Health Facts: ప్రతిరోజూ అదే పనిగా తలనొప్పి వస్తోందా..? ఈ 9 అంశాలే అసలు కారణం కావచ్చు..
ABN, First Publish Date - 2023-08-24T12:26:34+05:30
తలనొప్పులలో వివిధ రకాలు ఉన్నాయి. ఇవన్నీవివిధ కారణాల వల్ల వస్తాయి. పదే పదే రిపీటెడ్ గా వచ్చే తలనొప్పులు శరీరంలో కొన్ని అనారోగ్య సమస్యలను సూచిస్తాయి.
తలనొప్పిని సాధారణ సమస్యగా పరిగణిస్తారు. చాలామంది తలనొప్పి ఉన్నప్పుడు కాసేపు విశ్రాంతి తీసుకుంటే అదే తగ్గిపోతుందిలే అని అనుకుంటూ ఉంటారు. మరికొందరు తలనొప్పి తగ్గడానికి పెయిన్ కిల్లర్లు వేసుకుంటారు. ఇంకొందరు కాసింత కాఫీ లేదా టీ తో తలనొప్పికి తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే తలనొప్పులలో వివిధ రకాలు ఉన్నాయి. ఇవన్నీవివిధ కారణాల వల్ల వస్తాయి. పదే పదే రిపీటెడ్ గా వచ్చే తలనొప్పులు శరీరంలో కొన్ని అనారోగ్య సమస్యలను సూచిస్తాయి. తలనొప్పికి గల కారణాలు తెలుసుకుంటే..
చాలామంది తలనొప్పి(Headache)గా అనిపించగానే జండూబామ్, పెయిన్ కిల్లర్, కాఫీ మొదలైనవాటి వైపు మొగ్గు చూపుతారు. కానీ మొదట ఓ గ్లాసుడు మంచినీళ్ళు తాగమని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. శరీరంలో నీటిశాతం తగ్గి డీహైడ్రేషన్ కు గురైనప్పుడు మెదడు పనితీరు మందగిస్తుంది. దీనికారణంగా తలనొప్పి వస్తుంది. మంచినీరు తాగడం వల్ల డీహైడ్రేషన్ ను అరికట్టవచ్చు. తలనొప్పికి డీహైడ్రేషన్ కూడా కారణం అవుతుంది.
తదేకంగా మొబైల్, టీవి, కంప్యూటర్ వైపు చూడటం వల్ల కళ్ళు ఎఫెక్ట్ అవుతాయి. కంటి నరాలు ఒత్తిడికి లోనవడం వల్ల తలనొప్పి వస్తుంది. ప్రతిరోజూ సిస్టమ్ ముందు పనిచేసేవారు స్క్రీన్ కు వీలైనంత దూరం ఉండేలాగు చూసుకోవాలి. సిస్టమ్ ఉపయోగించేటప్పుడు బ్లూ-రే ప్రొటెక్టివ్ గ్లాసెస్ ఉపయోగించాలి. కళ్ల మీద పడే ఒత్తిడి(eye stress) తలనొప్పికి కారణమవుతుందని గుర్తుపెట్టుకోవాలి.
తరచుగా తలనొప్పి వచ్చేవారిలో సైనస్ సమస్య ఉండే అవకాశం ఎక్కువ. ఈఎన్టీ(ENT) సమస్యలు కూడా తలనొప్పికి కారణం అవుతాయి. సైనస్ ఇన్ఫెక్షన్ లక్షణాలు కనబడుతూ ఉన్నా, తలనొప్పి పదే పదే వేధిస్తున్నా వైద్యుడిని తప్పకుండా సంప్రదించాలి.
Health Tips: చెప్పులు లేకుండా నడవడం మంచిదా..? వేసుకుని నడిస్తే మంచిదా..? దేని వల్ల ఎక్కువ లాభమంటే..!
మహిళల్లో నెలసరి సమయంలోనూ, మెనోపాజ్ దశకు చేరువ అవుతున్నప్పుడు హార్మోన్ మార్పులు(Harmons problems) సంభవిస్తాయి. వీటి కారణంగా తలనొప్పి సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు వ్యాయామం చేయడం, మైండ్ రిలాక్సేషన్ కోసం ధ్యానం, ప్రాణాయామం వంటివి చేయాలి.
చాలామంది కాఫీ, టీ కి అడిక్ట్ అయిపోయి ఉంటారు. ఇలాంటి వారు ఎప్పుడైనా కాఫీ,టీ తీసుకోవడం ఆలస్యమైనప్పుడు, లేదా స్కిప్ అయినప్పుడు విపరీతమైన తలనొప్పిని అనుభూతి చెందుతారు. కెఫిన్(caffine) కారణంగా ఈ సమస్య ఏర్పడటం శరీరంలో అనేక ఆరోగ్య సమస్యలను ఉత్పన్నం చేస్తుంది.
ఇప్పట్లో నిద్రించడం నుండి, ఒళ్లు నొప్పులు, ఆహార జీర్ణం, గ్యాస్, ఎసిడిటీ వంటి ప్రతి సమస్యకు మందుల వినియోగం(medicine using) అధికమయ్యింది. వీటిని ఎక్కువగా ఉపయోగిస్తే నాడీవ్యవస్థ బలహీనం అవుతుంది. ఇది మళ్లీ మళ్లీ తలనొప్పి రావడానికి కారణమవుతుంది.
అధిక రక్తపోటు(BP), మెదడులో కణితి, తీవ్రమైన జలుబు, శ్వాసలో ఇబ్బంది మొదలైన సమస్యలు కూడా తలనొప్పికి కారణమవుతాయి. అధిక రక్తపోటు ఉన్నవారు, తలలో ఒక భాగంలో నొప్పి వంటి సమస్యలు ఎదుర్కొంటు ఉంటే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి.
అధికశాతం మంది ఎదుర్కొనే సమస్య మానసిక ఒత్తిడి(depression). ఈ సమస్య మితిమీరితే అది ఆందోళనకు దారితీస్తుంది. ఇవి దీర్ఘకాలం కొనసాగితే ఆకలి, నిద్ర వ్యవస్థను అస్తవ్యస్థం చేస్తుంది. ఈ రెండు తలనొప్పికి కారణం అవుతాయి.
ఆరోగ్యకరమైన నిద్ర(healthy sleep) మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. 6-8గంటల నిద్ర లేకపోయినా, నిద్రలో పదే పదే మెలకువ వస్తున్నా అది మెదడు మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ప్రతిరోజూ వేళకు నిద్రపోవడం అలవాటుచేసుకోవాలి.
Milk before Bed: రాత్రి పడుకునే ముందు పాలు తాగే అలవాటుందా..? లాభాలే కాదు.. ఈ నష్టాల గురించి కూడా తెలుసుకోండి..!
Updated Date - 2023-08-24T12:26:34+05:30 IST