ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video:చూస్తే చిన్నదే కానీ...ఏకంగా మూడు చిరుతలతో ఎలా ఫైట్ చేసిందో చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..

ABN, First Publish Date - 2023-05-06T17:30:17+05:30

అప్పుడప్పుడు జంతువులు కొట్లాడటం మనం చూస్తుంటాం. సాధారణంగా వాటిలో బాగా బలంగా ఉన్న జంతువులు, పులులు, సింహాలలాంటి క్రూర జంతువులు ఈ కొట్లాటలో పైచేయి కావడం మనం చూస్తుంటాం. అయితే ఇక్కడ సీన్ రివర్స్ అయింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అప్పుడప్పుడు జంతువులు కొట్లాడటం మనం చూస్తుంటాం. సాధారణంగా వాటిలో బాగా బలంగా ఉన్న జంతువులు, పులులు, సింహాలలాంటి క్రూర జంతువులు ఈ కొట్లాటలో పైచేయి కావడం మనం చూస్తుంటాం. అయితే ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఒక చిరుత పులి..కాదుకాదు.. మూడు చిరుత పులులతో మామూలు సైజులో ఉండే ఒకే ఒక్క జంతువు ఓ రేంజ్‌లో ఫైటింగ్ చేసింది. ఇంకా చెప్పాలంటే వాటిని హడలెత్తించి..చివరికి ఎస్కేప్ అయింది. ఇంతకీ ఆ జంతువు ఏంటో తెలుసా..? అదే హానీ బ్యాడ్జర్.. మూడు చిరుతలు, హాని బ్యాడ్జర్ కొట్లాటకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో మొదట రెండు చిరుతలు ఓ హానీ బ్యాడ్జర్‌పై దాడి చేశాయి. పదునైన దంతాలతో చీల్చేందుకు ప్రయత్నించాయి. పక్కనే మరొక చిరుత దాడి చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ మూడు చిరుతలనుంచి తప్పించుకునేందుకు హానీ బ్యాడ్జర్ చేసిన పోరాటం అంతాఇంతా కాదు. అయితే ఒక చిరుత నుంచి విదిలించుకన్న హానీ బ్యాడ్జర్..వెంటనే రెండో చిరుతపై ఎదురుదాడికి దిగింది. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. మూడో చిరుతపై దాడి చేసింది. ఒకదానిపై.. తర్వాత మరొకదానిపై ఇలా మూడు చిరుతలపై దాడి చేస్తూనే ఉంది. అంతేకాకుండా చిరుతలు కూడా తమ ఆహారాన్ని వదులుకునే సిద్ధంగా లేవు.. వెంట వెంటనే హానీ బ్యాడ్జర్‌పై దాడి చేస్తూనే ఉన్నాయి. మరోసారి హానీ బ్యాడ్జర్‌ వెనకభాగంపై ఓ చిరుత దాడి చేసింది. కానీ ఆ బ్యాడ్జర్ వెనకకు తిరిగి ఎదురుదాడి చేసింది. అంతేకాదు ఆ మూడు చిరుతలను వెంబడించింది.

కాసేపు పోరాడిన తరువాత, హానీ బ్యాడ్జర్ చిరుతపులులనుంచి సురక్షితంగా తప్పించుకుంది. తమ ఆహారం తప్పించుకుపోవడంతో.. అలా చూస్తుండి పోయాయి ఆ మూడు చిరుతలు.

Updated Date - 2023-05-06T17:37:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising