ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Husband: నాకు అలాంటి భర్తే కావాలి.. అవి తెలిసుండాలి.. ఓ యువతి వింత ప్రకటన.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు!

ABN, First Publish Date - 2023-10-29T21:00:07+05:30

సాధారణంగా కాబోయే భర్త విషయంలో అమ్మాయిలకు కొన్ని అంచనాలుంటాయి. అబ్బాయి పొడవుగా ఉండాలి, అందంగా ఉండాలి, బాగా సంపాదించే వాడై ఉండాలి, తను చెప్పిన మాట వినాలి.. ఇలా కొన్ని కోరికలు ఉంటాయి. తాము కోరుకునే లక్షణాలు ఉన్న అబ్బాయి కోసం మ్యాట్రిమోనియల్ వైబ్‌సైట్స్‌లో ప్రకటనలు కూడా ఇస్తుంటారు.

సాధారణంగా కాబోయే భర్త (Husband) విషయంలో అమ్మాయిలకు కొన్ని అంచనాలుంటాయి. అబ్బాయి పొడవుగా ఉండాలి, అందంగా ఉండాలి, బాగా సంపాదించే వాడై ఉండాలి, తను చెప్పిన మాట వినాలి.. ఇలా కొన్ని కోరికలు ఉంటాయి. తాము కోరుకునే లక్షణాలు ఉన్న అబ్బాయి కోసం మ్యాట్రిమోనియల్ వైబ్‌సైట్స్‌లో ప్రకటనలు (Matrimonial ad) కూడా ఇస్తుంటారు. అయితే తాజాగా ఓ యువతి వరుడి కోసం ఇచ్చిన యాడ్ చూస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే.

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన రియా అనే యువతి తాజాగా పెళ్లి ప్రకటన ఇచ్చింది. తనకు వరుడు (Groom) కావాలి అంటూ యాడ్ ప్రచురించింది. తనకు కాబోయే భర్తకు ఇన్‌స్టా రీల్స్ (Insta reels) మీద ఆసక్తి ఉండాలని పేర్కొంది. తను నటిస్తుంటే అతడు వీడియోలు తీయాలని, వాటిని ఎడిట్ చేయాలని తెలిపింది. అలాగే తనకు కాబోయే భర్తకు కెమేరా ముందు నటించడానికి సిగ్గు ఉండకూడదని, తనతో పాటు రీల్స్ నటించాలని పేర్కొంది. అలాగే రీల్స్ కోసం విభిన్న ఐడియాలు ఇస్తుండాలని, ముఖ్యంగా అతడికి జాయింట్ ఫ్యామిలీ ఉండకూడదని యాడ్‌లో పేర్కొంది.

Delhi Metro: ఢిల్లీ మెట్రోలో వృద్ధుడిపై దాడికి దిగిన వ్యక్తి.. తోటి ప్రయాణికులు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్!

తనను కలుసుకోబోయే ముందు అమేజాన్ మినీ టీవీలో స్ట్రీమ్ అవుతున్న ``హాఫ్ లవ్.. హాఫ్ అరేంజ్‌డ్`` చూడలని నిబంధన పెట్టింది. ప్రస్తుతం ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమెకు కావాల్సింది భర్తనా లేక రీల్స్ కోసం ఉద్యోగా అని చాలా మంది కామెంట్లు చేశారు. అలాగే ఆమె సూటిగా చెప్పిన విధానం బాగుందని మరికొందరు పేర్కొన్నారు.

Updated Date - 2023-10-29T21:00:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising