ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Health Tips: రాత్రి పూట స్నానం చేసే అలవాటుందా? అయితే ఈ నిజాలు తెలుసుకోవాల్సిందే..

ABN, First Publish Date - 2023-09-12T11:25:34+05:30

రాత్రి సమయంలో స్నానం చేస్తే రిలాక్స్ గా ఉంటుందని, చక్కగా నిద్రపడుతుందన్నది చాలా మంది అభిప్రాయం. కానీ రాత్రి సమయంలో స్నానం చేస్తే జరిగేది ఇదీ..

ఉదయాన్నే ఉద్యోగానికి వెళ్లి ట్రాఫిక్ జామ్ లలో చిక్కుకుని వాహనాల కాలుష్యం మధ్య ఇంటికి చేరుకోగానే చాలామందికి ఫ్రెష్ కావాలని అనిపిస్తుంది. ఈ కారణంగా రాత్రి సమయంలో స్నానం చేస్తుంటారు. కానీ రాత్రి సమయంలో స్నానం చేయకూడదట. రాత్రి సమయంలో స్నానం చేయడం అంటే కోరి ప్రమాదాన్ని తెచ్చుకోవడమే అని అంటున్నారు. అసలు రాత్రి స్నానం చేస్తే జరిగేదేంటి? ఇది ఎందుకు ప్రమాదం కలిగిస్తుంది? పూర్తీగా తెలుసుకుంటే..

సహజంగా రాత్రి సమయంలో శరీర ఉష్ట్రోగ్రత తగ్గుతుంది. ఈ కారణంగానే మెదడులో నిద్రకు సంబంధించిన సైకిల్ యాక్టివేట్ అవుతుంది. కానీ రాత్రి సమయంలో స్నానం చేయడం వల్ల శరీర ఉష్ట్రోగ్రత పెరుగుతుంది(increase body temparature). ఇది నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. మంచి నిద్రకోసం అంటూ చాలామంది రాత్రి సమయంలో స్నానం చేసినా, పడుకున్నప్పుడు మాత్రం సరిగా నిద్రలేకుండా అటూ ఇటూ దొర్లుతూ ఇబ్బంది పడటం గమనించవచ్చు. ఒకవేళ శరీరం అలసిపోయినట్టు అనిపించినా, రాత్రి స్నానం(bathing at night) చేస్తే బాగుంటుందని అనిపించినా పడుకోవడానికి కనీసం 2గంటల ముందు స్నానం చేయాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.

రాత్రిసమయంలో వేడి నీటితో(hot water) స్నానం చేసి హాయిగా భోజనం చేసి నిద్రపోతే ఆ సుఖమే వేరు అనుకుంటారు. కానీ రాత్రి సమయంలో వేడి నీటితో స్నానం చేయడం వల్ల గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. వేడినీటి స్నానం రక్తోపోటును ప్రభావితం చేస్తుంది. ఇది గుండెపై ఒత్తిడి కలిగిస్తుంది. గుండె సంబంధ సమస్యలు ఉన్నవారు రాత్రి సమయంలో స్నానం చేయకపోవడమే మంచిది.

Cow vs Snake: ఈ పామును ఆవు తినేసిందా..? లేక సర్పమే ఆవును కాటేసిందా..? ఏం జరిగిందో మీరే చూడండి..!



కొంతమంది రాత్రి స్నానం చేసిన తరువాత భోజనం చేస్తే, మరికొంతమంది మొదట భోజనం చేసి ఆ తరువాత రాత్రి పడుకునేముందు తీరిగ్గా స్నానం చేస్తారు. కానీ తిన్న తరువాత స్నానం చేస్తే అది జీర్ణవ్యవస్థను గందరగోళం చేస్తుంది. తిన్న ఆహారం సరిగా జీర్ణం కావాలంటే రక్తప్రసరణ ఎక్కువ అవసరం అవుతుంది. కానీ తిన్న వెంటనే స్నానం చేయడం వల్ల రక్తప్రసరణ శరీరమంతా వేగం పుంజుకుంటుంది. దీనివల్ల ఆహారం సరిగా జీర్ణం కాదు. ఇది అజీర్తి, అధిక బరువు(weight gain) సమస్యలకు కారణం అవుతుంది.

రాత్రి సమయంలో సాధారణ స్నానం చేస్తే కలిగే నష్టాల కన్నా, తల స్నానం(head bath) మరిన్ని ఎక్కువ నష్టాలు కలిగిస్తుంది. . రాత్రి తల స్నానం తరువాత జుట్టు సరిగా ఆరకముందే నిద్రపోతే అది సైనస్ వంటి సమస్యలకు దారితీస్తుంది. దిండు మీద హానికరమైన బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది చుండ్రు, సొరియాసిస్ వంటి జుట్టు సమస్యలకు కూడా కారణం కావచ్చు.

Metro Train: పోలీస్ కానిస్టేబుల్‌ ఒకే ఒక్క మాట అన్నందుకు.. ఈ ఇద్దరు యువతులు చేసిన రచ్చ మామూలుగా లేదుగా..!


Updated Date - 2023-09-12T11:25:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising