Health Tips: నోట్లో పెదాల కింద ఇలాంటి పొక్కులు వచ్చాయా..? అసలు ఇవెందుకు వస్తాయో తెలిస్తే..!
ABN, First Publish Date - 2023-08-16T12:28:04+05:30
చాలామంది ఇలా నోట్లోను, పెదవుల కింద వచ్చే పొక్కులను వేడి పొక్కులని అంటూ ఉంటారు. కానీ వీటి వల్ల ముఖం, పెదవుల ప్రాంతం పాడైపోతుంది. ఇవెందుకొస్తున్నాయో తెలుసుకుంటే వీటి విషయంలో జాగ్రత్త పడచ్చు.
చాలామందికి నోట్లో పెదాల కింద బొబ్బలు లేచి, పొక్కులు వస్తుంటాయి. ఇవి చిన్న నీటిబుడగలాగా ఉంటాయి. చాలానొప్పిగానూ, ఆ ప్రాంతం చుట్టూ తిమ్మిరిని కలిగిస్తుంటాయి. వీటి కారణంగా తినడం నుండి తాగడం, మాట్లాడటం వరకు ప్రతితీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ పొక్కులు వచ్చినవారు ఆహారం సరిగా తీసుకోక రోజులో ఎక్కువ భాగం ఉపవాసం చేసేస్తుంటారు. చాలామంది వీటిని నోటిపూత అనుకుని భ్రమ పడుతుంటారు. కానీ ఈ రెండింటికి తేడా ఉంది. ఈ పొక్కులు ఎందుకు వస్తాయో తెలుసుకుంటే.. వీటికి పరిష్కారం కూడా సులువు అవుతుంది.
నోటిలో బొబ్బలు వచ్చి, పొక్కులు రావడం, కాళ్ళు చేతులలో జలధరింపు చాలామందిలో కనిపిస్తుంటాయి. అయితే దీనికి కారణం విటమిన్ బి-12లోపం(vitamin-B12 deficiency). కేవలం ఇవే కాదు, ముఖం మీద చీముతో కూడిన గుల్లలు, పెదవుల చుట్టూ పదే పదే పుండ్లు, పెదవుల చివర్లు చీలడం రక్తం రావడం వంటి సమస్యలన్నీ విటమిన్-బి12 లోపం లక్షణాలే. విటమిన్-బి12 శరీరంలో ఎర్రరక్తకణాల తయారీకి, డిఎన్ఎ ఏర్పడటానికి, నరాలు, కణాల పనితీరుకు చాలా అవసరం అవుతుంది. ఒకవేళ నోట్లో, పెదవుల కింద బొబ్బలు, పొక్కులు వచ్చాయంటే విటమిన్-బి12 లోపం ఏర్పడిందని అర్థం. దీన్ని గమనించుకుని విటమిన్-బి12 ను భర్తీ చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు పెద్దవి కాకుండా జాగ్రత్త పడచ్చు. విటమిన్-బి12 ఎందులో లభ్యమవుతుందో, దీన్ని సులువుగా పొందే మార్గమేమిటో తెలుసుకుంటే..
Health Tips: రోజుకొక యాపిల్ కాదు.. రోజుకొక జామపండు తింటే జరిగే మ్యాజిక్ ఇదే.. ముఖ్యంగా ఆ సమస్య ఉన్నవాళ్లకు..
పేదవాడి యాపిల్ గా పేరొందిన జామపండు(Guava)లో విటమిన్-బి12 ఉంటుంది. కేవలం ఇది మాత్రమే కాకుండా విటమిన్-సి, విటమిన్-ఎ, విటమిన్-కె, ఫోలిక్ యాసిడ్, పొటాషియం, పైబర్ కూడా జామపండ్లలో ఉంటాయి. ఇవి శరీరానికి చాలా అవసరమైనవి. జామపండ్లు తింటే బోలెడు రోగాలను దూరంగా ఉంచవచ్చు. విటమిన్-బి12 ను కూడా భర్తీ చేయవచ్చు.
పండ్లలో రారాజు అని మామిడిపండుకు(Mango) పేరు. మామిడిలో విటమిన్-బి12 సమృద్దిగా ఉంటుంది. విటమిన్-సి, విటమిన్-ఎ, విటమిన్-కె, పొటాషియం వంటి ఇతర పోషకాలు కూడా మామిడిపండులో ఉంటాయి. మామిడిపండ్లు తింటే ఈ పోషకాలన్నీ పొందవచ్చు.
కేరళీయులు తమ ఆహారంలో ఎక్కువగా పచ్చికొబ్బరి(Raw coconut) ఉపయోగిస్తారు. పచ్చికొబ్బరిలో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్-ఇ, కాల్షియం, ఫైబర్ వంటివి పుష్కలంగా ఉంటాయి. దీన్ని తరచుగా తీసుకుంటూ ఉంటే విటమిన్-బి12 కూడా భర్తీ అవుతుంది.
సిట్రస్ పండ్ల(citrus fruits)లో నారింజ పండును(Orange) ది బెస్ట్ గా చెప్పవచ్చు. వీటిలో విటమిన్-సి, విటమిన్-ఎ, కాల్షియం, పొటాషియం, ఫైబర్ తో పాటు విటమిన్-బి12 కూడా ఉంటుంది. నారింజ పండ్ల జ్యూస్ కానీ, నారింజ పండ్లు కానీ తీసుకుంటూ ఉంటే విటమిన్-బి12 ను భర్తీ చేయడమే కాకుండా రోగనిరోధక శక్తని పెంచడంలోనూ, వృద్దాప్యాన్ని నెమ్మది చేయడంలోనూ, చురుగ్గా ఉంచడంలోనూ సహాయపడుతుంది. ఇది మాత్రమే కాకుండా ద్రాక్ష(Grapes), కివి(Kiwi), యాపిల్(Apple) వంటి సిట్రస్ పండ్లు కూడా తీసుకోవచ్చు.
అందరికీ అందుబాటు ధరలో, అన్ని సీజన్లలో లభ్యమయ్యే అరపండులో(Banana) కూడా విటమిన్-బి12 ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా విటమనిన్-బి6, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ కూడా సమృద్దిగా ఉంటాయి. అరటిపండు రోజూ తింటూ ఉంటే ఇవన్నీ భర్తీ అవుతాయి.
Food Habits: రోజూ పొద్దున్నే ఈ 5 రకాల టిఫిన్లను మాత్రం అస్సలు తినకండి.. పొరపాటున తింటే జరిగేది ఇదే..!
Updated Date - 2023-08-16T12:28:04+05:30 IST