ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Health Facts: బానపొట్ట కరిగిపోవాలా..? రోజూ పొద్దునే నిద్రలేవగానే ఈ జ్యూస్‌ను తాగితే.. చెడు కొవ్వు అంతా మటాష్..!

ABN, First Publish Date - 2023-09-26T14:30:49+05:30

ఉదయాన్నే ఈ జ్యూస్ తాగడం వల్ల బానలాగా ఉండే పొట్ట కూడా ప్లాట్ గా మారిపోతుంది. పొట్టలోని చెడు కొలెస్ట్రాల్ అంతా ఐస్ లాగా కరిగిపోతుంది. జరిగే మ్యాజిక్ చూసి ఆశ్చర్యపోతారు.

పొట్ట ప్లాట్ గా ఉంటే ఏ దుస్తులు అయినా చాలా బాగా సెట్ అవుతాయి. ఇంకా చెప్పాలంటే ఆడవారు అయినా మగవారు అయినా పొట్టలేకపోతే వయస్సు నుండి ఆరోగ్యం వరకూ మెరుగ్గా కనిపిస్తారు. కానీ జీవనశైలి, గంటలకొద్ది డెస్క్ ల ముందు కూర్చుని పనిచేయడం, శారీరక శ్రమ లేకపోవడం, వ్యాయామం చేయకపోవడం, ఆహారం విషయంలో నియంత్రణ లేకపోవడం వంటికారణాల వల్ల పొట్ట వస్తుంది. దీన్ని తగ్గించుకోవడానికి పొట్ట వ్యాయామాలు, డైటింగ్ చేస్తుంటారు. జిమ్ లో గంటల తరబడి కష్టపడుతుంటారు. అయితే ఇవన్నీ చేస్తున్నా, చేయకపోయినా ఉదయాన్నే నిద్రలేవగానే ఉసిరికాయ జ్యూస్(Gooseberry) తాగితే చాలు. ఈ జ్యూస్ వల్ల బానలాగా ఉండే పొట్ట కూడా ప్లాట్ గా మారిపోతుంది. పొట్టలోని చెడు కొలెస్ట్రాల్ అంతా ఐస్ లాగా కరిగిపోతుంది. ఉదయాన్నే ఉసిరికాయ జ్యూస్ తాగడం వల్ల జరిగే మ్యాజిక్ ఏంటో తెలుసుకుంటే..

ఉదయాన్నే పరగడుపున ఉసిరికాయ జ్యూస్ తాగడం వల్ల బరువు నియంత్రణలో(weight control) ఉంచవచ్చు. ఉసిరికాయలో ఉండే ఫైబర్ శరీరంలో ప్రేగుల కదలికను నియంత్రించడంలో సహాయపడుతుంది. ప్రేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఉసిరికాయలో ఉండే విటమిన్-సి(vitamin-C) శరీరంలోకి వెళ్లే పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా పొట్ట కొవ్వు కరిగించడంలో సహాయపడుతుంది.

Bald Head: బట్టతల వచ్చేస్తోందా..? రోజూ జుట్టు తెగ రాలిపోతోందా..? ఈ నూనెను కనుక రాసుకుంటే ఒక్క నెలలోనే..!



తాజా ఉసిరికాయలను ప్రతిరోజూ ఉదయాన్నే అప్పటికప్పుడు జ్యూస్ చేసుకుని తాగితే చాలా మంచిది. ఇందులో ఫైబర్(fiber) పుష్కలంగా ఉంటుంది. ఇది ఆకలిని నియంత్రణలో ఉంచడం ద్వారా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. శరీరానికి కావలసిన ఐరన్, విటమిన్-డి మొదలైనవి శరీరం గ్రహించాలంటే విటమిన్-సి తప్పనిసరిగా అవసరం. ఉసిరికాయ జ్యూస్ ఇందుకు తోడ్పడుతుంది.

100గ్రాముల ఉసిరికాయల్లో 300మి.గ్రా ల విటమిన్-సి లభిస్తుంది. విటమిన్-సి శరీరంలో తెల్లరక్తకణాలు ప్రభావవంతంగా పనిచేడానికి, ముడుతలు పడిన చర్మాన్ని యవ్వనంగా మార్చడానికి, గాయాలను నయం చేయడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.

ఉసిరికాయ జ్యూస్ లో ఫైటోన్యూట్రియెంట్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మెదడు కణాలపై దాడి చేసి దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ తో పోరాడటం ద్వారా జ్ఞాపకశక్తిని బలోపేతం చేస్తాయి.

మధుమేహం(diabetes) ఉన్నవారు దాన్ని నియంత్రణలో ఉంచుకోవడానికి నానా అవస్థలు పడుతుంటారు. అయితే ఉసిరికాయ మధుమేహ బాధితులకు నిజంగా గొప్ప వరమని చెప్పవచ్చు. ఉసిరిలో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించి మధుమేహాన్ని కూడా కంట్రోల్ లో ఉంచుతుంది.

Viral News: తెల్లారేసరికి ఇంట్లో కూతురు మిస్సింగ్.. పక్కింటి మహిళ తన తమ్ముడితో అదే పనిగా ఫోన్‌కాల్స్.. ఆ తండ్రికి డౌట్ వచ్చి..!


Updated Date - 2023-09-26T14:30:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising