ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Fruit And Vegetable Peels: దానిమ్మ కాయల తొక్కలను పారేస్తున్నారా..? ఇది తెలిశాక మాత్రం ఆ పొరపాటు అస్సలు చేయరు..!

ABN, First Publish Date - 2023-09-22T12:57:45+05:30

దానిమ్మలో పోషకాల గురించి ఎంత చెప్పినా తక్కువే. కానీ దానిమ్మ కాయను వొలవగానే ఆ తొక్కను పడేస్తుంటారు. దానిమ్మ తొక్క వల్ల బోలెడు లాభాలున్నాయి. కేవలం దానిమ్మ మాత్రమే కాదు.. ఈ ఐదు రకాల తొక్కల గురించి తెలిస్తే షాకవుతారు..

ఆరోగ్యానికి పండ్లు చాలా మంచివి. చాలావరకు పండ్లమీద తొక్కలు వలిచి లోపలి పండు తింటూంటాం. ఇక దానిమ్మ పండు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎర్రగా ఉండే ఈ పండు లోపల విత్తనాలు నిగనిగలాడుతూ ఆకట్టుకుంటాయి. తినడానికి కూడా అంతే రుచిగా ఉంటాయి. దానిమ్మలో పోషకాల గురించి ఎంత చెప్పినా తక్కువే. కానీ దానిమ్మ కాయను వొలవగానే ఆ తొక్కను పడేస్తుంటారు. దానిమ్మ తొక్క వల్ల బోలెడు లాభాలున్నాయి. ఇవి చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. కేవలం దానిమ్మ మాత్రమే కాదు.. ప్రతిరోజూ చెత్తబుట్టలోకి వెళ్లే బోలెడు పండ్ల తొక్కలు అందాన్ని, జుట్టుకు మెరుపును అందిస్తాయి(fruit peels for skin and hair). పండ్లలో ఉన్నంత పోషకాలు ఈ తొక్కలలో కూడా ఉంటాయి. వీటిని వాడితే అద్భుతం జరుగుతుంది.

దానిమ్మ తొక్క.(pomegranate)

దానిమ్మ కాస్త మెత్తని కలపను పోలి ఉంటుంది. దీన్ని ముఖానికి ఉపయోగించవచ్చని చాలా మందికి తెలియదు. కానీ దానిమ్మ పండు తొక్కలు అద్భుతమైన స్క్రబ్ గా ఉపయోగపడతాయి. దానిమ్మ తొక్కలను ఎండబెట్టి పొడి చేసి నిల్వచేసుకోవాలి. ముఖాన్ని స్ర్కబ్ చెయ్యాలని అనుకున్నప్పుడు ఈ పొడిలో కొన్ని చుక్కల నూనె వేసి దీంతో స్ర్కబ్ చేయాలి. కేవలం ఒక్కసారి ఇలా చేయడం వల్ల ముఖంలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది.

మామిడి తొక్క..(mango peels)

పండ్ల రారాజు మామిడిపండును రుచికోసం తినేవారు ఎక్కువ. అయితే ఈ మామిడి తొక్కలు ముఖాన్ని జిగేలుమనిపిస్తాయి. మామిడి పండు తొక్కలను పేస్ట్ చేసి ముఖానికి ఫేస్ ప్యాక్ లాగా వేసుకోవాలి. పొడిచర్మం ఉన్నవారి ముఖాన్ని హైడ్రేట్ గా మార్చడంలో ఇది సహాయపడుతుంది.

Husband: భార్యను చంపి 15 ఏళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న భర్త.. ఒకే ఒక్క క్లూ‌ తో పోలీసులు ఎలా పట్టేశారంటే..!



బంగాళాదుంప తొక్క..(potato peels)

బంగాళాదుంప రసాన్ని ముఖానికి ఉపయోగించడం వినే ఉంటాం. కానీ బంగాళాదుంప తొక్కను ఉపయోగించడం ద్వారా సాగిపోయిన ముఖ చర్మం బిగుతుగా మారడంలో సహాయపడుతుంది. ముఖం మీద నల్ల మచ్చలను తగ్గిస్తుంది. అంతేకాదు బంగాలాదుంప తొక్కలను పేస్టులా చేసి జుట్టుకు రాసుకుంటే జుట్టు పొడవుగా పెరగడమే కాదు నిగనిగలాడుతుంది.

నిమ్మ తొక్క..(lemon peels)

నిమ్మకాయ తొక్కను ముఖానికి, జుట్టుకు కూడా ఉపయోగించవచ్చు. నిమ్మతొక్కలను ఎండబెట్టి పొడిచేసుకోవాలి. ఈ పొడిని ముఖానికి స్ర్కబ్ లా ఉపయోగించవచ్చు, ఫేస్ ప్యాక్ లా వేసుకోవచ్చు. ఈ తొక్కలను జుట్టు శుభ్రం చేసుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. ఫలితాలు మాత్రం అద్బుతంగా ఉంటాయి. నిమ్మతొక్కలో విటమిన్-సి ఉంటుంది. ఇది చర్మానికి చాలా మంచిది.

నారింజ తొక్క..(orange peels)

నారింజ తొక్కల గురించి ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. వీటిలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. పచ్చినారింజ తొక్కలను నొక్కినప్పుడు వచ్చే నూనె, రసం లాంటి పదార్థాన్ని నేరుగా ముఖానికి అప్లై చేయవచ్చు. లేదా నారింజ తొక్కలు ఎండబెట్టి పొడిచేసి నిల్వచేసుకోవచ్చు. దీన్ని ముఖానికి ప్యాక్ లా ఉపయోగించవచ్చు. ఇదే పౌడర్ ను పేస్ట్ లా చేసి జుట్టుకు అప్లై చేయవచ్చు. దీనివల్ల జుట్టు మెరుస్తుంది.

Birth Control Pills: బర్త్ కంట్రోల్ పిల్స్‌ను వేసుకుంటే.. నిజంగా ముఖంపై మొటిమలు తగ్గిపోతాయా..? డాక్టర్లు ఏం చెప్తున్నారంటే..!


Updated Date - 2023-09-22T12:57:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising