ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Onion Powder: ఉల్లిపాయ పౌడర్‌తో ఏ వంటకమైన అదుర్స్.. మరి ఈ పౌడర్‌ను ఇంట్లోనే ఎలా చేసుకోవాలో తెలుసా?

ABN, Publish Date - Dec 22 , 2023 | 07:43 PM

ఉల్లిపాయ పౌడర్‌ను ఇంట్లోనే చేసుకోవడం ఎలా..

ఇంటర్నెట్ డెస్క్: ఉల్లిపాయల ముక్కలు, లేదా పేస్ట్‌ను వంటకాల్లో వాడటం అందరికీ తెలిసిందే కానీ ఉల్లిపాయల పౌడర్‌తో ప్రతి ఫుడ్‌ను టేస్టీగా చేసుకోవచ్చు. ఉల్లి పౌడర్‌ను మారినేడ్స్, రబ్స్, డ్రెస్సింగ్స్, సీజనింగ్ బ్లెండ్స్ వాటిలో వాడొచ్చు. అంతేకాదు.. పౌడర్‌గా జల్లుకున్నా కూడా ఆహారానికి ఓ కొత్త టేస్ట్ వస్తుంది. సూప్స్, సాసెస్, గ్రేవీస్, కాసెరోల్స్ వంటి వాటికి ఉల్లి పౌడర్ జత చేస్తే వచ్చే టేస్టే వేరు.

ఇన్ని ఉపయోగాలు ఉన్న ఉల్లి పౌడర్‌ను ఇంట్లో కూడా సులభంగా చేసుకోవచ్చు. ముందుగా ఉల్లిని ఎండబెట్టి ఆపైన పొడి చేసి నచ్చిన వంటకాల్లో వేసుకోవచ్చు. మరి ఇంట్లోనే ఉల్లిపొడిని ఎలా తయారు చేసుకోవాలో ఓమారు చూద్దాం పదండి.


పౌడర్ చేసుకునేందుకు ముందుగా తాజాగా ఉన్న ఉల్లిపాయలను ఎంచుకోవాలి.

ఆ తరువాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. ముక్కల సైజలు ఒకేరకంగా ఉంటే ఎండబెట్టడం సులభమవుతుంది.

ఉల్లిపాయ స్లైసులను ఒకపొరగా డీహైడ్రేటర్ ట్రేలో పెట్టాలి. ఈ తరువాత ఓమాదిరి ఉష్ణోగ్రత ( 57 డిగ్రీల సెల్సియస్) వద్ద డిహైడ్రేట్ చేయాలి (ఉల్లిలోని తేమను తొలగించడం). డిహైడ్రేటర్‌లో సుమారు 12 గంటలు ఉంచాక వాటిని బయటకు తీయాలి.

ఇళ్లల్లో డిహైడ్రేటర్ లేని వాళ్లు ఒవెన్‌లో కూడా ఉల్లిని ఎండబెట్టొచ్చు. ఇందుకోసం ఉల్లిపొరలను బేకింగ్ షీట్ మీద పెట్టాలి. మరోవైపు, ఒవెన్‌ను తక్కువ ఉష్ణోగ్రత వద్ద సెట్ చేయాలి. ఆ తరువాత, వాటిని ఒవెన్‌లో పెట్టి తలుపు కాస్తంత తెరిచి ఉంచాలి. దాదాపు 8 నుంచి 12 గంటల తరువాత వీటిని బయటకు తీయాలి.

బాగా ఎండిన తరువాత ఉల్లిముక్కలను మిక్సీలో వేసి మెత్తని పొడి వచ్చేవరకూ బాగా తిప్పాలి. అనంతరం, పొడిని ఎయిర్ టైట్ డబ్బాల్లోకి సద్దుకోవాలి. ఇలా చేస్తే పౌడర్‌లో తాజాదనం చాలాకాలం పాటు నిలిచి ఉంటుంది. పౌడర్‌ను చల్లగా ఉండే ప్రదేశంలో పెడితే చాలా కాలం పాటు నిల్వ ఉంటుంది.

Updated Date - Dec 22 , 2023 | 07:52 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising