, ఈ పూవు సువాసన చూస్తే, ఎవరైనాసరే అపస్మారక స్థితి(unconsciousness)కి చేరుకోవాల్సిందే. తరువాత మరణానికి కూడా చేరువవుతారు.
ప్రపంచంలో ఎక్కడా లేని ఆయుర్వేద మూలికలు(Ayurvedic herbs) లభించే హిమాలయ పర్వతాలలో అకోనైట్ వంటి విషపూరితమైన మొక్కలు కూడా కనిపిస్తాయి. ఆయుర్వేదం ప్రకారం మధుమేహం(diabetes), పక్షవాతం వంటి వ్యాధులను నయం చేయడానికి ఇది అద్భుతమైన ఔషధం.
అయితే దీనిని ఉపయోగించడానికి ఒక నిర్దిష్ట పద్ధతి(specific method) ఉంది. ఈ మొక్క చుట్టూ ఏ ఇతర మొక్క లేదా గడ్డి పెరగదు. ఈ మొక్క జంతువులను తన వైపునకు ఆకర్షిస్తుంది. వెంటనే జంతువులకు వాటిని తిని అనారోగ్యం(illness) పాలవుతాయి. ఈ మొక్క హిమాలయ పర్వతాలలో నమిక్, హిరమణి హిమానీనదాల సమీపంలో కనిపిస్తుంది. జూలై, ఆగస్టు నెలల్లో ఈ మొక్కకు నీలి రంగు పూలు(Blue flowers) పూస్తాయి.
Updated Date - 2023-04-04T12:33:51+05:30 IST