ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Health Fact: మహిళలు బ్రా ధరిస్తే రొమ్ముక్యాన్సర్ వస్తుందా? అసలు నిజాలివే..

ABN, First Publish Date - 2023-10-08T13:40:26+05:30

మహిళలు ధరించే బ్రా వల్ల రొమ్ము క్యాన్సర్ వస్తుందని చాలా మంది చెబుతుంటారు. దీని గురించి వైద్యులు ఏం చెబుతున్నారంటే..

ప్రపంచంలో ప్రజల ప్రాణాలను ఎక్కువగా బలితీసుకునే ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలలో క్యాన్సర్ మొదటిది. క్యాన్సర్ లో పలురకాలు ఉన్నాయి. మహిళలు ఎక్కువగా ఎదుర్కొనే క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్. మహిళలు ధరించే బ్రా వల్ల రొమ్ము క్యాన్సర్ వస్తుందని చాలా మంది చెబుతుంటారు. మగవారికి కూడా రొమ్ము క్యాన్సర్ వస్తుందని కొందరు అంటారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలను రొమ్ము క్యాన్సర్ అవగాహనా నెలగా పరిగణిస్తారు. ఇందులో భాగంగా రొమ్ము క్యాన్సర్ లక్షణాలు, దాని కారణాలు, అపోహలు మొదలైన విషయాల గురించి పూర్తీగా తెలుసుకుంటే..

రొమ్ము క్యాన్సర్(breast cancer) మహిళలలో సంభవించే ప్రమాదకరమైన జబ్బు. రొమ్ము లోపల క్యాన్సర్ కణాలు పెరగడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. మహిళల రొమ్ముల్లో సాధారణంగానే కండరాలు ఉంటాయి. చేత్తో తాకినప్పుడు ఇవి గడ్డల్లాగా చేతికి తగులుతుంటాయి. కానీ వీటిలో క్యాన్సర్ గడ్డలు కూడా ఉండే ప్రమాదముంది. రొమ్ము క్యాన్సర్ ఎక్కువగా 50ఏళ్లు దాటిన మహిళలలోనూ, 1శాతం పురుషులలో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ జీవనశైలి కారణంగా చిన్నవయసులో ఉన్న మహిళలలో కూడా ఇది వచ్చే అవకాశం ఉంది. మహిళల రొమ్ముల్లో ఉండే గడ్డలు అకస్మాత్తుగా పరిమాణం పెరిగినా, రొమ్ముల ఆకృతిలో ఏదైనా మార్పు కనిపించినా, చనుమొన నుండి చీము లేదా నీరు లాంటి పదార్థం కారుతున్నా, చనుమొన చుట్టూ దురద పెట్టి చిన్న కురుపుల్లా వస్తున్నా వాటిని రొమ్ము క్యాన్సర్ లక్షణాలుగా భావిస్తారు. ఇలాంటి పరిస్థితులలో వైద్యుడిని సంప్రదించాలి.

Viral Video: వామ్మో ఈ కేరళ కుర్రాడి తెలివి మామూలుగా లేదుగా.. మారుతీ కారును ఎలా మార్చేశాడో చూస్తే..



కారణాలు, అపోహలు..

రొమ్ముక్యాన్సర్ విషయంలో చాలామందిలో ఒక నమ్మకం ఉంది. అదే బ్రా ధరిస్తే రొమ్ము క్యాన్సర్ వస్తుందని(wearing bra can cause breast cancer). కానీ అది నిజం కాదని వైద్యులు చెబుతున్నారు. రొమ్ముల పరిమాణం పెద్దగా ఉన్నవారు బ్రా ధరించడం వల్ల ఎలాంటి హాని జరగదు. దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని వైద్యులు స్పష్టం చేశారు. ఇకపోతే కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ ఉంటే ఆ తరువాత తరం వారికి కూడా క్యాన్సర్ వస్తుందని అంటారు. జన్యుపరంగా ఆలోచిస్తే ఇది నిజమేనని వైద్యులు కూడా చెబుతారు. అదేవిధంగా ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు ఉన్న మహిళలలో కూడ రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి వారు ముందుగానే వైద్యులను కలిసి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా రొమ్ము క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు.

Health Tips: బరువు తగ్గడం కష్టంగా అనిపిస్తోందా?.. ఉదయం లేవగానే ఇదొక్కటి తాగి చూడండి..


Updated Date - 2023-10-08T16:06:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising