Home Making Tips: ఎంత శుభ్రం చేసినా ఈగలు ఇంట్లోంచి వెళ్లడం లేదా..? ఈ సింపుల్ టిప్స్‌తో వాటిని చంపకుండానే పారిపోయేలా చేయొచ్చు..!
ABN, First Publish Date - 2023-06-06T10:09:02+05:30
ఆడవారు ఎంతో ఓపికతో ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటారు. కానీ తుడిచిన నిమిషాల్లోపే ఇంట్లో ఈగలు దర్శనమిస్తుంటాయి. వంటగదిలో అయితే మరీ దారుణంగా..
ఆడవారు ఎంతో ఓపికతో ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటారు. కానీ వేసవికాలంలో తొందరగా కుళ్ళిపోయే పండ్ల వల్ల, ఆ తరువాత వర్షాల దాటికి దోమలు, ఈగలు ఇల్లంతా చాలా గందరగోళం సృష్టిస్తాయి. వీటి కారణంగా ఇంటిని పదే పదే తుడిచినా పెద్దగా ఫలితం ఉండదు. తుడిచిన నిమిషాల్లోపే ఇంట్లో ఈగలు(flies) దర్శనమిస్తుంటాయి. వంటగదిలో అయితే మరీ దారుణంగా వంటపాత్రల మీద, నీటి బిందెలమీద వాలుతూ ఉంటాయి. ఈగలను తరిమికొట్టడానికి ఎన్నో చిట్కాలు కూడా ఫాలో అవుతారు కానీ ఆశించిన ఫలితం ఉండదు. అయితే ఈ టిప్స్ ఫాలో అయితే ఈగలను సులువుగా ఇంట్లో నుంచి తరిమికొట్టవచ్చు.
హోమ్ మేడ్ స్ప్రే..(Home made spray)
ఈగలను తరిమికొట్టడానికి ఇంట్లో తయారు చేసిన అద్భుతమైన స్ప్రే బాగా పనిచేస్తుంది. దీనికి పెద్దగా ఖర్చు కూడా అవ్వదు. ఒక కప్పు నీటిలో(cup water) ఒక నిమ్మకాయ రసం(1 lemon juice) పిండాలి. అందులోకి రెండు టీస్పూన్ల ఉప్పు(2spoons salt) కలపాలి. ఉప్పు కరిగిపోయే వరకు బాగా మిక్స్ చేసి దీన్ని స్ప్రే బాటిల్ లో పోసుకోవాలి. ఈ స్ప్రేను ఈగలు ఉన్న ప్రాంతాల్లో, ఇంటి మూలల్లో చల్లాలి. ఈగలకు పులుపు అంటే సరిపడదు. ఈ కారణంగా ఈగలు పారిపోతాయి.
Viral Video: పెళ్లి వేదికపై వరుడి డాన్స్.. వధువు కూడా కాలు కదిపేందుకు రెడీ అవుతుండగా సడన్‌గా అత్త ఎంట్రీ.. చివరకు..!
నాప్తలీన్ గుండ్లు..(napthalene balls)
ప్రతి ఇంట్లో దుస్తులను చెదపురుగులు, రిల్లలనుండి కాపాడుకోవడానికి బట్టల షెల్ఫ్ లు, బీరువాలలో నాప్తలీన్ గుండ్లు వాడతారు. ఆ నాప్తలీన్ గుండ్ల సహాయంతో ఈగలను సులువుగా తరిమికొట్టవచ్చు. నాలుగైదు నాప్తలీన్ గుండ్లు తీసుకుని బాగా గ్రైండ్ చేసి పొడి(napthalene powder) చేయాలి. దీన్ని నీళ్ళలో వేసి(water), ఇందులో కాస్త వెనిగర్(vinegar) కలపాలి. ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టి నాప్తలీన్ పౌడర్ కరిగిపోయే వరకు వేడి చేయాలి. దీన్ని స్ప్రే బాటిల్ లో వేసుకుని ఇల్లంతా చల్లుకోవాలి. ఆ తరువాత యదావిధిగా ఇల్లు తుడుచుకోవాలి. ఈ టిప్ ఫాలో అయితే కేవలం నిమిషంలోనే ఈగలు ఇంటినుండి పారిపోతాయి.
కారంపొడితో చిట్కా..(chilli powder)
కారం పొడి అంటే ఈగలకు చాలా చిరాకు. 1స్పూన్ కారంపొడిని(1spoon chilli powder) కొన్ని నీళ్లలో వేసి బాగా కలపాలి. దీన్ని ఇంటి తలుపులు, కిటికీల వద్ద చిలకరించాలి. ఇలా చేస్తే ఈగలు అసలు రానేరావు. వంటగదిలో సింక్ వద్ద, డ్రైనేజీ దగ్గర కూడా ఇలా చేయచ్చు.
కేవలం చిట్కాలు పాటించడం వల్ల మాత్రమే ఈగలు పోతాయనుకుంటే పొరపాటు. ఇంట్లో మురికి ఎక్కువగా పేరుకుని పోయినా, డస్ట్ బిన్ ను ఎక్కువసేపు అలాగే ఉంచేస్తున్నా, డస్ట్ బిన్ ప్రాంతాన్ని సరిగ్గా శుభ్రం చేయకపోయినా ఈగలు చాలా తొందరగా తిరిగివస్తాయి. అలాగే సింకులో పాత్రలు కడగకుండా అలాగే ఉంచడం, ఇంటి మూలల్లో సరిగా శుభ్రం చేయకపోవడం కూడా ఈగలకు కారణం అవుతుంది.
Bluetooth: మీ ఫోన్లలో బ్లూటూత్‌ను ఎప్పుడూ ఆన్ చేసే ఉంచుతున్నారా..? అయితే మీరు డేంజర్ జోన్‌లో ఉన్నట్టే..!
Updated Date - 2023-06-06T10:09:02+05:30 IST