ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral: పెళ్లి పీటల మీద నుంచి మధ్యలో వెళ్లిపోయిన వరుడు.. అతడి కోపానికి కారణమేంటో తెలిస్తే షాకవ్వాల్సిందే!

ABN, First Publish Date - 2023-05-14T15:34:15+05:30

ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. పెళ్లిళ్లలో జరిగే ఆసక్తికర విషయాలు, ఫన్నీ సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రయోగరాజ్‌లో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల (Marriage) సీజన్ నడుస్తోంది. పెళ్లిళ్లలో జరిగే ఆసక్తికర విషయాలు, ఫన్నీ సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్ (Viral) అవుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌కు (Uttar Pradesh) చెందిన ప్రయోగరాజ్‌లో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. పెళ్లి ఏర్పాట్ల విషయంలో అసంతృప్తికి గురైన వరుడు (Groom) వివాహ కార్యక్రమం మధ్యలో పెళ్లి పీటల మీద నుంచి లేచి వెళ్లిపోయాడు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా నిలిచింది.

ప్రయోగరాజ్‌కు సమీపంలోని హలియాకు చెందిన వరుడికి, బరహులాకు చెందిన వధువుకు (Bride) బుధవారం (మే) నాడు వివాహం జరగాల్సి ఉంది. ఆ రోజు వరుడి కుటుంబం, బంధుమిత్రలు ఊరేగింపుగా కల్యాణ మండపానికి చేరుకున్నారు. వివాహ తంతు మొదలైంది. అయితే వివాహంలో ఏర్పాటు చేసిన ఆర్కెస్ట్రా అనుకున్న సమయానికి మొదలు కాలేదు. అలాగే వరుడు కోరిన విధంగా వధువు తరఫు వారు లైటింగ్ ఏర్పాటు చేయలేదు. దీంతో వరుడు కాస్త అసహనానికి గురయ్యాడు.

Viral Video: పోలీసుల ఎదురుగా కొడుకును, కోడలిని కొట్టిన మహిళ.. ఎందుకో తెలిస్తే షాకవకుండా ఉండలేరు!

లైటింగ్, ఆర్కెస్ట్రా విషయంలో వధువు తరఫు వారితో వాదనకు దిగాడు. ఆ వాదన కాస్తా గొడవగా మారింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన వరుడు పెళ్లి పీటల నుంచి లేచి బయటకు వెళ్లిపోయాడు. పెద్దలు, బంధుమిత్రులు నచ్చ చెబుతున్నా వినకుండా ఇంటికి వెళ్లిపోయాడు. దీంతో వధువు సోదరుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. వరుడికి కట్నం, బైక్ ఇవ్వడం కోసం పొలాలను తనఖా పెట్టామని, పెళ్లి మధ్యలో వరుడు వెళ్లిపోయాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వరుడి తండ్రి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని తమ కుమారుడిని పెళ్లికి ఒప్పిస్తానని హామీ ఇచ్చాడు.

Updated Date - 2023-05-14T15:34:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising