Health Facts: కూర్చునే కుర్చీ వల్ల కూడా రోగాలే.. అసలు ఓ మంచి కుర్చీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే..!
ABN, First Publish Date - 2023-11-22T13:39:22+05:30
ఇంట్లో అయినా, ఆఫీసులో అయినా సరైన కుర్చీలో కూర్చుని పనిచేస్తే ఎలాంటి సమస్య రాదు. అసలు వర్కింగ్ కోసం సరైన కుర్చీని ఎలా ఎంపిక చేసుకోవాలంటే.
ఉదయాన్నే ఆఫీసుకు వెళ్లడం, పనిచేయడం, తిరిగి ఇంటికి రావడం అందరూ చేసేదే. కానీ పనిచేసేటప్పుడు ఏమాత్రం అసౌకర్యం కలిగినా అది పనిచేసేటప్పుడే కాదు, ఆ తరువాత కూడా చాలా ఇబ్బందులు కలిగిస్తుంది. ప్రస్తుతకాలంలో అధికశాతం డెస్క్ జాబ్సే కావడంతో చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెన్ను నొప్పి, తుంటి నొప్పి, మెడ, కాళ్ల నొప్పులతో ఇంటికి చేరుతున్న ఉద్యోగస్తులు చాలామంది ఉన్నారు. దీనికి కారణం గంటల తరబడి కూర్చుని పనిచేయడం ఒకటైతే, కూర్చునే కుర్చీ సరిగా లేకపోవడం మరొక కారణం. ఇంట్లో అయినా, ఆఫీసులో అయినా సరైన కుర్చీలో కూర్చుని పనిచేస్తే ఎలాంటి సమస్య రాదు. అసలు వర్కింగ్ కోసం సరైన కుర్చీని ఎలా ఎంపిక చేసుకోవాలో తెలుసుకుంటే..
ఆన్లైన్ నుండి బయట ఫర్నీచర్ షాపుల వరకు చాలా కుర్చీ మోడల్స్ అందుబాటులో ఉంటాయి. వీటిలో ఏవి ఎంపిక చేసుకోవాలన్న సందిగ్దం చాలామందికి ఉంటుంది. వేలాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసేవి కావడంతో కొనుగోలుకు ముందు తర్జభర్జన పడతారు. అయితే కుర్చీ కొనుగోలుకు ముందు కుర్చీ ఎత్తు(Chair height) విషయంలో జాగ్రత్త పడాలి. కుర్చీలో కూర్చున్నప్పుడు కాళ్లు గాలిలో వేలాడకూడదు. కొన్ని కుర్చీలకు ఎత్తు సెట్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. మరికొన్నింటికి ఉండదు. ఈ విషయం తెలుసుకున్న తరువాతే కుర్చీ కొనుగోలుకు ఆసక్తి చూపాలి.
ఇది కూడా చదవండి: ఇంటి ముందు తప్పకుండా పెంచాల్సిన 5 మొక్కలివీ..!
కుర్చీ ఎంపికలో సీటు వెడల్పు(chair length) దృష్టిలో ఉంచుకోవాలి. సీటు వెడల్పు తుంటికి సరిపోయేలా ఉండాలి. అలాగే సీటు పూర్తీగా ప్లాట్ గా ఉండకూడదు. కొద్దిగా వంపుగా ఉండాలి. దీనివల్ల హిప్ కు తగ్గట్టు పొజిషన్ సెట్ అవుతుంది. ముఖ్యంగా డెస్క్ జాబ్ చేసేవారు ఈ విషయంలో జాగ్రత్త పడాలి. తొడలకు, చేతులు సపోర్ట్ గా ఉంచుకునే ఆర్మ్ రెస్ట్ కు మధ్య గ్యాప్ కూడా ఎక్కువ ఉండకూడదు.
వీపుకు, తుంటి భాగానికి మధ్య గ్యాప్ ఎక్కువగా ఉన్న కుర్చీలు చూడ్డానికి చాలా ఫ్యాషన్ గా ఉంటాయి. కానీ అది వెన్నెముకకు అస్సలు మంచిది కాదు. వెన్నెముకకు, కుర్చీ వెనుక భాగానికి గ్యాప్ ఎక్కువ లేని కుర్చీలలో కూర్చుంటే శరీరంలో దిగువ భాగానికి కూడా సౌకర్యంగా ఉంటుంది.
బాగా మెత్తగా(smoothness) ఉన్న కుర్చీలలో కూర్చుంటే ఆ సుఖమే వేరు అని చాలామంది అనుకుంటారు. కానీ వర్క్ చేసేటప్పుడు కుర్చీ సీటు మరీ అంత మెత్తగా లేదా చాలా గట్టిగా ఉండకూడదు. కూర్చున్నప్పుడు సీటు రెండు అంగుళాల కంటే ఎక్కువ కంప్రెస్ కాకూడదు. అలా కంప్రెస్ అయితే ఆ కుర్చీలు తుంటి నొప్పి కలిగిస్తాయి.
డెస్క్ ముందు పనిచేసేటప్పుడు అప్పుడప్పుడు మోచేయి లేదా ముంజేయికి విశ్రాంతి ఇస్తుండాలి. దీనికోసం కుర్చీకి ఆర్మ్ రెస్ట్(arm rest) ఉందో లేదో గమనించుకోవాలి.
ఇది కూడా చదవండి: Early Dinner: రాత్రిపూట తొందరగా భోజనం చేయడం మంచిదేనా..? డాక్టర్లు చెబుతున్న నిజాలివీ..!
Updated Date - 2023-11-22T13:39:25+05:30 IST