ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hampi: హంపిలో విదేశీయుల విహారం

ABN, First Publish Date - 2023-07-12T13:14:24+05:30

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హంపి(Hampi)లోని శిల్ప కళా సంపదకు విదేశీయులు ముగ్ధులవుతున్నారు. శిల్పకళా అద్భుతాలను చూసి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- శిల్ప కళా సౌందర్య ఆస్వాదన

- ఉత్సాహంగా జీ-20 సాంస్కృతిక సమావేశాలు

బళ్లారి(బెంగళూరు), (ఆంధ్రజ్యోతి): ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హంపి(Hampi)లోని శిల్ప కళా సంపదకు విదేశీయులు ముగ్ధులవుతున్నారు. శిల్పకళా అద్భుతాలను చూసి మురిసిపోతున్నారు. జీ-20 సదస్సులో భాగంగా హంపిలో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరైన విదేశీ ప్రతినిధులు ఇక్కడి అందాలను చూసి ఆనందపడుతు న్నారు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానమయిన హంపి జీ-20 సదస్సులకు వేదిక అయింది. ఇందులో భాగంగా 20 దేశాలకు చెందిన అధికారులు, ప్రతినిధులు పాల్గొంటున్నారు. మంగళవారం విదేశీయులు ఆనేశాల, లోటస్‌ మహల్‌, రాణి స్నానపు గది తదితర ప్రాంతాల్లో విహరించారు. రాణి స్నానపు గది వద్ద విదేశీయులు మొక్కలు నాటారు. హంపి(Hampi)లోని అద్భుత శిలలు, వాటిపై చెక్కిన చిత్రాలు చూసి ఆశ్చర్యపోయారు. ఈ సందర్భంగా హంపిలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. విరూపాక్షిస్వామి ఆలయం ఎదురుగా ఉన్న ఎదురు బసవణ్ణ మండపంపై వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నాట్య కళాకారుల విన్యాసాలు విదేశీయులను కనువిందు చేశాయి. చందమామ చల్లటి నీడలో ఆకాశంపై ధృవతారలు ప్రకాశిస్తుంటే.. నేలపై గజ్జికట్టి నాట్యం ఆడుతున్న కళాకారులను చూసి ప్రపంచ దేశస్తులు ఆనందంతో మునిగిపోయారు.

Updated Date - 2023-07-12T13:14:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising