Husband: విడాకులు ఇచ్చాక కూడా భార్యపై కసి తీర్చుకునేందుకు భర్త పక్కా స్కెచ్.. 7 బస్తాల్లో రూపాయి కాయిన్స్‌తో కోర్టుకు.. చివరకు..!
ABN, First Publish Date - 2023-06-21T11:34:36+05:30
భార్యాభర్తల బంధం వికటిస్తే చాలా భారం అవుతుంది. ఇలాంటి సందర్భాలలో భార్యాభర్తలు ఒకరినొకరు భరించలేక విడాకులు తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ విడాకులు తీసుకునే క్రమంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. తాజాగా ఓ జంట విడాకులు తీసుకుని విడిపోయింది. విడాకులు ఇచ్చాక కూడా ఆ భర్త భార్య మీద పగపెట్టుకున్నాడు. పక్కాగా ప్లాన్ చేసి భార్యను ఏడిపించాడు.
భార్యాభర్తల బంధం చాలా అందమైనది. కానీ ఆ బంధం వికటిస్తే చాలా భారం అవుతుంది. ఇలాంటి సందర్భాలలో భార్యాభర్తలు ఒకరినొకరు భరించలేక విడాకులు తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ విడాకులు తీసుకునే క్రమంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. తాజాగా ఓ జంట విడాకులు తీసుకుని విడిపోయింది. విడాకులు ఇచ్చాక కూడా ఆ భర్త భార్య మీద పగపెట్టుకున్నాడు. 7బస్తాల్లో రూపాయి కాయిన్స్ నింపుకుని కోర్టుకు చేరుకున్నాడు. ఈ సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
రాజస్థాన్(Rajasthan) రాష్ట్రం జైపూర్ లో ధశరత్ కమావత్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఇతనికి 12ఏళ్ళ కిందట సీమ అనే మహిళతో వివాహం జరిగింది. పెళ్ళయ్యాక కొన్నేళ్ళు బానే ఉన్నారు. ఆ తరువాత ధశరత్ తన భార్యను పుట్టింటికి వెళ్ళి అదనపు కట్నం తీసుకురావాలని వేధించడం మొదలు పెట్టాడు. సీమ అతనితో సర్దుకుపోవాలని ఎంత ప్రయత్నించినా ఆమె వల్ల కాలేదు. దీంతో ఆమె తనకు భర్తనుండి విడాకులు(divorce) కావాలంటూ కోర్టును ఆశ్రయించింది(women approach court for divorce). కోర్టువారు వారు 5ఏళ్ల పాటు వీరి కేసు విచారణ చేసి విడాకులు మంజూరు చేశారు. దాంతో పాటు ఆమెకు భరణంగా(alimony) నెలనెలా కొంత సొమ్ము ఇవ్వాలని తీర్పు ఇచ్చారు. అయితే ధశరత్ కోర్టు చెప్పినట్టు సీమకు భరణం ఇవ్వలేదు. ఈ డబ్బు సుమారు 1.75లక్షల అప్పుగా మారింది. భర్త భరణం ఇవ్వకపోయే సరికి సీమ మళ్ళీ కోర్టును ఆశ్రయించింది. తమ తీర్పును నిర్లక్ష్యం చేసినందుకుగానూ ధశరత్ ను అరెస్ట్ చేయాలని ఉత్తర్వులు జారీచేసింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ధశరత్ ను అరెస్ట్ చేశారు.
Viral Video: మనుషుల్లో దేవుడంటే నువ్వే భయ్యా.. ఎర్రటి ఎండలో ఓ వృద్దుడు రిక్షా లాగుతోంటే చూడలేక ఈ ఆటోవాలా ఏం చేశాడంటే..
పోలీసులు ధశరత్ ను అరెస్ట్ చేయడంతో ఈ సంఘటన ఊహించని మలుపు తీసుకుంది. సీమకు ఇవ్వాల్సిన భరణం సొమ్మును చెల్లించేందుకు ధశరత్ కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. మొదటి విడత చెల్లింపులో భాగంగా వారు 7బస్తాలతో(7 sacks)కోర్టుకు చేరుకున్నారు. డబ్బులెక్కడని కోర్టువారు అడగ్గా బస్తాలలో తీసుకొచ్చిన రూపాయి నాణేలు(7 sacks one rupee coins) చూపించారు. ఆ నాణేలు 55వేలు(55thousand one rupee coins) విలువ చేస్తాయని వారు చెప్పారు. అది చూడగానే జడ్జితో సహా అందరూ బిత్తరపోయారు. సీమ ఆమె కుటుంబ సభ్యులు ఆ సంచులలో ఉన్న కాయిన్స్ చూసి షాకయ్యారు. డబ్బును కాయిన్స్ రూపంలో తీసుకురావడమేంటని కోర్టు వారు ప్రశ్నించగా.. 'ధశరత్ వ్యాపారంలో డబ్బు ఎక్కువగా నాణేల రూపంలోనే సాగుతుంది. వారి దగ్గర అదే ఉంది' అని ధశరత్ లాయర్ సమర్థించాడు. ఆ కరెన్సీ చెలామణిలో ఉన్నదే కాబట్టి దాన్ని తోసిపుచ్చలేరని చెప్పుకొచ్చాడు. అయితే కోర్టువారు మాత్రం ఆ కాయిన్స్ ను లెక్కపెట్టడానికి సుమారు 10రోజులు పడుతుందని, దాన్ని వెనక్కు తీసుకుని వెయ్యిరూపాయల చెప్పున సంచులలో వేసి జూన్ 26వ తేదీన తిరిగి తీసుకురమ్మని తీర్పు ఇచ్చారు. ఇంకా 1.20లక్షల బకాలు మిగిలుండటంతో దాని చెల్లింపు ఎలా ఉంటుందోనని ఈ విషయం తెలిసిన వారు చర్చించుకుంటున్నారు. కాగా 300కిలోల బరువు తూగిన ఈ నాణెల బస్తాలను చూసేందుకు ప్రజలు కోర్టు ఆవరణానికి పోటెత్తారు.
Head Bath: వారంలో ఎన్నిసార్లు తలస్నానం చెయ్యాలి? ఎలా చేస్తే జుట్టు బాగా పెరుగుతుందంటే..
Updated Date - 2023-06-21T11:34:36+05:30 IST