ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral: టీవీలో చర్చ.. లైవ్‌లో ఎమోషనల్ అయిన మహిళా యాంకర్.. అందరూ చూస్తున్నారని తెలిసినా..

ABN, First Publish Date - 2023-02-11T17:11:44+05:30

తాను డైవర్స్ తీసుకోబోతున్నట్టు లైవ్‌లో ప్రకటించిన యాంకర్.. వీడియో వైరల్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: మరి కొద్ది రోజుల్లో వాలంటైన్స్ డే(Valentines day). తోడు లేని ఒంటరి పక్షులు ఈ రోజును తలుచుకుని భయపడిపోతున్నాయి. వాలంటైన్స్ డే రోజున కాలం ఎలా వెళ్లదీయాలో తెలీక తెగ ఖంగారు పడిపోతున్నాయి. పీకల్లోతు ప్రేమలో పడ్డవాళ్లు మాత్రం ప్రేమికుల రోజు కోసం వేయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. మనసైన వాళ్లకు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలా అనే ఆలోచనలతో బుర్రలు బాదేసుకుంటున్నారు. ఇక.. ప్రేమలో ఫెయిలైనోళ్లది మరో కథ. ప్రేమలోని అన్ని కోణాలు తరచి చూసిన అనుభవం వారిది. అందుకే ప్రేమా లేదూ దోమా లేదూ అంటూ లెక్చర్లు దంచేస్తుంటారు. ప్రేమ కోసం వెంపర్లాడకండీ అంటూ ఒంటరి పక్షులకు హిత బోధ చేస్తుంటారు.

ఇలాంటి భావోద్వేగపూరిత వాతావరణం నెలకొన్న టైంలో అమెరికాలోని ఫాక్స్ న్యూస్(Fox News) అనే టీవీ చానల్ ప్రేమపైనే చర్చ పెట్టింది. అందులో ఐదుగురు యాంకర్లు కూర్చోబెట్టింది. చర్చ మెల్లగా వాలంటైన్స్ డే వైపు మళ్లింది. వారిలో యాంకర్ తన పక్కనున్న జూలీ బాండారస్‌ను వాలంటైన్స్ డే గురించి ప్రశ్నించారు. ఆ రోజు తనకు ఏ గిఫ్ట్ వచ్చేవని అడిగారు.

అప్పటికే ఎమోషనల్ అయిపోయిన జూలీ ఆ ప్రశ్న వినగానే క్షణకాలం ఆగి ఆ వెంటనే అదో చెత్త అంటూ తేల్చి పారేసింది. భర్తతో కలిసున్నపుడు కూడా ఆయన ఏ గిఫ్టూ ఇవ్వలేదని చెప్పింది. దీంతో.. షాకైన తోటి యాంకర్.. ఇప్పుడు మీరు కలిసి లేరా..? అని ప్రశ్నించారు. దీంతో..తాను డైవర్స్ తీసుకోబోతున్నట్టు జూలీ లైవ్‌లో బయటపెట్టేసింది(Anchor announces divorce). ‘‘మొదటి సారి ఈ విషయం చెబుతున్నాను. నేను డైవర్స్ తీసుకోబోతున్నాను. ఇదే ఈ రోజు బ్రేకింగ్ న్యూస్’’ అంటూ ప్రకటించేసింది. తన 13 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్టు ప్రకటించేసింది ఆ యాంకర్.

Updated Date - 2023-02-11T17:12:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising