Google: ఈరోజు గూగుల్ డూడుల్ చూశారా? చూడకుంటే ఇప్పుడే చూడండి కచ్చితంగా ఆశ్చర్యపోతారు..
ABN, First Publish Date - 2023-01-29T17:47:43+05:30
ఈరోజు డూడుల్ ను ఓపెన్ చేసి చూసారంటే తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఇంతకూ ఈరోజు డూడుల్ లో ఏముందంటే...
గూగుల్ డూడుల్ గురించి గూగుల్ ను వాడుతున్న అందరికీ తెలియదు అనేది నిజం. ఏదైనా అవసరమైతే గూగుల్ సెర్చ్ చేసి పని కానిచ్చేస్తారు చాలామంది కానీ గూగుల్ ప్రతి రోజూ ప్రత్యేకతను బట్టి డూడుల్ ను మారుస్తుంది. అందులో భాగంగా ఈరోజు గూగుల్ డూడుల్ ను సెట్ చేసింది. ఈరోజు డూడుల్ ను ఓపెన్ చేసి చూసారంటే తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఇంతకూ ఈరోజు డూడుల్ లో ఏముందంటే... బోబా టీ.
బోబా టీ తైవాన్ పానీయం. దీన్నే బబుల్ టీ అని కూడా అంటారు. ఇది కేవలం విదేశాలలోనూ, పెద్ద పెద్ద నగరాలలో పెద్ద రెస్టారెంట్లలోనూ లభ్యమవుతోంది. ఇదేమీ కొత్తగా కనిపెట్టిన పానీయం కాదు, ఎన్నో ఏళ్ళ నుండి తైవాన్ ప్రజల లైఫ్ స్టైల్ లో ఇది భాగంగా ఉంది. వేగవంతమైన కాలంతో విదేశీ వంటకాలు అటూ ఇటూ పరిచయం అవుతున్నాయి. అందులో బోబా టీ కూడా ఉంది. చైనా, తైవాన్ దేశాలలో ఈ టీని చాలా ప్రొటీన్ ఫుడ్ కింద తీసుకుంటారు. ఇది ఖరీదైనది కూడా. టాపియోకా అని పిలవబడే బాల్స్, పాలు, టీ, క్రీమ్, చక్కెర కలిపి తయారు చేసే ఈ బోబా టీ కోవిడ్ సమయంలో భారతదేశంలో కూడా విస్తృతమైంది.
ఈ బోబా టీ ఎమోజీని జనవరి 29న ఆవిష్కరించారట. ఈ కారణంగా 29వ తేదీన బోబా టీ డూడిల్ కు గూగుల్ చోటు కల్పించింది. ఇకపోతే ఈ బోబా టీ డూడుల్ చాలా అద్భుతంగా ఉంది దాన్ని ఓపెన్ చేసి చూసినవారికి అదొక మంచి గేమ్ లాగా అనిపిస్తుంది. డిజిటల్ బోబా టీ తయారుచేయడం భలే గమ్మత్తుగానూ ఉంటుంది. మీరు కనుక చూడకపోతే ఇప్పుడే డూడుల్ ను ఓపెన్ చేసి ఫన్ ను ఎంజాయ్ చేయండి. మీరు తయారుచేసే డిజిటల్ కప్ బోబా టీకి ఎన్ని స్టార్స్ వస్తాయో చూసుకోండి.
Updated Date - 2023-01-29T17:48:47+05:30 IST