Fridge: ఫ్రిజ్‌లోంచి దుర్వాసన వస్తోందా..? వీటిని పాటించండి చాలు.. 30 నిమిషాల్లో ఆ చెడు వాసన మటాష్..!
ABN, First Publish Date - 2023-06-13T18:00:01+05:30
ఎన్నో పదార్థాలు ఫ్రిజ్ లో పెడుతుంటాం కాబట్టే చాలామంది ఇళ్ళలో ఫ్రిడ్జ్ లు వాసన వస్తుంటాయి. ఈ వాసన కారణంగా ప్రిజ్ లో ఏ పదార్థం ఉంచినా దానికి దుర్వాసన పట్టేస్తుంది. ఈ దుర్వాసన వదిలించుకోవడానికి మహిళలు చాలాకష్టపడుతుంటారు. కానీ ఆశించిన ఫలితం ఉండదు. అయితే ఓ సింపుల్ టిప్ తో ఫ్రిడ్జ్ లో ఉన్న దుర్వాసన కేవలం 30నిమిషాల్లో తొలగించుకోవచ్చు .
ఫ్రిడ్జ్ సగటు మనిషి లైఫ్ స్టైల్ లో భాగం అయిపోయింది. పాలు, పెరుగు, కూరగాయలు, పండ్లు, రాత్రి మిగిలిన కూరలు, వెన్న, ఇడ్లీ పిండి, దోశ పిండి ఇలా చెప్పుకుంటూ పోతే ఫ్రిజ్ లు ఖానా ఖజానాలు అని చెప్పవచ్చు. ఇన్ని పదార్థాలు ఫ్రిజ్ లో పెడుతుంటాం కాబట్టే చాలామంది ఇళ్ళలో ఫ్రిడ్జ్ లు వాసన వస్తుంటాయి. ఈ వాసన కారణంగా ప్రిజ్ లో ఏ పదార్థం ఉంచినా దానికి దుర్వాసన పట్టేస్తుంది. ఈ దుర్వాసన వదిలించుకోవడానికి మహిళలు చాలాకష్టపడుతుంటారు. కానీ ఆశించిన ఫలితం ఉండదు. అయితే ఓ సింపుల్ టిప్ తో ఫ్రిడ్జ్ లో ఉన్న దుర్వాసన కేవలం 30నిమిషాల్లో తొలగించుకోవచ్చు . ఇందుకోసం ఏం చేయాలంటే..
ఫ్రిడ్జ్ లో దుర్వాసన తరిమికొట్టాలంటే(bad smell reduce from fridge)
మొదట ఫ్రిడ్జ్ ఆఫ్ చేయాలి(unplug the fridge). ఆ తరువాత ఫ్రిడ్జ్ లో ఉన్న పదార్థాలను అన్నింటిని బయటకు తీయాలి. ఇలా చేయడం వల్ల ఫ్రిడ్జ్ శుభ్రపరచడం సులువు అవుతుంది. ఫ్రిడ్ఝ్ లో ఉన్న పదార్థాలు అన్ని బయటకు తీసి ఫ్రిడ్జ్ మొత్తం ఖాళీ చేసినతరువాత ఒక కప్పు నీటిలో బేకింగ్ సోడా కలిపాలి(add backing soda into cup water), ఒక పాత టూత్ బ్రష్(old tooth brush) తీసుకుని ప్రిడ్జ్ లోపల, ఉపరితలం మీద మురికి పోయేలాగా బ్రష్ చేయాలి. తరువాత పేపర్ టవల్స్(paper towels)సహాయంతో దీన్ని శుభ్రంగా తుడవాలి. ఒక్కోసారి ఫ్రిడ్జ్ లో పదార్థాలు, మరకలు చాలా గట్టిగా అతుక్కుపోయి ఉంటాయి. ఇందుకోసం వేడినీటిని స్ప్రే చేయాలి.
ఓ చిన్న కాటన్ ముక్క చాలు.. పుచ్చకాయ సహజంగా పండిందో.. రసాయనాలతో పండించారో ఈజీగా తెలుసుకోవచ్చు..!
సాధారణంగా ఎక్కువరోజులు క్లీన్ చేయకుండా అలానే వదిలేసిన ఫ్రిడ్జ్ లు చాలా ఘోరంగా దుర్వాసన వస్తాయి. ఈ దుర్వాసనను వదిలించుకోవడానికి కొన్ని కాటన్ బాల్స్(cotton balls) తీసుకోవాలి. వాటిని వెనీలా ఎక్స్ట్రాక్ట్ లో ముంచాలి(cotton balls dip in venilla extract). ఈ కాటన్ బాల్స్ ను ఒక పెద్ద బౌల్ లో ఉంచి ఆ బౌల్ ను ఫ్రిడ్జ్ లో కంపార్ట్మెంట్ మధ్యలో ఉంచాలి(venilla balls bowl place the center in fridge). ఇలా చేస్తే జస్ట్ అరగంటలోనే ఫ్రిడ్జ్ లో ఉన్న దుర్వాసన మొత్తం మాయమవుతుంది. ఫ్రిడ్జ్ ను ఇలా క్లీన్ చేసుకున్న తరువాత ఫ్రిడ్జ్ లో మళ్ళీ అన్నీ సర్దుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కుళ్ళిపోయిన పదార్థాలు, ఎక్కువకలాలం ఉపయోగించకుండా ఉంచేసిన పదార్థాలు, ఎక్స్ఫైరీ డేట్ అయిపోయిన పదార్థాలు అన్నీ తీసేసి ఫ్రెష్ గా సర్దుకుంటే ఫ్రిడ్జ్ చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది.
Viral Video: ఎర్రటి ఎండలో రోడ్డు పక్కన పడిపోయి ఉన్న ఒంటె.. ఏంటా అని వాహనాన్ని ఆపి వెళ్లి చూశాడో డ్రైవర్.. అసలు విషయం గ్రహించి..!
Updated Date - 2023-06-13T18:00:01+05:30 IST