ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bajrangi Bhaijaan Movie: పాక్ సరిహద్దు దాటి వచ్చానంటున్న 17 ఏళ్ల బాలిక.. సల్మాన్ ఖాన్ సినిమాలోని ఆ పాపను నేనేనంటూ..!

ABN, First Publish Date - 2023-09-27T20:32:08+05:30

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన సూపర్ హిట్ చిత్రం ``భజరంగీ భాయ్‌జాన్``. ``బాహుబలి`` రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథ అందించారు. పాకిస్థాన్ నుంచి భారత్‌కు వచ్చి తప్పి పోయిన బాలికను తిరిగి అక్కడకు చేర్చే హీరో పాత్రలో సల్మాన్ నటించారు.

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) హీరోగా నటించిన సూపర్ హిట్ చిత్రం ``భజరంగీ భాయ్‌జాన్`` (Bajrangi Bhai Jaan). ``బాహుబలి`` రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథ అందించారు. పాకిస్థాన్ (Pakistan)నుంచి భారత్‌కు వచ్చి తప్పి పోయిన బాలికను తిరిగి అక్కడకు చేర్చే హీరో పాత్రలో సల్మాన్ నటించారు. పాకిస్థాన్ బాలిక ``మున్నీ`` (Munni) పాత్రలో హర్షాలీ అనే బాలిక నటించింది. ఈ సినిమా 2015లో విడుదలై ఘన విజయం సాధించింది. తాజాగా ఓ బాలిక ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌తో సరిహద్దు దళాలు అప్రమత్తమయ్యాయి.

తాను నిజమైన ``భజరంగీ భాయ్‌జాన్``లో నటించిన నిజమైన మున్నీని అని, ఇటీవలె పాకిస్థాన్ నుంచి పారిపోయి వచ్చానని ఓ 17 ఏళ్ల బాలిక బాంబు పేల్చింది. తన పేరు హయత్ బీ అని, తనది పాకిస్థాన్ అని చెప్పింది. ఈ నెల 24న డెహ్రాడూన్‌లో దొరికిన ఆ బాలిక గురించి జీఆర్పీ పూర్తిగా వివరాలు సేకరించారు. ఆమె చెబుతున్నది పూర్తిగా అబద్ధమని తెలుసుకున్నారు. ఆ బాలిక మానసిక పరిస్థితి సరిగ్గా లేదని, ఆమె మీరట్‌కు చెందిన బుష్రా బీ అని గుర్తించారు. విచారణ సమయంలో ఆ బాలిక నిరంతరం ``భజరంగీ భాయ్‌జాన్`` కథ చెబుతోంది.

Death Mystery: 24 ఏళ్ల ఈ కుర్రాడికి అసలేమైంది..? చివరిసారి వీడియో కాల్ చేసి.. ప్రేయసి చూస్తుండగానే ఘోరం..!

ఆ బాలిక చెబుతున్న కథనాలపై పోలీసులు విచారించగా అసలు విషయం బయటపడింది. బుష్రా మానసిక పరిస్థితి బాగా లేదని, ఆమె ఇంటి నుంచి పారిపోయినప్పుడు తల్లిదండ్రులు మీరట్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ కూడా ఇచ్చినట్టు తెలుసుకున్నారు. బుష్రా ఇప్పటికే మూడు, నాలుగు సార్లు ఇంటిని విడిచిపెట్టినట్లు దర్యాప్తులో తేలింది. అన్ని కోణాల్లోనూ పూర్తిగా విచారించిన తర్వాత బుష్రాను మంగళవారం రాత్రి తల్లిదండ్రులకు అప్పగించారు.

Updated Date - 2023-09-27T20:32:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising