ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Cold Drink facts: ఒక గ్లాసు శీతల పానీయంలో ఎంత చక్కెర ఉంటుంది? శరీరంపై దీని ప్రభావం ఏ మేరకు ఉంటుందో తెలిస్తే...

ABN, First Publish Date - 2023-03-08T10:44:08+05:30

Cold Drink facts: వేసవి రాగానే చల్లని వస్తువుల వినియోగం పెరుగుతుంది. వీటిలో శీతల పానీయాల వినియోగం ఎక్కువగా ఉంటుంది. శీతల పానీయం(Cold Drink) రుచి అందరినీ మైమరపిస్తుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

Cold Drink facts: వేసవి రాగానే చల్లని వస్తువుల వినియోగం పెరుగుతుంది. వీటిలో శీతల పానీయాల వినియోగం ఎక్కువగా ఉంటుంది. శీతల పానీయం(Cold Drink) రుచి అందరినీ మైమరపిస్తుంది. శాస్త్రవేత్తలు(Scientists) తెలిపిన వివరాల ప్రకారం శీతల పానీయాలు ఆరోగ్య పరంగా అస్సలు మంచివి కాదు. శీతల పానీయాలు తీసుకోవడం వల్ల శరీరంలో చక్కెర శాతం(Sugar percentage) పెరుగుతుంది. దీని ప్రభావం ఆరోగ్యంపై ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

బరువు పెరుగుదల

శీతల పానీయాలను అధికంగా తీసుకోవడం వల్ల వేగంగా బరువు పెరుగుతారు. శీతల పానీయాలలో చక్కెర అధికంగా ఉంటుంది. అలాగే అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలు(Health related problems) ఎదురవుతాయి. ఒక గ్లాసు శీతల పానీయంలో 8 నుంచి 10 టీస్పూన్ల చక్కెర ఉంటుంది.

ఆరోగ్య సమస్యలు

చల్లని పానీయాలు తాగడం ద్వారా ఆహారంలో అధిక చక్కెర తీసుకున్నవారవుతారు. ఇది ఆరోగ్యానికి ఏ విధంగానూ మంచిది కాదు. ఒక గ్లాసు శీతల పానీయంలో దాదాపు 150 కేలరీలు(150 calories) ఉంటాయి. ప్రతిరోజూ ఇలా కేలరీలు తీసుకోవడం వల్ల బరువు(weight) పెరుగుతారు. పలు ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు.

కాలేయ ఆరోగ్య సమస్య(Liver health problem)

శీతల పానీయాలను మోతాదుకు మించి తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్(Fatty liver) సమస్యలు తలెత్తుతాయి. శీతల పానీయాలలో రెండు రకాల చక్కెరలు ఉంటాయి. మొదటిది గ్లూకోజ్(Glucose). ఇది శరీరంలోకి త్వరగా కలసిపోతుంది. రెండవది ఫ్రక్టోజ్. ఇది కాలేయం(liver)లో నిల్వ అవుతుంది. ప్రతిరోజూ శీతల పానీయాలు తాగడం వల్ల కాలేయంలో ఫ్రక్టోజ్ అధికంగా పేరుకుపోయి కాలేయానికి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి.

మధుమేహం

శీతల పానీయాలలో చక్కెర పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, దాని వినియోగం మధుమేహం(diabetes) సమస్యను కూడా తెచ్చిపెడుతుంది. శీతల పానీయాలు శరీరంలోని చక్కెరను వెంటనే పెంచుతాయి. ఇది ఇన్సులిన్‌(Insulin)ను వేగంగా విడుదల చేస్తుంది. ఇది మధుమేహానికి దారి తీస్తుంది.

దంతాల మీద ప్రభావం

శీతల పానీయాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల దంతాల మీద ప్రభావం పడుతుంది. శీతల పానీయాలలో ఫాస్ఫోరిక్ ఆమ్లం, ఇతర రకాల ఆమ్లాలు ఉంటాయి. ఇవి దంతాల(teeth) ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.

Updated Date - 2023-03-08T11:22:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising