ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

March month: మార్చి నెలలో కొత్త రూల్స్.. మీపై ఎఫెక్ట్ ఎలా ఉంటుందో తెలుసా..

ABN, First Publish Date - 2023-02-27T19:22:58+05:30

వచ్చేనెల మార్చి 1 (March 1) నుంచి కొన్ని నూతన నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి. మరి మార్పులు ఏమిటి?.. ఎప్పటి నుంచి అమల్లోకి రాబోతున్నాయో? ఒకసారి పరిశీలిద్దాం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బ్యాంకింగ్ (Banking), ఫైనాన్సియల్ (Financial), ఇతర కీలక రంగాలకు సంబంధించి ఎప్పటికప్పుడు కీలక మార్పులు జరుగుతుంటాయి. కొత్త రూల్స్ ఆచరణలోకి రావడం.. పాత రూల్స్ మరుగున పడిపోవడం సర్వసాధారణం. వచ్చేనెల మార్చి 1 (March 1) నుంచి కొన్ని నూతన నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి. మరి మార్పులు ఏమిటి?.. ఎప్పటి నుంచి అమల్లోకి రాబోతున్నాయో? ఒకసారి పరిశీలిద్దాం..

ఈఎంఐలు మరింత భారమవ్వొచ్చు..

తిన్నా.. తినకపోయినా ఖచ్చితంగా ఈఎంఐలు (EMIs) చెల్లించే సామాన్యులు చాలామంది ఉన్నారు. అయితే మార్చి 1 నుంచి ఈఎంఐలు భారమయ్యే అవకాశాలున్నాయి. కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ (RBI) ఇటివలే రెపో రేటును (Repo rate) స్వల్పంగా పెంచింది. దీంతో బ్యాంకులు ఎంసీఎల్‌ఆర్‌ను (MCLR) పెంచే అవకాశాలున్నాయి. దీంతో లోన్లు, ఈఎంఐలపై ప్రత్యక్ష ప్రభావం పడనుంది. లోన్ వడ్డీ రేట్లు పెరిగే అవకాశాలున్నాయి. ఫలితంగా ఈఎంఐల (EMI) భారం పెరిగే అవకాశాలున్నాయి.

ఎల్‌పీజీ సిలిండర్ , సీఎన్‌జీ ధర పెంపు..

ఎల్‌పీజీ (LPG), సీఎన్‌జీ, పీఎన్‌జీ గ్యాస్ ధరలను (GAS prices) ప్రతి నెలా ఆరంభంలో కంపెనీలు నిర్ణయిస్తాయి. గత నెల్లో ఎల్‌పీజీ సిలిండర్ల ధరలు పెరగకపోయినప్పటికీ.. పండగల సీజన్ నేపథ్యంలో ఈ నెలలో పెరగొచ్చనే విశ్లేషణలున్నాయి. మరి గ్యాస్ ధరలు పెరుగుతాయో లేదో వేచిచూడాల్సిందే.

పాన్-ఆధార్ లింక్ డెడ్‌లైన్..

పాన్ (PAN) (పర్మనెంట్ అకౌంట్ నంబర్), ఆధార్ కార్డ్ (AADHAAR) అనుసంధానానికి మార్చి 31, 2023 తుది గడువుగా ఉంది. ఈ మేరకు ఆదాయ పన్ను విభాగం ఇప్పటికే చాలాసార్లు హెచ్చరించింది. మార్చి 31లో ఆధార్‌తో అనుసంధానం కాకపోతే పాన్‌కార్డ్ పనిచేయదు.

ట్రైన్ షెడ్యూల్స్‌లో మార్పులు..

వేసవికాలం వచ్చేయడంతో పలు రైళ్ల షెడ్యూళ్లలో (Rail Schedule) ఇండియన్ రైల్వేస్ (Indian Railways) మార్పులు చేయనుంది. మార్చి నెలలో సవరణలకు సంబంధించిన జాబితాను ప్రచురించే అవకాశం ఉంది. మీడియా వర్గాల సమాచారం ప్రకారం.. మార్చి 1 నుంచి పెద్ద సంఖ్యలో కార్గో, ప్యాసింజర్ల రైళ్ల షెడ్యూల్‌ను మార్చే అవకాశాలున్నాయి.

Updated Date - 2023-02-27T19:27:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising