Viral News: శభాష్ కుమారీ.. భర్త కండక్టర్‌గా పనిచేస్తున్న బస్సులోనే డ్రైవర్‌గా ప్రతిరోజూ డ్యూటీ.. అసలు వీళ్లిద్దరి కథేంటంటే..!
ABN, First Publish Date - 2023-11-06T16:17:37+05:30
ఉత్తరప్రదేశ్ రోడ్ వేస్‌కు చెందిన లోని డిపోకు చెందిన ఓ బస్సు స్థానికంగా చాలా ప్రాచుర్యం పొందింది. దాన్ని స్థానికులు ఫ్యామిలీ బస్ అని సరదాగా పిలుచుకుంటుంటారు. ఎందుకంటే ఆ బస్సు డ్రైవర్‌గా ఓ మహిళ విధులు నిర్వర్తిస్తుండగా.. ఆమె భర్త కండక్టర్‌గా పని చేస్తున్నాడు.
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రోడ్ వేస్‌కు చెందిన లోని డిపోకు చెందిన ఓ బస్సు స్థానికంగా చాలా ప్రాచుర్యం పొందింది. దాన్ని స్థానికులు ఫ్యామిలీ బస్ అని సరదాగా పిలుచుకుంటుంటారు. ఎందుకంటే ఆ బస్సు డ్రైవర్ (Bus Driver)గా ఓ మహిళ విధులు నిర్వర్తిస్తుండగా.. ఆమె భర్త కండక్టర్ (Conductor)గా పని చేస్తున్నాడు. భార్యాభర్తలిద్దరూ కలిసి ఆ బస్సులో సర్వీస్ చేస్తున్నారు. పోలీస్ కావాలని కలలు కన్న వేద్ కుమారి అనే మహిళ ఇప్పుడు యూపీ రోడ్‌వేస్‌కు రథసారధిగా మారింది. ఆమె భర్త ముఖేష్ ప్రజాపతి కూడా అదే బస్సులో కండక్టర్‌గా పనిచేస్తున్నారు (Viral News).
UP రోడ్‌వేస్ (UP Roadways)లో మహిళా బస్ డ్రైవర్ల కోసం ప్రకటన వచ్చిన వెంటనే వేద్ కుమారీ అప్లై చేసింది. స్కిల్ డెవలప్‌మెంట్ మిషన్ కింద ఉత్తర ప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (UPSRTC) మద్దతుతో వేద్ కుమారి 2021 సంవత్సరంలో మోడల్ డ్రైవింగ్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, కాన్పూర్‌లో అడ్మిషన్ తీసుకుంది. అక్కడ భారీ వాహనాలు నడపడంలో శిక్షణ తీసుకుంది. అప్పటికే ఆమె భర్త యూపీ రోడ్ వేస్‌లో కండక్టర్‌గా పని చేస్తున్నాడు. శిక్షణ అనంతరం వేద్ కుమారి ఈ ఏడాది ఏప్రిల్‌లో డ్రైవర్‌గా బాధ్యతలు తీసుకుంది.
Crime: నిన్ను మా కూతురిలా భావించాము.. మా కొడుకును ఎందుకిలా చేశావంటూ.. నిలదీసిన తల్లిదండ్రులు.. అసలేం జరిగిందంటే..!
ప్రస్తుతం వేద్ కుమారి, ముఖేష్ కలిసి కౌశాంబి-బదౌన్ మార్గంలో బస్సును నడుపుతున్నారు. ప్రస్తుతానికి వీరిద్దరూ కాంట్రాక్ట్ కార్మికులుగానే విధులు నిర్వర్తిస్తున్నారు. కాంట్రాక్టుపై నియమితులైన ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని వేద్ కుమారి డిమాండ్ చేస్తున్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ మాత్రమే ఇలాంటి నిర్ణయం తీసుకోగలరని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
Updated Date - 2023-11-06T16:17:39+05:30 IST