Wife: ఏడుస్తూ పోలీస్ స్టేషన్‌కు వచ్చిందో భార్య.. భర్త కొడుతున్నాడంటూనే.. ఆమె చెప్పిన కారణం విని అవాక్కైన పోలీసులు..!
ABN, First Publish Date - 2023-09-09T16:27:26+05:30
భార్యాభర్తల మధ్య గొడవలనేవి సహజం. ఏదో విషయమై భార్యాభర్తలు తరచుగా గొడవపడుతుంటారు. భర్త వేధింపులు ఎక్కువైతే భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడం కూడా జరుగుతుంటుంది. ఇటీవల గుజరాత్‌లోని వడోదరలో కూడా ఓ మహిళ తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అసలు విషయం తెలుసుకుని పోలీసులే షాకయ్యారు.
భార్యాభర్తల మధ్య గొడవలనేవి సహజం. ఏదో విషయమై భార్యాభర్తలు తరచుగా గొడవపడుతుంటారు. భర్త (Husband)వేధింపులు ఎక్కువైతే భార్య (Wife) పోలీసులకు ఫిర్యాదు చేయడం కూడా జరుగుతుంటుంది. ఇటీవల గుజరాత్ (Gujarat)లోని వడోదరలో కూడా ఓ మహిళ తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త తనను కొడుతున్నాడని ఆరోపించింది. అయితే భర్త ఆమెను ఎందుకు కొడుతున్నాడో తెలుసుకుని పోలీసులు అవాక్కయ్యారు. ఈ ఘటన సంచలనంగా మారింది (Crime News).
వడోదరకు (Vadodara) చెందిన ఓ మహిళ ఇటీవల పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్‌కు ఫోన్ చేసి తన భర్తపై ఫిర్యాదు చేసింది. బాలీవుడ్ కండల హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) సినిమాలు చూస్తుంటే తనను కొడుతున్నాడని పేర్కొంది. గతంలో ఒకసారి తాను సల్మాన్ ఖాన్ సినిమా చూసి అతడిని ప్రశంసించానని, అప్పట్నుంచి తన భర్తలో ఈర్ష్య మొదలైందని తెలిపింది. టీవీలో సల్మాన్ సినిమా వస్తే ఛానల్ మార్చేసేవాడని, ఆ తర్వాత సల్మాన్ నటించిన యాడ్స్ కూడా చూడవనివ్వలేదని పేర్కొంది (Viral News).
Railway Station: ప్రపంచంలో ఎక్కడా లేని అరుదైన రైల్వే స్టేషన్.. ఒకటో ప్లాట్‌ఫామ్ నుంచి రెండో ప్లాట్‌ఫామ్‌కు వెళ్లాలంటే..!
ఆ భర్త అనుమానం ఎంత వరకు వెళ్లిందంటే బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన సల్మాన్ ఖాన్ హోర్డింగ్‌లు కూడా చూడనిచ్చేవాడు కాదని తెలిపింది. ఇటీవల టీవీలో సల్మాన్ సినిమా చూస్తుంటే గొడవ పడి తనను కొట్టాడని, అందువల్ల ఇంట్లో నుంచి బయటకు వచ్చేశానని ఆమె తెలిపింది. ఆమె చెప్పింది విని పోలీసులు షాకయ్యారు. ఒక బిడ్డకు తండ్రి కూడా అయిన ఆ వ్యక్తి ప్రవర్తన పోలీసులకే షాకిచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భార్యాభర్తలిద్దరికీ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు.
Updated Date - 2023-09-09T16:27:26+05:30 IST