జీవిత భాగస్వామిని మోసం చేస్తున్న వాళ్ల సంఖ్య మరీ ఈ రేంజ్‌లో ఉందా..? ఆ డేటింగ్ యాప్ ఏం తేల్చిందంటే..
ABN, First Publish Date - 2023-02-03T18:00:52+05:30
నేటి బిజీ బిజీ లైఫ్ స్టైల్లో దంపతుల (couple) మధ్య ప్రేమానురాగాలు తగ్గిపోతున్నాయి. మరో వైపు పని ఒత్తిడి కారణంగా ఇంట్లో గొడవలు చోటు చేసుకోవడం, కొన్నిసార్లు చివరకు విడాకుల వరకూ దారి తీస్తోంది...
నేటి బిజీ బిజీ లైఫ్ స్టైల్లో దంపతుల (couple) మధ్య ప్రేమానురాగాలు తగ్గిపోతున్నాయి. మరో వైపు పని ఒత్తిడి కారణంగా ఇంట్లో గొడవలు చోటు చేసుకోవడం, కొన్నిసార్లు చివరకు విడాకుల వరకూ దారి తీస్తోంది. భార్య సమస్యలను భర్త, భర్త ఇబ్బందులను భార్య అర్థం చేసుకోకపోవడం కూడా సమస్యలకు దారి తీస్తోంది. ఈ క్రమంలో కొందరు పరాయి మహిళలు, పురుషులతో వివాహేతర సంబంధాలు కొనసాగించడం జరుగుతోంది. గ్లీడన్ అనే డేటింగ్ (Glidden dating app) యాప్ నిర్వహించిన సర్వేలో.. జీవిత భాగస్వామిని మోసం చేస్తున్న వారి గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంతకీ ఈ డేటింగ్ యాప్ ఏం తేల్చిందంటే..
గ్లీడన్ అనే ఫ్రెంచ్ డేటింగ్ యాప్ ఈ సర్వే నిర్వహించింది. ఈ యాప్‌ను ప్రపంచవ్యాప్తంగా 10 మిలియన్ల మంది వినియోగిస్తున్నారు. వీరిలో 20శాతం మంది భారతీయులే (Indians) ఉన్నట్లు తెలిసింది. ఇటీవల గ్లీడన్ వివాహేతర సంబంధాలకు సంబంధించిన అంశంపై ఓ సర్వే (Survey) నిర్వహించింది. ఇందులో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలో సుమారు 63శాతం మంది ప్రజలు తమ భాగస్వామి విషయంలో విసిగిపోయారని తేలింది. అదేవిధంగా 20శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తూ.. వివాహేతర సంబంధాలకు (Extramarital affairs) అలవాటు పడినట్లు తెలిసింది. అలాగే పది శాతం మంది తమ భాగస్వామితో గొడవపడి మోసపోయామని తెలిపారు. అదేవిధంగా 8శాతం మంది తమ భాగస్వామితో కాకుండా మరొకరితో ప్రేమలో పడ్డట్లు తెలిపారు.
అదేవిధంగా ఆఫీసుల్లో పని చేస్తున్న వారు ప్రమోషన్ల విషయంలో తమ బాస్‌లతో వివాహేతర సంబంధాలు కొనసాగించడం తప్పు కాదని సర్వేలో వెల్లడించారు. కేవలం సమాజం కోసమే వివాహం చేసుకోవాల్సి వస్తోందని మరికొందరు సమాధానం ఇచ్చారు. ఈ కారణంగా కూడా మరొకరితో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నామని చెప్పారు. భాగస్వామి వద్ద దొరకని సంతోషాన్ని తాము ఎన్నుకొన్న వ్యక్తుల ద్వారా పొందేందుకు సుముఖత చూపుతున్నారు. వివాహ బంధంలోకి అడుగుపెట్టిన దంపతులు.. ఒకరినొకరు అర్థం చేసుకోవడం ద్వారా ఎలాంటి సమస్యలూ ఉండవు. భాగస్వామిని బాధపెట్టే విషయాలను గుర్తు చేయకుండా ఉండడం, ఎంత బిజీగా ఉన్నా కుటుంబ సభ్యుల కోసం కొంత సమయాన్ని వెచ్చించడం వల్ల సమస్యలు రాకుండా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.
Updated Date - 2023-02-03T18:23:00+05:30 IST