ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Health Facts: ముఖంపై వచ్చే ఇలాంటి మచ్చలకూ.. రోజూ వాడే టవల్స్‌కు సంబంధమేంటో తెలిస్తే..!

ABN, First Publish Date - 2023-09-22T15:45:47+05:30

కొందరు ముఖాన్ని బాగా శుభ్రంగా కడుక్కుంటున్నా, మంచి ఆహారం తీసుకుంటున్నా ముఖం మీద పదే పదే మొటిమలు, మచ్చలు, దద్దర్లు వస్తుంటాయి. వీటికి, ప్రతిరోజూ ఉపయోగించే టవల్ కు లింకుదనేది ఇప్పుడు అందరికీ షాకిస్తోంది

ముఖం మీద మొటిమలు. మచ్చలు, దద్దుర్లు వంటి సమస్యలు అకారణంగా వస్తున్నాయని ఎప్పుడైనా అనిపించిందా? కొందరు ముఖాన్ని బాగా శుభ్రంగా కడుక్కుంటున్నా, మంచి ఆహారం తీసుకుంటున్నా ముఖం మీద పదే పదే మొటిమలు, మచ్చలు, దద్దర్లు వస్తుంటాయి. వీటికి, ప్రతిరోజూ ఉపయోగించే టవల్ కు లింకుదనేది ఇప్పుడు అందరికీ షాకిస్తోంది. మొటిమలు, మచ్చలు ఆహారం వల్ల, జీవనశైలి సరిగా లేకపోవడం వల్ల వస్తాయని అనుకుంటాం. కానీ దీనికి రోజూ ఉపయోగించే టవల్ కూడా ప్రధాన కారణం అవుతుంది. అసలు టవల్ కు మొటిమలకు లింకేంటి? ఇదెలా కారణం అవుతుంది? తెలుసుకుంటే..

టవల్(bath towel) అయినా, హ్యాండ్ కర్చీఫ్(handkerchief) అయినా తరచుగా మార్చుకోవాలని చెబుతూ ఉంటారు. కొందరు ఈ మాటను కొట్టివడేస్తుంటారు. కానీ రోజూ ఉపయోగించే టవల్ ను సరిగా శుభ్రం చేయకపోతే అందులో 14శాతం ఇ కోలి బ్యాక్టీరియా(e coli bacteria) ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు. ఇది ముఖ్యంగా జీర్ణవ్యవస్థలోనూ, మలం ద్వారానూ వ్యాపించే బ్యాక్టీరియా. టవల్ ను రోజులో కేవలం రెండు మూడు సార్లే ఉపయోగించినప్పుడు పెద్ద మురికి ఉండదులే అని ఎక్కువ రోజులు ఉతకకుండా ఉపయోగిసస్తుంటాం. అలా చేసినప్పుడు, లేదా స్నానం తరువాత తడిగా ఉన్న టవల్ ను సరిగా ఆరబెట్టనప్పుడు తేమ కారణంగా ఈ బ్యాక్టీరియా అభివృద్ది చెందుతుంది. ఇలాంటి టవల్ తో ముఖం తుడుచుకున్నప్పుడు చాలా తొందరగా ముఖం మీద మచ్చలు, మొటిమలు వస్తాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ మొటిమల ప్రభావం తగ్గదు. ఇంకొక ముఖ్య విషయం అమ్మాయిల మేకప్. అమ్మాయిలు మేకప్ తొలగించి ముఖం తుడుచుకున్నప్పుడు మేకప్ కు సంబంధించిన రసాయన మూలాలు టవల్ లో చేరతాయి. టవల్ ను ఎక్కువరోజులు ఉతకకుండా వాడితే ముఖం మీద పదే పదే మొటిమలు వస్తాయి.

Fruit And Vegetable Peels: దానిమ్మ కాయల తొక్కలను పారేస్తున్నారా..? ఇది తెలిశాక మాత్రం ఆ పొరపాటు అస్సలు చేయరు..!



కొంతమంది ఉపయోగించే టవళ్లు చాలా గట్టిగా ఉంటాయి. ఇవి రఫ్ గా ఉండటం వల్ల వీటిని ఉపయోగించి ముఖం తుడుచుకుంటే చర్మం దెబ్బతింటుంది. అంతే కాదు చర్మం ర్యాష్ రావడం, చర్మం పొడిగా మారడం, పొరలు పొరలుగా మారడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి రఫ్ టవల్ ను సరిగా వాష్ చెయ్యకుండా ఉపయోగిస్తే అది తామర వంటి చర్మవ్యాధులకు కూడా కారణం అవుతుంది.

ఉతికిన టవల్ లేదా హ్యాండ్ కర్ఛీఫ్ అందుబాటులో లేకపోతే వాటికి బదులుగా కాటన్ స్కార్ప్ లేదా ఫేషియల్ వైప్స్ ఉపయోగించవచ్చు. అయితే ఫేషియల్ వైప్స్ ఉపయోగించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వీటిలో కొన్ని చర్మానికి అలెర్జీ చర్యలను కలిగిస్తాయి. అలాంటి సందర్భంలో ముఖం మీద మొటిమలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

Dark Circles: కళ్ల చుట్టూ నల్లటి వలయాలు.. ఈ మూడు కారణాల్లో ఏదో ఒక దాని వల్లే అసలు సమస్య..!


Updated Date - 2023-09-22T15:45:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising