Shocking: సిటీల్లో అద్దెకు ఉంటున్న వాళ్ల కష్టాలకు ఇదే ప్రత్యక్ష సాక్ష్యం.. చిన్న తప్పునకు ఓ యజమాని ఎంత జరిమానా విధించాడో చూస్తే..!
ABN, First Publish Date - 2023-10-17T14:37:23+05:30
మహా నగరాల్లోని అద్దె ఇళ్లు దొరకడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఎంతో కష్టపడి అద్దె ఇల్లు చూసుకున్న తర్వాత ఆ ఇంటి యజమాని పెట్టే కండీషన్లకు తల తిరిగిపోతుంది. మెట్రో నగరాల్లో అద్దె ఇళ్లలో నివసించే వారందరూ ఎన్నో అవస్థలు పడుతుంటారు. మన దేశంలోనే కాదు.. ఇతర దేశాల్లో కూడా ఇదే పరిస్థితి.
మహా నగరాల్లోని అద్దె ఇళ్లు దొరకడం (Rented Houses) అంటే సామాన్యమైన విషయం కాదు. ఎంతో కష్టపడి అద్దె ఇల్లు చూసుకున్న తర్వాత ఆ ఇంటి యజమాని పెట్టే కండీషన్లకు తల తిరిగిపోతుంది. మెట్రో నగరాల్లో అద్దె ఇళ్లలో నివసించే వారందరూ ఎన్నో అవస్థలు పడుతుంటారు. మన దేశంలోనే కాదు.. ఇతర దేశాల్లో కూడా ఇదే పరిస్థితి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ (Viral) అవుతున్న ఓ విషయం గురించి తెలుసుకుంటే షాక్ అవ్వాల్సిందే. ఆ ఇంటి యజమాని (House Owner) దురాశ చూసి నివ్వెరపోవాల్సిందే.
ఆస్ట్రేలియా (Australia)లోని సిడ్నీలో ఈ ఘటన జరిగింది. చెక్క ఫ్లోర్ మీద చిన్న గీత (Scratch on Floor) పడినందుకు ఇంటి యజమాని ఏకంగా రూ.52 వేల రూపాయల జరిమానా విధించాడు. ఆ ఫైన్ (Fine) చూసి ఇంట్లో అద్దెకు ఉన్న వ్యక్తి షాకయ్యాడు. ఆ ఘటనను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ``ఇంట్లోనే చెక్క ఫ్లోర్‌పై చిన్న గీత పడింది. అందువల్ల మా ఇంటి యజమాని ఏకంగా 1000 ఆస్ట్రేలియా డాలర్లు అడిగాడు. ఇది మీకు హాస్యాస్పదంగా అనిపిస్తోందా? ఆ చిన్న గీత పడినందు వల్ల ఆ ప్యానెల్ మొత్తం మారుస్తానని మా ఇంటి యజమాని చెబుతున్నాడ``ని ఆ వ్యక్తి వాపోయాడు.
Fight in Train: అప్పర్ బెర్త్ కోసం ఇద్దరు కుర్రాళ్ల మధ్య బిగ్ ఫైట్.. అదిరిపోయే కామెంటరీతో పండుగ చేసుకున్న ప్రయాణీకులు..!
ఈ పోస్ట్ రెడ్డిట్‌లో వైరల్‌గా మారింది. ఈ పోస్ట్‌పై నెటిజన్లు భారీగా స్పందించారు. ``అంత చిన్న గీతకు అంత పెద్ద ఫైన్.. ట్రిబ్యునల్‌లో ఫిర్యాదు చేయండి``, ``మీరు ఇచ్చే డబ్బులతో పైన ఇంకో అంతస్థు వేయాలనుకుంటున్నాడేమో``, ``యజమాని మీ డబ్బులతో మొత్తం ఫ్లోరింగ్ మార్చాలనుకుంటున్నాడు``, ``ఎంత దౌర్జన్యం`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
Updated Date - 2023-10-17T14:37:23+05:30 IST