ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Health Facts: ఛూయింగ్ గమ్‌ను పొరపాటున మింగితే.. కడుపులో అది కరిగిపోవడానికి ఎన్నేళ్లు పడుతుందో తెలిస్తే..!

ABN, First Publish Date - 2023-10-03T15:48:53+05:30

పొరపాటున ఛూయింగ్ గమ్ ను మింగితే అది కడుపులో కరగడానికి ఎన్ని ఏళ్ళు పడుతుందో తెలిస్తే షాకవుతారు..

చూయింగ్ గమ్, బబుల్ గమ్ సాధారణంగా ఆటగాళ్లు, డ్యాన్సర్లు నములుతూ ఉంటారు. కొందరికి ఛూయింగ్ గమ్ తినడం ఒక సరదా.. వీటిని చిన్నపిల్లలకు కొనివ్వడం గురించి పెద్దవారు అభ్యంతరం వ్యక్తం చేస్తుంటారు. పొరపాటున చాక్లెట్ అనుకుని వీటిని మింగితే ఇది కడుపులోని పేగులకు చుట్టుకుంటుందని దీని కారణంగా ప్రమాదం జరుగుతుంని అంటుంటారు. అయితే అసలు నిజంగానే ఛూయింగ్ గమ్ ప్రాణాంతక సమస్యలు తెచ్చిపెడుతుందా? పొరపాటున దీన్ని మింగిన తరువాత జరిగేది ఏంటి? ఈ విషయం గురించి వైద్యులు ఏమి చెబుతున్నారు? తెలుసుకుంటే..

ఛూయింగ్ గమ్(Chewing gum) పిల్లలకు ఇవ్వడానికి పెద్దలు భయపడతారు. పొరపాటున ఛూయింగ్ గమ్ మింగితే ప్రాణాం మీదకు వస్తుందని అంటారు. పిల్లల విషయం ప్రక్కన పెడితే ఈ ఛూయింగ్ గమ్ ను మింగితే అది కడుపులో కరిగిపోవడానికి ఏడేళ్లు పడుతుందని కొందరు గతంలోనే పరిశోధనలు చేసి వెల్లడించారు. అయితే ఈ విషయం వాస్తవమా? లేక అపోహనా అని విచారిస్తే దీని గురించి కొందరు వైద్యులు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

Health Facts: మగాళ్లలోనే ఎక్కువగా కనిపించే ఈ అరుదైన వ్యాధి గురించి తెలుసా..? పదే పదే మూత్రానికి వెళ్లాల్సి వస్తోందంటే..!



ఛూయింగ్ గమ్ ను సాధారణంగా నమలడానికి మాత్రమే తయారుచేసినప్పటికీ పొరపాటున దాన్ని మింగితే ప్రాణ నష్టం లాంటి సమస్యలు రావని అన్నారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో(Oxford University) క్లినికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ ప్రొఫెసర్ సైమన్ ట్రావిస్ మాట్లాడుతూ చిన్న ముక్క చూయింగ్ గమ్ మింగినట్టైతే అది మలమూత్రాలతో పాటు బయటకు వెళ్లిపోతుందని తెలిపారు. అది ఏడేళ్ళపాటు కడుపులో ఉండిపోతుందనే మాట పుక్కిటి పురాణమని కొట్టిపడేశారు. చిన్న ముక్క కాకుండా ఎక్కువ మొత్తం ఛూయింగ్ గమ్ కడుపులోకి వెళితే మాత్రం ప్రమాదమేనని, అది ప్రేగుల గోడలలో పేరుకుపోవచ్చని అన్నారు. ఇది కరగడానికి 7ఏళ్ళ సమయం పడుతుందని చెప్పారు. దీని ప్రేగు సంబంధ సమస్యలకు జీర్ణప్రక్రయకు అడ్డంకిగా మారే ప్రమాదముందని అన్నారు. కానీ 30ఏళ్లకు పైగా తన సర్వీస్ లో ఛూయింగ్ గమ్ తో ప్రమాదానికి గురై తన దగ్గరకు వచ్చిన కేసు ఒక్కటి కూడా లేదని వెల్లడించారు. ఇకపోతే ఇండియానా యూనివర్సిటీ(Indiana University) ఛీప్ హెల్త్ ఆఫీసర్ డా.ఆరోన్ కారోల్ ఈ విషయాన్నంతటినీ అంగీకరించినా తాము ఛూయింగ్ గమ్ ను తినమని, మింగమని ప్రోత్సహించడం లేదని చెప్పారు. ఛూయింగ్ గమ్ మింగిన తరువాత కడుపులో ఏదైనా అసౌకర్యం కలిగితే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించమని హెచ్చరించారు.

Health Facts: 25 ఏళ్ల కుర్రాడికి సీటీ స్కాన్ చేసి చూస్తే షాకింగ్ రిజల్ట్.. కంప్యూటర్ ఎర్రర్ ఏమోనని డాక్టర్‌కు డౌట్.. చివరకు..!


Updated Date - 2023-10-03T15:48:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising