ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Fridge: ఫ్రిడ్జ్ డోర్లను ఓపెన్ చేసి ఉంచితే జరిగేదేంటి..? నిజంగా గది అంతా చల్లగా అయిపోతుందా..? తప్పక తెలుసుకోవాల్సిన నిజాలివి..!

ABN, First Publish Date - 2023-04-06T18:07:45+05:30

ఎన్నో ఏళ్ళ నుండి ఫ్రిజ్ లు వాడుతున్నా ఎవరీకి తెలియని నిజాలు తెలుసుకుంటే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఇప్పట్లో ప్రతి ఇంట్లోనూ ఫ్రిజ్(Fridge) ఉంటోంది. ఉదయం లేవగానే పాలు తీసుకోవడంతో మొదలు.. రాత్రి నిద్రపోయే ముందు వాటర్ బాటల్స్ తీసుకునేవరకు సాగుతుంది. నిద్ర మధ్యలోనూ మంచినీళ్ళ కోసం లేస్తుంటాం. ఈ విధంగా ఫ్రిడ్జ్ డోర్(Fridge door).. బాత్రూమ్, బీరువాలకంటే ఎక్కువసార్లు తెరిచేస్తున్నామండోయ్.. కేవలం ఇది మాత్రమేనా.. ఇంట్లో చిన్నపిల్లలు(Small kids) ఉంటే ఫ్రిజ్ డోర్ తీయడం వాళ్ళకొక సరదా.. కొంత మంది పిల్లలు ఫ్రిజ్ డోర్ ఓపెన్ చేసి తమకు కావల్సింది తీసుకుని డోర్ వేయడం మరచిపోతుంటారు. పెద్దలేమో ఎండవేడిమి తట్టుకోలేక ఫ్రిడ్జ్ డోర్ తెరిచేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది? దీనివల్ల ముంచుకొచ్చే సమస్యలు ఏంటి? ఎన్నో ఏళ్ళ నుండి ఫ్రిజ్ లు వాడుతున్నా ఎవరీకి తెలియని నిజాలు తెలుసుకుంటే..

ఫ్రిడ్జ్ లో రిఫ్రిజిరేటర్ కాయిల్స్(Refrigerator coils) ఉంటాయి. ఈ కాయిల్స్ కు రిఫ్రిజెరాంట్(refrigerant) వాయువును కంప్రెసర్(compressor) సరఫరా చేస్తుంది. ఫ్రిజ్ లోపల చల్లదనం ఎక్కువైనప్పుడు ఈ వాయువు సరఫరా ఆగిపోయేటట్టు, లోపల వెచ్చదనం చేరగానే తిరిగి వాయువు సరఫరా అయ్యేట్టు సెన్సార్లు ఉంటాయి. దీనిప్రకారంగానే ఫ్రిడ్జ్ లో ఉష్టోగ్రతలు(Temperature) నిర్వహించబడతాయి. మాటిమాటికి ఫ్రిడ్జ్ డోర్ తెరవడం వల్ల గది ఉష్టోగ్రత ఫ్రిడ్జ్ లోకి ప్రవేశిస్తుంది. ఫ్రిడ్జ్ లోకి ఎప్పుడైతే వెచ్చదనం ప్రవేశిస్తుందో అప్పుడు కంప్రెసర్ లు యాక్టివేట్ అవుతాయి. పదే పదే ఫ్రిడ్జ్ డోర్ లు తెరవడం వల్ల కంప్రెసర్ రిఫ్రెజరాంట్ వాయువును సరఫరా చేస్తూనే ఉంటుంది. ఇదిలాగే కొనసాగితే ఆ కంప్రెసర్ పాడయ్యే అవకాశం ఉంటుంది.

ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసినప్పుడు బయట వెచ్చదనం లోపలికి వెళ్ళగానే.. లోపలున్న చల్లగాలితో కలుస్తుంది. అప్పుడు చల్లగాలి కాస్త కరిగి అది తేమగా మారుతుంది. ఈ తేమ డీప్ ఫ్రిడ్జ్ లో ఐస్ కొండలా పేరుకుపోవడానికి కారణం అవుతుంది. ఈ మంచు అధికమొత్తంలో పేరుకుపోతే ఫ్రిజ్ లో ఉండే కాయిల్స్ పనితీరు దెబ్బతినే అవకాశం ఉంటుంది

మాంసం(Meat), పాలు(Milk), గుడ్లు(Eggs), క్రీమ్(Cream), పన్నీర్(paneer) వంటివి స్థిర ఉష్టోగ్రత(Standard Temperature) కొనసాగినప్పుడే పాడవకుండా ఉంటాయి. పదే పదే ఫ్రిడ్జ్ డోర్ తీస్తే బయటి వెచ్చదనం లోపలికి చేరి కూలింగ్ ను మార్చేస్తుంది, ఫ్రిడ్జ్ లో ఏర్పడిన తేమ పదార్థాలపై చేరి పదార్థాలు పాడవుతాయి.

Read also: Shocking Video: షాకింగ్.. ఆకాశంలోంచి మిరుమిట్లు గొలిపేలా ఆ వింత వెలుగేంటి..? వీడియో తీస్తూనే జూమ్ చేసి మరీ చూస్తే..

బయటినుండి వెచ్చదనం లోపలికి రాగానే లోపల వాతావరాణాన్ని చల్లబరిచే క్రమంలో కంప్రెసర్ లు ఎక్కువగా పనిచేస్తాయి, ఫ్రిడ్జ్ పనితీరు పెరుగుతుంది. దీనివల్ల ఫ్రిడ్జ్ వేడెక్కుతుంది.

ఏ ఎలక్ట్రానిక్ వస్తువు అయినా ఎక్కువగా పనిచేస్తే అధిక విద్యుత్ వినియోగించుకుంటుంది. ఫ్రిడ్జ్ కూడా అధిక విద్యుత్ వినియోగించుకోవడం వల్ల కరెంట్ బిల్లు సాధారణం కంటే ఎక్కువ వస్తుంది.

కొన్ని జాగ్రత్తలు..

పొరపాటున ఫ్రిడ్జ్ డోర్ తీసి ఇక దానిగురించి మరచిపోయినప్పుడు మళ్ళీ దాన్ని మూసేసి జరిగిందేదో జరిగిపోయిందని సరిపెట్టుకోకూడదు.

మొదట ఫ్రిడ్జ్ ఫ్లగ్ ఆఫ్ చేయాలి.

ఫ్రిడ్జ్ లో తేమ ఏర్పడిందేమో చూడాలి.

వస్తువులు బయటకుతీసి సాధారణ ఉష్ణోగ్రతలో ఉంచేయాలి.

ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేసుకుని ఎలాంటి తేమ లేదనిపించాక ఫ్రిడ్జ్ ఫ్లగ్ ఆన్ చేయాలి. సుమారు 6గంటలు ఫ్రిడ్జ్ ను అలాగే ఉంచి ఆ తరువాత ఫ్రిడ్జ్ లో అన్నీ సర్దుకోవాలి.

అప్పుడప్పుడు సెకెన్ల నుండి నిమిషాల వ్యవధిలో ఫ్రిడ్జ్ డోర్ తీస్తుంటే పర్లేదు. కానీ.. డోర్ తీసి వేయడం మరిచిపోతే మాత్రం లోపలి పదార్థాలకు, ఫ్రిడ్జ్ కు కూడా దెబ్బే. మరొక్క ముఖ్యవిషయం ఏమిటంటే రాత్రి పడుకునే ముందు టీవీలు, లైట్లు ఆఫ్ చేసినట్టు కొందరు అమాయకత్వంతో ఫ్రిడ్జ్ కూడా ఆఫ్ చేస్తుంటారు. ఇలా ఫ్రిడ్జ్ ను వాడితే నష్టాలే ఎక్కువ వస్తాయి.

Read also: AC vs Coolers: కూలరా..? ఏసీనా..? రెండింటిలో ఏది బెస్ట్..? దేని నుంచి వచ్చే గాలి మంచిది..? చాలా మందికి తెలియని నిజాలివి..!

Updated Date - 2023-04-06T18:28:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising