Health Secrets: డయాబెటిస్‌కు ప్రధాన కారణం ఇదే అని పరిశోధకులు చెబుతున్నారు. అదేంటంటే !
ABN, First Publish Date - 2023-04-19T16:12:14+05:30
టైప్-2 మధుమేహం కేసుల్లో దాదాపు 1.4 కోట్ల కేసులు ఆహారపు అలవాట్లతోనేనని తాజాగా అమెరికాలోని టఫ్ట్స్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన ఓ సర్వేలో ..
డయాబెటిస్(Diabetes) అనేది దీర్ఘకాలిక వ్యాధి అని మనందరికి తెలిసిందే. ఇది క్లోమగ్రంథి (Pancreas) తగినంత ఇన్సులిన్( insulin)ను ఉత్పత్తి చేయనప్పుడు లేదా శరీరం ఉత్పత్తి చేసే ఇన్సులిన్‌ను సమర్థవంతంగా ఉపయోగించలేనప్పుడు సంభవిస్తుంది. ఇన్సులిన్ రక్తంలో గ్లూకోజ్(Glucose)ను నియంత్రించే హార్మోన్. దీనినే హైపర్ గ్లైకేసీమియా(Hyperglycaemia), బ్లడ్ గ్లూకోజ్(Blood glucose) లేదా బ్లడ్ షుగర్(blood sugar) అని కూడా పిలుస్తారు. డయాబెటిస్‌ను నియంత్రించకపోతే కాలక్రమేణా గుండె, కిడ్నీ, నరాలు(Nerves), రక్త నాళాలకు(Blood Vessels) తీవ్రమైన నష్టం కలిగిస్తుంది.
డయాబెటిస్ రెండు రకాలు.. టైప్-1(Type-1 Diabetes), టైప్-2డయాబెటిస్(Type-2 Diabetes). రోజురోజుకు డయాబెటిస్ బారిన పడిన వారి సంఖ్య పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాలకు ప్రధాన కారణాల్లో మధుమేహం కూడా ఒకటి.
అయితే ప్రపంచవ్యాప్తంగా టైప్-2 మధుమేహం కేసుల్లో దాదాపు 1.4 కోట్ల కేసులు ఆహారపు అలవాట్లతోనేనని తాజాగా అమెరికాలోని టఫ్ట్స్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడించారు. మొత్తం డయాబెటిస్ కేసుల్లో ఇవి 70శాతానికి పైనేనని వారు పేర్కొన్నారు. తమ అధ్యయన వివరాలను నేచర్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురించారు. ‘‘1990 నుంచి 2018 మధ్యలో ఉన్న ఆరోగ్య సమాచారం సహాయంతో మొత్తం 30 దేశాల్లో టైప్-2 మధుమేహ రోగులపై అధ్యయనం నిర్వహించిన పరిశోధకులు ఈ దేశాల్లో సరైన ఆహారపు అలవాట్లు(డైట్) లేని కారణంగా టైప్-2 మధుమేహం కేసులు ఎక్కువగా ఉన్నాయి.
కేవలం భారత్, నైజీరియా, ఇథియోపియాలు మాత్రం దీనికి మినహాయింపు. ప్రాసెస్ చేసిన మాంసం, బియ్యం, గోధుమలు, కృత్రిమ పళ్లరసాలు, అధిక కొవ్వు కలిగిన అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం వలన మధుమేహం తీవ్రత అధికంగా ఉంటోంది. కార్బోహైడ్రేట్లు ఈ వ్యాధి విషయంలో కీలకంగా మారాయి.
పరిశోధనలు పరిశీలించిన అన్ని దేశాల్లోనూ 1990 నుంచి 2018 వరకూ టైప్-2 మధుమేహం భారీగానే పెరిగింది. వ్యక్తులు, కుటుంబాలు, ఆరోగ్యవ్యవస్థలపై ఇది తీవ్రస్థాయి ప్రభావాన్ని చూపుతోంది. లాటిన్ అమెరికా, కరీబియన్ దేశాల్లో మధుమేహం సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఇక్కడ శీతల పానీయాలు అధికంగా సేవిస్తుండటం, మాంసాన్ని అధికంగా తినడమే అందుక్కారణం. ఈ అధ్యయన వివరాల ఆధారంగా విధానకర్తలు ప్రజల ఆరోగ్యాలను పరిరక్షించేలా చర్యలు తీసుకోవాలి’ అని పరిశోధకులు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
Obstructive Sleep Apnea: గురకను నివారించి, నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడే అద్భుత చిట్కాలు
Updated Date - 2023-04-19T16:31:45+05:30 IST