ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Health Tips: పెర్ఫ్యూమ్ కొట్టనిదే బయటకు వెళ్లలేరా? ఈ షాకింగ్ నిజాలు తెలిస్తే..

ABN, First Publish Date - 2023-10-24T16:51:40+05:30

పెర్ఫ్యూమ్ లేదా డియోడరెంట్ వాడటం వల్ల మగవారిలో కలుగుతున్న ఈ నష్టం ఇప్పుడు అందరినీ షాక్ కు గురిచేస్తోంది.

పెర్ఫ్యూమ్ లేదా డియోడరెంట్ ప్రజల జీవితాల్లో భాగమైపోయాయి. బయటకు వెళ్లాలనుకున్నప్పుడు ఎంత బాగా రెడీ అయినా చివరగా పెర్ప్యూమ్ కొట్టనిది బయటకు కదలరు. కొందరు పెర్ఫ్యూమ్ లేదా డియోడరెంట్ ను చెమట దుర్వాసన నుండి తప్పించుకోవడానికి ఉపయోగిస్తే మరికొందరు ఫ్యాషన్ లో భాగంగా వాడతారు. అయితే పెర్ప్యూమ్ వాడటం అంటే అనారోగ్యాన్ని మెల్లగా పెంచుకోవడమేనని అంటున్నారు. పెర్ఫ్యూమ్ తయారీలో పారాబెన్ ఎక్కువగా ఉంటుంది. ఇది స్త్రీ, పురుషులిద్దరికీ చాలా హానికరం. వాసన బాగుంటే చాలు పెర్ఫ్యూమ్ కొనేవారు, వాటిని ఉపయోగించేవారు తప్పకుండా తెలుసుకోవలసిన విషయాలివి.

పెర్ప్యూమ్(Perfume) లో చాలా రసాయనాలు ఉంటాయి. వీటిలో పారాబెన్(paraben) అనే రసాయం చాలా ముఖ్యమైనది. ఇది స్త్రీ, పురుషులిద్దరి ఆరోగ్యానికి మంచిది కాదు. ముఖ్యంగా ఇది పురుషులలో స్టెరాయిడ్ హార్మోన్లను(steroid hormones) పాడుచేస్తుంది. ఈ హార్మోన్లు క్షీణిస్తే పురుషుల పునరుత్పత్తి వ్యవస్థ దారుణంగా దెబ్బతింటుంది. నేటికాలంలో చాలామంది పిల్లలు పుట్టడంలో సమస్యలు ఎదుర్కోవడానికి ఇది కూడా ఒక కారణం అని అంటున్నారు.

మహిళలు కూడా పెర్ఫ్యూమ్ వాడకంలో ఓ మెట్టు పైనే ఉంటారు. పెర్ఫ్యూమ్ వాడటం వల్ల మహిళలలో రొమ్ము క్యాన్సర్(breast cancer), థైరాయిడ్ క్యాన్సర్(Thyroid cancer) కు దారితీస్తుంది.

Viral Video: వావ్ ఏం టెక్నిక్ బాస్.. చేతులు నొప్పులు రాకుండా గోధుమలను ఎలా శుభ్రం చేస్తున్నారో చూస్తే..



పెర్ఫ్యూమ్ రసాయనాల కారణంగా చర్మం దద్దుర్లు, దురద, అలర్జీ కి గురవుతుంది. కొత్త కొత్త పెర్ఫ్యూమ్ లు కొనుగోలు చేసి వాటిని వాడాలనే ఆసక్తి ఉన్నవారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

పెర్ఫ్యూమ్ కొట్టుకున్నప్పుడు ఆ స్ప్రే ఒంటిమీదకే కాకుండా చుట్టూ ఉన్న గాలిలో వ్యాపిస్తుంది. అందులో ఉన్న రసాయనాల గాఢత కారణంగా ఆ గాలి శ్వాసించినప్పుడు ఊపిరితిత్తుల మీద ప్రభావం పడుతుంది. ఇది మంటను ప్రేరేపిస్తుంది. ఆస్తమా, సిఓపిడి, శ్వాస సంబంధ సమస్యలున్నవారు పెర్ఫ్యూమ్ లు వాడకపోవడమే మంచిది.

తలనొప్పి, తల తిరగడం, వెర్టిగో వంటి సమస్యలు ఉన్నవారు పెర్ఫ్యూమ్ వాడితే అది మరింత పెరిగుతుంది. ఎందుకంటే పెర్ఫ్యూమ్ లో ఉండే పారాబెన్ న్యూరోపతి వ్యాధికి కారణమవుతుంది. దీనివల్ల శరీరంలో నరాలు మెల్లగా దెబ్బతింటాయి. తీవ్రత పెరగకముందే సమస్య గురించి తెలుసుకుని పెర్ఫ్యూమ్ లేదా స్పే వాడటం ఆపేయాలి.

పెర్ఫ్యూమ్ లేదా డియోడరెంట్ వాడే అలవాటు ఉన్నవారు తక్షణమే తాము ఉపయోగిస్తున్న పెర్ఫ్యూమ్ బాటిల్స్ మీద పారాబెన్ లు ఉన్నాయా లేదా అనే విషయాన్ని చెక్ చేసుకోవడం మంది. అలాగే కొత్తది కొనుగోలు చేసేటప్పుడు కూడా పారాబెన్ ను చెక్ చేసి కొనాలి.

Viral Video: రోడ్డు పక్కన టీ అమ్ముతున్న రజనీకాంత్.. ఇదేమైనా కొత్త సినిమా షూటింగేమో అనుకున్నారంతా.. కానీ అసలు సంగతి తెలిసి..


Updated Date - 2023-10-24T17:53:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising