Viral Video: మిరాకిల్ అంటే ఇదేనేమో.. టర్కీలో 21 రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడిన మూగజీవి..!
ABN, First Publish Date - 2023-02-28T12:30:39+05:30
టర్కీ, సిరియాలలో భారీ భూకంపం (Earthquake) ఎంతటి విధ్వంసం సృష్టించిందో తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్: టర్కీ, సిరియాలలో భారీ భూకంపం (Earthquake) ఎంతటి విధ్వంసం సృష్టించిందో తెలిసిందే. 50వేల మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులు అయ్యారు. ఇటీవలి కాలంలో సంభవించిన అతిపెద్ద ప్రకృతి వైపరీత్యం కూడా ఇదే. శిథిలాలను తొలగించే కొద్ది కుప్పలుతెప్పలుగా మృతదేహాలు బయటపడ్డాయి. భారత్ సహా చాలా దేశాలు టర్కీ, సిరియాలో (Syria) రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. అలాగే తమవంతు సాయంగా మెడిసిన్స్, నిత్యావసర వస్తు సామాగ్రి పంపించాయి. ఇక రోజులు గడిచేకొద్ది శిథిలాల కింద చిక్కుకున్నవారు బతికే అవకాశం లేదని రెస్క్యూ ఆపరేషన్లు నిలిపివేశారు అక్కడి అధికారులు.
ఇదిలాఉంటే.. తాజాగా టర్కీలో (Turkey) ఓ మిరాకిల్ జరిగింది. 21 రోజుల తర్వాత శిథిలాల కింద ప్రాణాలతో ఉన్న ఓ గుర్రాన్ని (Horse Found Alive) గుర్తించారు. అనంతరం దాన్ని స్థానికులు బయటకు తీశారు. ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. టర్కీలోని అదియమాన్ అనే ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక శిథిలాల కింది నుంచి తీసిన తర్వాత గుర్రం మాములుగానే నడుచుకుంటూ వెళ్లడం మనం వీడియోలో చూడొచ్చు. అంతేగాక దాని శరీరంపై కూడా అంతగా గాయాలు లేవు. గుర్రాన్ని రెస్క్యూ చేసే సమయంలో ఎవరో వీడియో తీసి నెట్టింట పెట్టడంతో ప్రస్తుతం అది వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు దీనిపై తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇప్పటివరకు ఈ వీడియోకు 8.20లక్షల వ్యూస్, 27వేల లైక్స్ వచ్చాయి.
ఇది కూడా చదవండి: గతేడాది రూ.25 కోట్ల లాటరీ గెలిచిన ఈ ఆటో డ్రైవర్.. ఇప్పుడు ఏం చేస్తున్నాడో.. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో తెలిస్తే..
Updated Date - 2023-02-28T12:30:52+05:30 IST