కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Health Tips: ఆరోగ్యం మీద స్పృహతో ఉప్పు తక్కువ తింటుంటారా? ఈ నిజాలు తెలిస్తే..

ABN, First Publish Date - 2023-10-08T15:22:00+05:30

ఉప్పు తక్కువ తింటే ఆరోగ్యంగా ఉంటారని, బీపి అస్సలు రాదని అంటూంటారు. కానీ అసలు నిజమేంటంటే..

Health Tips: ఆరోగ్యం మీద స్పృహతో ఉప్పు తక్కువ తింటుంటారా? ఈ నిజాలు తెలిస్తే..

ఉప్పు లేని వంట తినడం సాధ్యంకాదు. కానీ చాలామంది ఆరోగ్యకరమైన జీవనశైలి మెంటైన్ చేసే అలోచనలో ఉప్పు కారం తగ్గించుకుంటారు. ఉప్పు తక్కువ తినడం మంచిదే కానీ శరీరానికి తగినంత సోడియం లభించకపోతే మాత్రం ప్రమాదమే. సోడియం ఒక ముఖ్యమైన ఎలక్ట్రోలైట్. ఇది శరీరానికి ఎంతో అవసరం, అనేక ముఖ్యమైన విధులు నిర్వర్తించడంలో సోడియం ముఖ్య పాత్ర వహిస్తుంది. సోడియం తక్కువైతే కలిగే దుష్ప్రభావాలు(side effects of low sodium) ఏంటో తెలుసుకుంటే..

సోడియం తక్కువ అందడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్స్ అసమతల్యత ఏర్పడుతుంది. ఇది కండరాల తిమ్మిరి, బలహీనత, గుండె కొట్టుకునే వేగం క్రమం తప్పడం మొదలైన సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా ఎక్కువ శారీరక శ్రమ చేసేవారికి, క్రీడాకారులకు ఎలక్ట్రోలైట్లు లోపించడం ప్రమాదం.

రక్తపోటును సోడియం ప్రభావితం చేస్తుంది. తక్కువ రక్తపోటు ఉంటే దాన్ని హైపోటెన్షన్(hypotension) అంటారు. దీని వల్ల మైకం, మూర్చ, చూపు మందగించడం వంటి సమస్యలు ఎదురవుతాయి. హైపోటెన్షన్ ఎక్కువకాలం కొనసాగితే అది శరీరంలో ముఖ్యమైన అవయవాలకు తగినంత రక్తప్రసరణ అందకుండా చేస్తుంది. కాలక్రమంగా అనేక నష్టాలు కలిగిస్తుంది.

Health Tips: బరువు తగ్గడం కష్టంగా అనిపిస్తోందా?.. ఉదయం లేవగానే ఇదొక్కటి తాగి చూడండి..



రక్తంలో చాలా తక్కువ స్థాయిలో సోడియం కంటెంట్ ఉంటే హైపోనట్రేమియా(hyponatremia) అనే సమస్య వస్తుంది. ఈ సమస్య ఉన్నవారిలో వికారం, తలనొప్పి, గందరగోళం, మూర్చపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇది కొన్ని సందర్బాలలో ప్రాణానికి ప్రమాదం కలిగిస్తుంది.

తక్కువ సోడియం కంటెంట్ మాత్రపిండాలను ఇబ్బంది పెడుతుంది. మూత్రపిండాలు సమర్థవంతంగా పనిచేయాలంటే సరిపడినంత సోడియం అవసరం. సోడియం లేకపోతే మూత్రపిండాల మీద ఒత్తిడి పెరుగుతుంది. ఇది కిడ్నీలో రాళ్ళకు దారి తీస్తుంది. క్రమంగా మూత్రపిండాల పనితీరు తగ్గిపోతుంది.

తక్కువ సోడియం ఉన్న ఆహారాలు శరీరంలో ఇన్సులిన్ నిరోధకతను పెంచుతాయని వైద్యులు చెబుతున్నారు. ఈ కారణంగా సోడియం తక్కువ తీసుకుంటే అది కూడా టైప్-2 డయాబెటిస్ కు దారితీస్తుంది.

సోడియం తగ్గించడం వల్ల రక్తపోటు మందగిస్తుంది. ఇది హృదయనాళ వ్యవస్థపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. ఇది గుండెపోటు, స్ట్రోక్, వంటి హృదయ సంబంధ ప్రమాదాలను పెంచుతుంది.

శరీరంలో కండరాల సంకోచ వ్యాకోచానికి సోడియం అవసరం అవుతుంది. అలాగే నరాలు సమర్థవంతంగా పనిచేయడానికి కూడా సోడియం అవసరం. సోడియం లోపిస్తే దాని కారణంగా కండరాల బలహీనత, సంకోచ వ్యాకోచాలలో ఇబ్బంది, కొన్ని సందర్బాలలో పక్షవాతం కూడా సంభవిస్తుంది.

Health Fact: మహిళలు బ్రా ధరిస్తే రొమ్ముక్యాన్సర్ వస్తుందా? మగవారిలోనూ రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశముందా? అసలు నిజాలివే..


Updated Date - 2023-10-08T15:22:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising