ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: కార్లోంచి దిగి మండుటెండలో నడిరోడ్డుపై కూర్చుని వలవలా ఏడ్చిన యువతి.. తనిఖీలు చేస్తున్న పోలీసులే అవాక్కయ్యారు..!

ABN, First Publish Date - 2023-03-10T21:27:26+05:30

రోడ్డు మీద ట్రాఫిక్ పోలీసులు వాహనాలను చెక్ చేస్తున్నారంటే అటు వైపుగా వెళ్లడానికి చాలా మంది భయపడతారు. పోలీసులు వెళ్లిపోయే వరకు ఆగడమో, లేకపోతే వేరే రూట్‌లో వెళ్లడమో చేస్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

రోడ్డు మీద ట్రాఫిక్ పోలీసులు (Traffic Cops) వాహనాలను చెక్ చేస్తున్నారంటే అటు వైపుగా వెళ్లడానికి చాలా మంది భయపడతారు. పోలీసులు వెళ్లిపోయే వరకు ఆగడమో, లేకపోతే వేరే రూట్‌లో వెళ్లడమో చేస్తారు. కొందరు పోలీసులకు దొరికిపోయి రకరకాల కారణాలు చెబుతారు. అయితే ఓ యువతి రోడ్డుపై కారులో వెళుతూ పోలీసులకు దొరికిపోయి మహానటిలా నటించింది. రోడ్డుపై కూర్చుని కన్నీళ్లు పెట్టుకుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).

ఆ వీడియోలో.. కొందరు అమ్మాయిలు ఓ కారులో వెళ్తుండగా ట్రాఫిక్ పోలీసు ఆపి పేపర్లు చూపించాలని అడిగాడు. దానికి ఆ కారును డ్రైవ్ చేస్తున్న యువతి చాలా సీరియస్ అయింది. గట్టిగా అరుస్తూ పేపర్లను తీసి రోడ్డు మీద వేసింది. అనంతరం డోరు తెరిచి కిందకు దిగి రోడ్డు మీద కూర్చుని ఏడుపు మొదలుపెట్టింది (Girl breaks down on road). ఆమె చర్యకు పోలీసులు మాత్రమే కాదు.. ఆమె స్నేహితురాళ్లు కూడా షాక్ అయ్యారు. ఆమె ఎందుకలా ప్రవర్తిస్తోందోనని ఆశ్చర్యపోయారు. కొద్ది సేపటి తర్వాత పోలీసులు ఆమెను కారు ఎక్కి వెళ్లమని సూచించారు.

Radhe Shyam Train Scene: రాధేశ్యామ్ సినిమా చూశారేమో.. ట్రైన్ సీన్‌ను రిపీట్ చేయాలనుకున్న ప్రేమజంట.. అంతా ఓకే కానీ..!

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. @gharkekalesh అనే ట్విటర్ హ్యాండిల్‌లో షేర్ అయిన ఈ వీడియో 3 లక్షలకు పైగా వ్యూస్ సాధించింది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఆ అమ్మాయి నటన అద్భుతంగా ఉందని, పోలీసులను భయపెట్టడానికి ప్రయత్నిస్తోందని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

Updated Date - 2023-03-10T21:27:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising