Husband: భార్యను చంపి.. మృతదేహాన్ని బెడ్రూంలో దాచి.. తాళం వేసి వెళ్లిపోయిన భర్త 24 గంటల తర్వాత ఏం చేశాడంటే..!
ABN, First Publish Date - 2023-08-30T14:44:17+05:30
ఆ వ్యక్తి ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు.. అతడి భార్య ఓ షాపింగ్ మాల్లో పని చేస్తోంది.. ఈ జంటకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.. పని చేసే చోట భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని భర్తకు అనుమానం మొదలైంది.. ఆమెను ప్రతిరోజూ వేధించేవాడు..
ఆ వ్యక్తి ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని ఆగ్రాలో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు.. అతడి భార్య (Wife) ఓ షాపింగ్ మాల్లో పని చేస్తోంది.. ఈ జంటకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.. పని చేసే చోట భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం (Extra Marital Affair) పెట్టుకుందని భర్త (Husband)కు అనుమానం మొదలైంది.. ఆమెను ప్రతిరోజూ వేధించేవాడు.. ఆమె ఎదురుతిరిగితే కొట్టేవాడు.. సోమవారం ఈ విషయమై భార్యాభర్తల మధ్య పెద్ద గొడవ జరిగింది.. తీవ్ర ఆగ్రహానికి గురైన భర్త భార్యను చంపేశాడు.. అనంతరం మృతదేహాన్ని బెడ్రూంలో దాచి పరారయ్యాడు (Crime News).
ఆగ్రా (Agra)లోని నాగ్లా హవేలీ ప్రాంతంలో శిశుపాల్, దీపమాల దంపతులు తమ ముగ్గురు పిల్లలతో కలిసి జీవిస్తున్నారు. శుశుపాల్ ఆగ్రాలో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. దీపమాల ఓ షాపింగ్ మాల్లో పని చేస్తోంది. తనతో పాటు కలిసి పని చేసే వ్యక్తితో దీపమాల వివేహతర సంబంధం పెట్టుకుందని శిశుపాల్‌కు అనుమానం మొదలైంది. అనుమానంతో రోజూ భార్యను వేధించేవాడు. ఆమె ఎదురు తిరిగితే కొట్టేవాడు. గత సోమవారం కూడా వీరి మధ్య గొడవ జరిగింది (Husband Killed Wife).
Viral Video: ఈ టెక్నిక్ తెలియక ఎంత కష్టపడ్డాం.. భారీ ట్రాలీ బ్యాగ్‌లను బైక్‌పై కూర్చుని ఎలా తీసుకెళ్తున్నాడో చూడండి..
తీవ్ర ఆగ్రహానికి గురైన శిశుపాల్ భార్యను కొట్టి చంపేశాడు. మృతదేహాన్ని బెడ్రూమ్లో ఉంచి తాళం వేసుకుని వెళ్లిపోయాడు. రోజంతా ఎక్కడెక్కడో తిరిగాడు. ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. తన భార్యను చంపేసినట్టు అంగీకరించాడు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. కాగా, ఘటన జరిగిన సమయంలో ముగ్గురు పిల్లలు నాయనమ్మ ఇంట్లో ఉన్నారు.
Updated Date - 2023-08-30T14:44:17+05:30 IST