ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Health Tips: పిల్లలకు ఆవు పాలు తాగిస్తున్నారా? ఈ నిజాలు తెలుసుకోకుంటే చాలా నష్టపోతారు!!

ABN, First Publish Date - 2023-09-03T15:15:01+05:30

ఆవుపాలు అమృతంతో సమానమని అంటారు. కానీ పూర్తీ నిజాలు తెలుసుకోకుండా పసిపిల్లకు ఆవు పాలు ఇస్తే..

ఆవుపాలు అమృతంతో సమానమని అంటారు. తల్లిపాల తరువాత పిల్లలకు ఆవుపాలు మంచివని కూడా అంటారు. అందుకే ప్రసవం తరువాత తల్లులకు పాలు పడకపోయినా, తల్లిపాలు బిడ్డకు ఒంటకపోయినా ఆవుపాల వైపు అందరూ మొగ్గుచూపుతారు. కానీ ఏడాది వయసులోపు పిల్లలకు బయటి పాలు వాడాల్సి వస్తే ఆవు పాలు మాత్రం అస్సలు వాడొద్దని అంటున్నారు వైద్యులు. అమృతంగా భావించే ఆవు పాలు పిల్లలకు ఎందుకు ఇవ్వకూడదు? ఏడాది లోపు పిల్లలకు ఏ పాలు ఇవ్వడం మంచిది? కాబోయే అమ్మల నుండి పసిపిల్లలు ఉన్న తల్లుల వరకు అందరికీ ఉపయోగపడే ఈ విషయం గురించి తెలుసుకుంటే..

బిడ్డ పుట్టిన తరువాత తల్లికి పాలు పడకపోయినా, తల్లిపాలు బిడ్డకు చాలకపోయినా, బిడ్డకు తల్లిపాలు వంటకపోయినా చాలామంది ఆవు పాలు(cow milk) ఎంచుకుంటారు. కానీ ఏడాది వయసులోపు పిల్లలకు ఆవు పాలు(cow milk for babies) అస్సలు ఇవ్వకూడదని వైద్యులు చెబుతున్నారు. చిన్నపిల్లలలో జీర్ణవ్యవస్థ(digestive system) చాలా సున్నితంగా ఉంటుంది. ఈ కారణం వల్ల పిల్లలకు ఆవు పాలు ఇవ్వడం వల్ల వారిలో జీర్ణసంబంధ సమస్యలు తలెత్తుతాయి. నిజానికి ఆవు పాలలో ఎక్కువ మొత్తంలో సోడియం, ప్రోటీన్, పొటాషియం ఉంటాయి. ఇవి పిల్లలకు జీర్ణం కావడం కష్టం.


చిన్నపిల్లలకు ఐరన్, విటమిన్-ఇ అవసరం అవుతాయి. ఇవి ఆవు పాలలో చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి. ఏడాది వయసులోపు పిల్లలకు అధికశాతం ఆహారంగా పాలు ఇస్తారు. ఐరన్ సరిపడినంత లేకపోవడం వల్ల పిల్లలలో ఐరన్ లోపం ఏర్పడుతుంది. ఇది పిల్లలలో రక్తహీనత సమస్యకు కారణమవుతుంది.

ఏడాది నిండిన పిల్లలకు ఆవు పాలు ఇవ్వవచ్చు. అయితే ఆవు పాలు మంచిది కదా అనే వంకతో 400మి.లీ లకు మించి ఆవు పాలు పిల్లలకు ఇవ్వకూడదు. అప్పుడప్పుడు కొద్ది మొత్తంలో ఇస్తుండాలి. ఏడాది తరువాత ఆవు పాలు ఇవ్వడం వల్ల పిల్లలలో కాల్షియం లోపం తొలగిపోతుంది, ఎముకలను బలపరుస్తుంది. పిల్లల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆవుపాలలోని ప్రోటీన్. కొవ్వులు పిల్లల శారీరక ఎదుగుదలకు బాగా ఉపయోగపడతాయి. ఇకపోతే ఏడాది వయసులోపు పిల్లలకు తల్లిపాలు కాకుండా ఇతర పాలు ఇవ్వాల్సిన అలసరం వస్తే చిన్నపిల్లల వైద్యులను కలిసి వారి సలహా మీద ఫార్ములా పాలు ఇవ్వాలని చెబుతున్నారు.

Viral Video: రన్నింగ్ ట్రైన్ లో ఊహించని సంఘటన.. ట్రైన్ తలుపు దగ్గర నిలబడి మరీ ఈ యువతి చేసిన పని చూస్తే..


Updated Date - 2023-09-03T15:15:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising