Giant Python: టీవీ చూస్తుండగా పైనుంచి ఊడిపడ్డ భారీ కొండచిలువ.. నలుగురు ఉండగా..
ABN, First Publish Date - 2023-01-10T21:30:22+05:30
కుటుంబ సభ్యులంతా ఒకేచోట కూర్చొని హాయిగా టీవీ చూస్తున్న సమయంలో ఉన్నపళంగా ఓ భారీ కొండచిలువ (Giant Python) ఊడిపడింది. ఇంటి సీలింగ్ నుంచి ఉన్నట్టుండి జారిపడడంతో అందరూ వణికిపోయారు.
సరావాక్: కుటుంబ సభ్యులంతా ఒకేచోట కూర్చొని హాయిగా టీవీ చూస్తున్న సమయంలో ఉన్నపళంగా ఓ భారీ కొండచిలువ (Giant Python) ఊడిపడింది. ఇంటి సీలింగ్ నుంచి ఉన్నట్టుండి జారిపడడంతో అందరూ వణికిపోయారు. ఈ భయానక ఘటన మలేసియాలోని (Malasia) సరావాక్ స్టేట్‌లో నివసిస్తున్న ఓ కుటుంబానికి అనుభవం ఎదురైంది. షాకింగ్ పరిణామంతో పరుగులు పెట్టిన బాధిత కుటుంబ సభ్యులు కొద్దిసేపటికి కుదుటపడి డిస్ట్రిక్ట్ ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీంతో నలుగురు అధికారుల టీమ్ వెంటనే బాధితుల నివాసానికి చేరుకుంది. అధికారులు చేరుకునే సమయానికి కొండచిలువ కిచెన్‌లోని ఓ బాక్స్ కింద దాక్కుంది. అయినప్పటికీ వేట సాగించి విజయవంతంగా దానిని బంధించామని మిర్వాన్ షా బిన్ మశ్రి అనే అధికారి వెల్లడించారు. ఇంచుమించు 10 అడుగుల పొడవున్న ఈ కొండచిలువను ప్రత్యేక పరికరాలతో పట్టుకోగలిగామని చెప్పారు. రాత్రి సమయంలో ఈ ఘటన జరిగిందని వెల్లడించారు.
కొండచిలువను పట్టుకున్న ఇంట్లో మొత్తం నలుగురు నివసిస్తుంటారని స్థానిక న్యూస్ రిపోర్టులు వెల్లడించాయి. ఈ కొండచిలువ చుట్టుకుని ఉందని, ఇలాంటివి దక్షిణ, ఆగ్నేయాసిలో కనిపిస్తాయని తెలిపాయి. ప్రపంచంలో పొడవాటి కొండచిలువ జాతుల్లో ఇదొకటని వివరించాయి. మనుషులు, పిల్లలు, జంతువులు, పక్షులు, ఎలుకలు, ఇతర పాములను కూడా ఇవి తినగలవని రిపోర్టులు పేర్కొన్నాయి. గరిష్ఠంగా 9.6 మీటర్ల (31.5 అడుగులు) పొడవు ఉంటాయని వెల్లడించాయి. సాధారణంగా అడవులు, చిత్తడి నేలలు, కాలువలు వంటి ప్రదేశాల్లో కనిపిస్తాయి. కానీ ఇటివల అడవుల నరికివేత కారణంగా సిటీ పరిసరాల్లో కూడా కనిపిస్తున్నాయని మలేసియా న్యూస్‌వీక్ (newsweek) రిపోర్ట్ పేర్కొంది.
Updated Date - 2023-01-10T21:30:36+05:30 IST